STOCKS

News


ఐపీఓకు నిహిలెంట్‌ టెక్నాలజీస్‌

Saturday 11th August 2018
Markets_main1533973370.png-19177

ముంబై:- ఐటీ సెల్యూషన్స్‌ కంపెనీ నిహిలెంట్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు సిద్ధమైంది. అందుకు సంబంధిత ముసాయిదా పత్రాలను శుక్రవారం మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబికి సమర్పించింది. ఓపెన్‌ ఆఫర్‌ పద్ధతిలో మొత్తం 21.25లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.250 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఈ ఐపీఓ ప్రక్రియకు మోతిలాల్‌ ఓస్వాల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ లిమిటెడ్‌ బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్‌గానూ, లింక్‌ ఇన్‌టైం ఇండియా ప్రైవేట్‌ కంపెనీ లిమిటెడ్‌ రిజస్టర్‌గానూ వ్యవహరించనున్నాయి. ఐపీఓ అనంతరం ఇరు ఎక్చ్సేంజ్‌ల్లో లిస్టింగ్‌ అవనుంది. స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కావడం వల్ల వచ్చే ప్రయోజనాలు పొందడం,  బ్రాండ్‌ ఇమేజ్‌ విస్తరించుకోవడం లక్ష్యాలుగా ఈ కంపెనీ ఐపీఓకు వస్తోంది. పూణే ప్రధాన కేంద్రంగా పనిచేసే నిహిలెంట్‌ టెక్నాలజీస్‌ ఇండియాతో పాటు అమెరికా, యూకే, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.



You may be interested

ఈ మూడు స్టాక్స్‌ కొనొచ్చు..

Saturday 11th August 2018

బ్రోకరేజ్‌ సంస్థ జేఎం ఫైనాన్సియల్‌ మూడు స్టాక్స్‌ కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తోంది. ఆ షేర్లివే.. స్టాక్‌: రిలయన్స్‌ నిప్పాన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.237 టార్గెట్‌ ప్రైస్‌: రూ.330 అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (ఏఎంసీ) పరిశ్రమలో ఇటీవల కాలంలో స్థూల కమిషన్‌ చెల్లింపులు పెరిగాయని జేఎం ఫైనాన్షియల్‌ పేర్కొంది. ఇదే సమయంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి గత రెండేళ్లలో ఇన్వెస్ట్‌మెంట్లు కూడా గణనీయంగా పెరిగాయని తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో టాప్‌

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌

Saturday 11th August 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం రాత్రి విదేశీ మార్కెట్లో 24 పాయింట్ల నష్టంతో 11,415 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది మన మార్కెట్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ ముగింపుకన్నా తక్కువ స్థాయిలో ఉందని గమనించాలి. దీంతో అంతర్జాతీయంగా, దేశీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తనప్పుడు సోమవారం నిఫ్టీ నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇక అమెరికా మార్కెట్లు కూడా శుక్రవారం నష్టాల్లో ఉండటం ప్రతికూల అంశం. నాస్‌డాక్‌ 53 పాయింట్ల నష్టంతో 7,839 వద్ద, డౌజోన్స్‌ 196 పాయింట్ల

Most from this category