STOCKS

News


10600 పాయింట్లు కోల్పోతే మరిన్ని ఇక్కట్లు!

Saturday 16th February 2019
Markets_main1550320213.png-24230

దేశీయ మార్కెట్లు ఈ వారమంతా పతనాన్ని కొనసాగించాయి. సన్‌ఫార్మా, యూబీ, ఎంఎంటీసీలాంటి కంపెనీలు మంచి ఫలితాలు ప్రకటించినా సూచీల్లో పాజిటివ్‌ స్పందన కనిపించలేదు. రాజకీయ అస్థిరత,  అధిక వాల్యూషన్ల కారణంగా పలు స్టాకుల్లో ప్రాఫిట్‌ బుకింగ్‌ ఎక్కువైంది. లార్జ్‌క్యాప్‌ దిగ్గజాలు నేల చూపులు చూడడంతో సూచీలు నష్టాల్లో వారాన్ని ముగించాయి. అయితే మార్కెట్లో ఒడిదుడుకులు చాలా తక్కువగా నమోదవుతుండడంతో బేర్స్‌ పట్టు కోల్పోతున్నారని నిపుణులు భావిస్తున్నారు. క్రూడాయిల్‌ ధరలు కాస్త పెరగడం కూడా రికవరీపై ఆశలు పెంచే ఛాన్సులున్నాయి. చార్టులను పరిశీలిస్తే నిఫ్టీ దిగువ మద్దతు రేఖను టచ్‌ చేసి రికవరీ చూపింది. తాజా పతనానికి 50 శాతం రిట్రేస్‌మెంట్‌స్థాయి 10870 వరకు సూచీ బౌన్స్‌ అయ్యే అవకాశం వచ్చే వారం కనిపిస్తోంది. వచ్చే వారం డెడ్‌క్యాట్‌ బౌన్స్‌ తప్పకపోవచ్చు.

సూచీల్లో నెలకొన్న భారీ నిరాశాపూరిత వాతావరణం దిగువన 10600 వద్ద బలమైన మద్దతు స్థాయిని ఏర్పరిచింది. ఈ స్థాయిని కోల్పోయే రేంజ్‌లో నెగిటివ్‌నెస్‌ పెరిగితే మాత్రం ఇప్పట్లో రికవరీ కష్టమని నిపుణుల అంచనా. 10600 పాయింట్ల దిగువన పతనం చాలా వేగంగా ఉండొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రేడర్లు కాస్త పెరిగినప్పుడల్లా కచ్ఛితమైన స్టాప్‌లాస్‌తో షార్ట్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. 10600 పాయింట్లను కోల్పోతే ఉధృతంగా షార్ట్‌ చేయవచ్చు. ఎర్నింగ్స్‌ సీజన్‌ దాదాపు ముగిసినందున ఇకపై పెద్దగా ప్రభావం చూపే వార్తలు ఉండకపోవచ్చు. అందువల్ల మరికొన్నాళ్లు నిఫ్టీ పరిమిత శ్రేణిలోనే ట్రేడయ్యే అవకాశం ఉంది. జమ్ముకాశ్మీర్‌లో పరిస్థితి అనంతరం తీసుకునే రాజకీయ చర్యలు సైతం సూచీలపై ప్రభావం చూపవచ్చు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు ట్రేడింగ్‌కు దూరంగా ఉండడం, ఉన్న పొజిషన్లకు కచ్ఛిత స్టాప్‌లాస్‌ పాటించడం చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. You may be interested

ఈ స్టాక్స్‌ సంపద సృష్టిస్తాయా...?

Monday 18th February 2019

వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌ను పాటించే ప్రముఖ ఇన్వెస్టర్‌ సంజయ్‌ భక్షి ‘వ్యాల్యూక్వెస్ట్‌ ఇండియా మోట్‌ ఫండ్‌’ పోర్ట్‌ఫోలియోను పరిశీలించడం వల్ల రిటైల్‌ ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియో నిర్మాణ పరంగా కొంత అవగాహన పొందొచ్చు. ఆయన పోర్ట్‌ఫోలియోలో ఎన్నో స్టాక్స్‌ ఉన్నప్పటికీ... స్టాక్‌ ఎక్సేంజ్‌ల వద్దనున్న సమాచారం ప్రకారం ఏడు కంపెనీల్లో ఒక శాతానికి పైగా ఈ ఫండ్‌కు వాటాలు ఉన్నట్టు తెలుస్తోంది.    అంబికా కాటన్‌ మిల్స్‌, అసెల్యా కాలే సొల్యూషన్స్‌, టీవీఎస్‌ శ్రీచక్ర,

నిరంతరాయ పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌పై కేంద్రం కసరత్తు

Saturday 16th February 2019

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వినియోగదారులు బహిరంగ ప్రదేశాల్లో నిరంతరాయంగా పబ్లిక్ వై-ఫై సేవలు పొందేలా ఇంటరాపరబిలిటీ విధానాన్ని అమల్లోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. దీనిపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌, సర్వీస్ ప్రొవైడర్లతో చర్చలు జరుపుతున్నట్లు టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ చెప్పారు. ఇది ఇటు వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉండటంతో  పాటు ‍అటు చిన్న స్థాయి ఔత్సాహిక వ్యాపారవేత్తలకు కొంత ఆదాయ వనరుగా కూడా ఉండగలదని ఆమె తెలిపారు.

Most from this category