News


నిఫ్టీ చార్టుల్లో డోజీ సిగ్నల్‌

Saturday 8th June 2019
Markets_main1559988296.png-26181

అనిశ్చితి కొనసాగుతుందన్న సంకేతం
డైలీ చార్టుల్లో నిఫ్టీ డోజీ తరహా క్యాండిల్‌ను ఏర్పరిచింది. ఈ క్యాండిల్‌ సూచీల్లో అనిశ్చితి కొనసాగుతుందనేందుకు సంకేతంగా చెబుతారు. అయితే క్యాండిల్‌కు ఉన్న పొడవైన తోక, ఇంట్రాడేలో అమ్మకాల వెల్లువను సూచిస్తోంది. వీక్లీచార్టుల్లో సూచీ బేరిష్‌ డార్క్‌ క్లౌడ్‌ కవర్‌ను ఏర్పాటు చేసింది. స్వల్పకాలానికి నిఫ్టీ 11750- 11800 పాయింట్ల మధ్య మద్దతు పొందుతుందని, ఈ జోన్‌ను కాపాడుకోలేకపోతే 11550- 11650 వరకు పతనమవుతుందని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. శుక్రవారం నిఫ్టీ కీలకమైన 11800 దిగువకు చేరింది, కానీ వెంటనే బలం పుంజుకొని వేగంగా పైకి ఎగిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో డోజీ క్యాండిల్‌ ఏర్పడడం అస్థిరతకు, అనిశ్చితికి సంకేతమని షేర్‌ఖాన్‌ పేర్కొంది.

వీక్లీ చార్టుల్లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. వచ్చేవారం మార్కెట్‌ స్వల్ప అప్‌మూవ్‌ చూపవచ్చని, ఆ తర్వాత మరికొంత మేర బేరిష్‌నెస్‌ కొనసాగిస్తుందని అంచనా వేసింది. ఒకవేళ నిఫ్టీ బలంగా 11760 పాయింట్ల దిగువన కదలాడితే స్వల్పకాలిక నెగిటివ్‌ సంకేతంగా భావించాలని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ‘సెల్‌ ఆన్‌ రైజ్‌’(పెరిగినప్పుడు అమ్ము) సూత్రం పాటించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. డెరివేటివ్స్‌ డేటా చూస్తే నిఫ్టీకి పైన 12000- 12040 పాయింట్ల వద్ద నిరోధం, 11750- 11800 పాయింట్ల వద్ద మద్దతు ఉన్నట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో బడ్జెట్‌పై ఊహాగానాలు, అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్‌ను నడిపిస్తాయి. సూచీలు దీర్ఘకాలికంగా చూస్తే అప్‌మూవ్‌లోనే ఉన్నా, సరైన పతనం అనంతరమే తిరిగి పరుగు ఆరంభిస్తాయని అనలిస్టుల అభిప్రాయం. You may be interested

క్రెడిట్‌ గ్రోత్‌ అంతంతే!

Saturday 8th June 2019

ఫిచ్‌ రేటింగ్‌ అంచనా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ లిక్విడిటీ సమస్య, డిఫాల్ట్‌కు దారితీయడం.. దేశ ఎన్‌బీఎఫ్‌సీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు అద్దం పడుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజన్సీ ఫిచ్‌ వ్యాఖ్యానించింది. ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు చేపట్టినా క్రెడిట్‌గ్రోత్‌ అమాంతంగా పెరిగే ఛాన్సులు కనిపించడం లేదని తేల్చిచెప్పింది. ఎన్‌బీఎఫ్‌సీలు మాత్రమే భారీ లిక్విడిటీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, బ్యాంకులకు పెద్దగా ఈ సమస్యలేదని తెలిపింది. అయితే బ్యాంకుల్లో ఆస్తుల నాణ్యత, మూలధన బలహీనత అనే సమస్యలున్నాయని తెలిపింది.

జూలైలోనే ఫెడ్‌ రేట్ల తగ్గింపు?!

Saturday 8th June 2019

మేలో యూఎస్‌ ఉద్యోగ గణాంకాలు బలహీనంగా ఉండడంతో జూలై సమీక్షలో ఫెడ్‌ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఒకపక్క ప్రధాన వాణిజ్య భాగస్వామ్యులతో ట్రంప్‌ పేచీలు పడుతున్న సమయాన జాబ్‌ రిపోర్ట్‌ బలహీనంగా రావడంతో ఫెడ్‌ రేట్‌కట్‌కు తొందరపడవచ్చని అంచనా వేస్తున్నారు. మేలో పేరోల్స్‌లో 75వేల పెరుగుదల కనిపించింది. ఇది అంచనాల కన్నా తక్కువగా ఉంది. బ్లూమ్‌బర్గ్‌ సర్వేలో నిపుణులు పేరోల్స్‌ పెరుగుదల 1,75,000 వరకు ఉంటుందని అంచనా

Most from this category