STOCKS

News


నిఫ్టీకి 10,790 కీలకం

Wednesday 20th February 2019
Markets_main1550686511.png-24266

వరుసగా ఎనిమిది షెషన్ల నష్టాల తర్వాత నిఫ్టీకి బుధవారం లాభాలొచ్చాయి. దిగువ వైపు నుంచి నిఫ్టీ కోలుకోవడంతోపాటు తక్షణ నిరోధ స్థాయి 10,683ను దాటి క్లోజయింది. దీంతో గురువారం మార్కెట్‌ తీరుపై జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ తన అంచనాలను తెలియజేశారు. 

 

నిఫ్టీ సానుకూలంగా ట్రేడింగ్‌ ఆరంభించినప్పటికీ... సెషన్‌లో ఎక్కువ సమయం పాటు 100 రోజుల సగటు చలనం (100డీఎంఏ) 10,683 వద్ద నిరోధాన్ని ఎదుర్కొన్నది. చివరి గంటలో సూచీ ఈ స్థాయిని అధిగమించి 131 పాయింట్ల లాభంతో, 1.24 శాతం పెరిగి క్లోజయింది. గురువారం సానుకూలంగా మార్కెట్లు ప్రారంభం కావచ్చు. ఆ తర్వాత ర్యాలీ కొనసాగొచ్చు. నిఫ్టీ క్రితం స్థాయిల వరకు వెళుతుందా అన్నదే కీలకం. 50 డీఎంఏపైన ఇండెక్స్‌ ఈ వారంలో ముగుస్తుందా అన్నది కీలకం అవుతుంది. ఇది 10,790 వద్ద ఉంది. 10,820, 10,860 నిరోధ స్థాయిలుగా పనిచేస్తాయి. దిగువన 10,680, 10,640 మద్దతు స్థాయిలు. రిలేటివ్‌ స్ట్రెంత్‌ ఇండెక్స్‌ (ఆర్‌ఎస్‌ఐ) రోజువారీ చార్ట్‌లో 45.8745 వద్ద స్థిరంగానే ఉంది. రోజువారీ ఎంఏసీడీ బేరిష్‌గా ఉంది. ఇండెక్స్‌ మరోసారి 10,640ను బ్రేక్‌ చేయనంత వరకు లేదా క్లోజింగ్‌ బేసిస్‌లో 10,680 దిగువన ముగియనంత వరకు ఇది మార్కెట్‌కు బోటమ్‌గా పనిచేస్తుంది. అయినప్పటికీ ఇక్కడి నుంచి ఎగువ స్థాయి వైపు ర్యాలీ అంత సాఫీగా ఉండదు. కీలకమైన నిరోధ స్థాయిలను ఇండెక్స్‌ అధిగమించాల్సి ఉంటుంది. 



You may be interested

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టీ

Thursday 21st February 2019

క్రితం ట్రేడింగ్‌లో భారీ లాభాల్ని ఆర్జించిన సూచీలు గురువారం స్థిరంగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 81 పాయింట్లు లాభంతో 35,837 వద్ద, నిఫ్టీ 9 పాయింట్ల స్వల్ప లాభంతో 10,744.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన అవసరాల నిమిత్తం రూ.48,239 కోట్లు ఇచ్చేందుకు బుధవారం కేంద్ర అంగీకారం తెలపడంతో ఈ రంగానికి చెందిన ర్యాలీ చేస్తున్నాయి. మిశ్రమ అంతర్జాతీయ పరిమాణాలు, రూపాయి బలహీనత, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ

మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో జెమ్స్‌!

Wednesday 20th February 2019

గతేడాది ఆగస్ట్‌ నుంచి స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ భారీగా నష్టపోయాయి. దీంతో ఈ స్టాక్స్‌లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఒకటికి, రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత ఆగస్ట్‌ నుంచి ఈ విభాగంలో చాలా స్టాక్స్‌ 98 శాతం వరకూ నష్టపోయాయి. కానీ, ఇదే కాలంలో సెన్సెక్స్‌, నిఫ్టీలు రికవరీ కావడం గమనార్హం. అయితే, ఇలా దారుణంగా పడిపోయిన స్టాక్స్‌లో మంచి జెమ్స్‌ కూడా ఉన్నాయంటున్నారు అనలిస్టులు.    గతేడాది ఆగస్ట్‌ నుంచి

Most from this category