STOCKS

News


9800 పాయింట్ల వరకు పతనం?!

Saturday 6th October 2018
Markets_main1538817745.png-20925

నిఫ్టీ చార్టుల్లో ఇండికేటర్లు ‘సెల్‌’ సంకేతాలు ఇస్తున్నాయని, అందువల్ల మధ్యకాలానికి నిఫ్టీలో అమ్మకాలు కొనసాగుతాయని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌  అంచనా వేసింది. నెలవారీ చార్టుల్లో బేరిష్‌ ఎంగల్ఫింగ్‌ క్యాండిల్‌ ఏర్పడిందని తెలిపింది. ఈ క్యాండిల్‌ సాధారణంగా మరింత బలహీనతకు చిహ్నమని తెలిపింది. దీంతో పాటు నిఫ్టీ కీలకమైన 200 రోజుల డీఎంఏ కన్నా దిగువన క్లోజయిందని అందువల్ల రికవరీ అవకాశాలు కనిపించడంలేదని తెలిపింది. వరుసగా నిఫ్టీ రెండు రోజుల పాటు 200 రోజుల డీఎంఏ స్థాయికి దిగువన క్లోజయింది.

ఇన్వెస్టర్లలో ఆశ, భయాలను సూచించే వీఐఎక్స్‌ సూచీ దీర్ఘకాలానికి బుల్లిష్‌గా మారిందని, అందువల్ల సూచీల్లో భయమే ఆధిపత్యం వహిస్తుందని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ వ్యూహకర్త అరుణ్‌కుమార్‌ చెప్పారు. ఇవన్నీ పరిశీలిస్తే నిఫ్టీ రాబోయే రోజుల్లో 10000 పాయింట్లు, 9800 పాయింట్ల వరకు క్షీణించే ఛాన్సులు ఎక్కువని అభిప్రాయపడ్డారు. ప్రధాన స్టాకులన్నీ బలహీనంగా కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే పలు స్టాకులు తమ 52 వారాల కనిష్ఠస్థాయిలను తాకాయి. ఇంకా పలు స్టాకులు ఇదే బాటలో ఉన్నాయి. నిఫ్టీ 9800- 10000 పాయింట్ల రేంజ్‌లో కాంట్రా బయింగ్‌ కనిపించే అవకాశాలున్నాయని అరుణ్‌ చెప్పారు. కాంట్రా కొనుగోళ్లు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తతో అన్ని అధ్యయనం చేసి ఎంచుకోవాలని చెప్పారు. స్మాల్‌, మిడ్‌ క్యాప్స్‌లో ఇంకా బాటమ్‌ వచ్చినట్లు భావించడంలేదని తెలిపారు. అందువల్ల వీటికి ఇప్పటికైతే దూరంగా ఉండడం మంచిదన్నారు. 



You may be interested

ఆటో పరిశ్రమపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిపోర్టు

Saturday 6th October 2018

పలు తలనొప్పులున్నప్పటికీ సెప్టెంబర్‌లో ఆటో కంపెనీల విక్రయాలు అంచనాలకు అటుఇటుగానే నమోదయ్యాయి. కేరళ వరదలు, క్రూడాయిల్‌ ధరల పెరుగుదల ఆటో అమ్మకాలను కుంగదీశాయి. అయితే రూరల్‌ రికవరీ కొనసాగడంతో అమ్మకాలు నిలదొక్కుకున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఇకపై అందరి దృష్టి రాబోయే పండుగ సీజన్‌పై ఉంది. పాసింజర్‌, కమర్షియల్‌ వాహనాల విక్రయాల్లో పండుగ సీజన్‌ జోరు తెస్తుందని అంచనా వేసింది. తాజా కరెక‌్షన్‌తో పలు ఆటో స్టాకులు ఆకర్షణీయంగా మారాయని

స్మార్ట్‌ఫోన్స్‌పై అదిరే అఫర్లివే..

Saturday 6th October 2018

మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీలు వాటి స్మార్ట్‌ఫోన్లపై మెగా డిస్కౌంట్‌ను ప్రకటించాయి. అక్టోబర్‌ 11న ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డే సేల్‌లో ధరలను 62 శాతం వరకు తగ్గిస్తున్నట్లు పేర్కొన్నాయి.  ► దిగ్గజ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ శాంసంగ్‌ తన గెలాక్సీ ఎస్‌8పై రూ.20,000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇది రూ.29,990కి లభ్యం కానుంది. ప్రస్తుతం దీని ధర రూ.45,990గా ఉంది. కాగా కంపెనీ ఈ మోడల్‌ను రూ.49,990 ధరతో

Most from this category