STOCKS

News


నిఫ్టీ ట్రేడింగ్‌ రేంజ్‌ మారింది!

Wednesday 24th April 2019
Markets_main1556108841.png-25319

ఇప్పటివరకు 11550- 11750 పాయింట్ల మధ్యన కదలాడుతున్న నిఫ్టీ రేంజ్‌ ప్రస్తుతం పైవైపునకు జరిగిందని బుధవారం ట్రేడింగ్‌ అనంతరం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నిఫ్టీ రేంజ్‌ 11600- 11800 పాయింట్లకు మారిందని, ఇందుకు తగ్గట్లే నిఫ్టీ 11600 పాయింట్ల నుంచి బలంగా బౌన్సైందని చెబుతున్నారు. మంగళవారం ఇంట్రాడేలో నిఫ్టీ 11560 పాయింట్లను టచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థాయిల వద్ద నిఫ్టీలో కొనుగోళ్లు కనిపించాయి. ఈ రోజు చివర్లో కొనుగోళ్లు ముమ్మరమై నిఫ్టీ బలంగా క్లోజయింది. ఇకపై నిఫ్టీలో పరుగు కొనసాగాలంటే 11666 పాయింట్ల పైన స్థిరంగా కదలాడాల్సిఉంటుంది. ఈ స్థాయిని కాపాడుకుంటే క్రమంగా 11850 పాయింట్ల వరకు చేరవచ్చు. దిగువన 11600 పాయింట్ల వద్ద బలమైన మద్దతుంది. దీనికి దిగువన 11550, 11500 పాయింట్ల వద్ద పలు మద్దతు స్థాయిలున్నాయి. ఇవన్నీ కోల్పోతే స్వల్పకాలిక కరెక‌్షన్‌ ఉంటుందని అంచనా. ఆప్షన్‌ డేటా చూస్తే ప్రస్తుతం 11500, 11600 పాయింట్ల వద్ద భారీగా పుట్స్‌ చేరాయి. 11800, 12000 పాయింట్ల వద్ద కాల్స్‌ ఎక్కువగా ఉన్నాయి. ఇవి నిఫ్టీకి మద్దతు నిరోధాలుగా వ్యవహరిస్తాయి. కొత్తగా 11700 పాయింట్ల వద్ద పుట్‌రైటింగ్‌ జరగడం, చూస్తే మార్కెట్‌ స్వల్పకాలానికి అప్‌మూవ్‌లోనే ఉండే అవకాశముంది. బ్యాంకు నిఫ్టీ సైతం కనిష్ఠాల నుంచి రికవరీ చెంది 29900 పాయింట్ల దిశగా ర్యాలీ జరిపింది. బ్యాంకు నిఫ్టీ 29750 పాయింట్ల పైన కొనసాగినంత కాలం 30వేలు, 30200 పాయింట్ల వరకు అప్‌మూవ్‌ చూపవచ్చు. దిగువన 29500 పాయింట్లు కీలక మద్దతుగా వ్యవహరిస్తుంది. మరోపక్క ఇప్పటివరకు భయపెడుతున్న వీఐఎక్స్‌ సూచీ ఒక్కమారుగా దాదాపు 4 శాతం పతనమై 23.71కి చేరింది. 



You may be interested

కొత్తగా కొందామా? ఉన్నవి అమ్మేద్దామా?

Wednesday 24th April 2019

మార్కెట్లో రిటైలర్‌ ఇన్వెస్టర్‌ డైలమా వేచిచూడమంటున్న నిపుణులు నిఫ్టీ చాలా స్వల్పకాలంలో దాదాపు వెయ్యి పాయింట్లకు పైన ర్యాలీ జరిపింది. ఏప్రిల్‌ ఎక్స్‌పైరీ దగ్గరపడుతున్న సమయాన నిఫ్టీ దాదాపు 11750 పాయింట్లకు చేరువైంది. ఒకపక్క వీఐఎక్స్‌ సూచీ అంతకంతకూ పెరిగిపోతున్నా... బుల్స్‌ మాత్రం మార్కెట్‌పై పట్టు సడలించడంలేదు. దీంతో ర్యాలీ ఉంటుందని కొత్త కొనుగోళ్లు చేయాలా? వీఐఎక్స్‌ పెరిగిపోతోందని ఉన్న  పొజిషన్లను విక్రయించి లాభాలు స్వీకరించాలా? అని రిటైల్‌ ఇన్వెస్టర్‌ డైలమాలో పడుతున్నాడు.

39000 పైన ముగిసిన సెన్సెక్స్‌

Wednesday 24th April 2019

చివరి గంటలో కొనుగోళ్లతో భారీ లాభపడ్డ సూచీలు మూడురోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ 150 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ గత మూడు రోజులుగా భారీగా పతనమైన మార్కెట్లో కనిష్టస్థాయి వద్ద చివరి గంటలో జరిగిన కొనుగోళ్లు, ఏప్రిల్‌ డెరివేటివ్‌ సిరీస్‌ మరో రోజులో ముగియనున్న నేపథ్యంలో మార్కెట్‌ బుధవారం భారీ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 489 పాయింట్ల లాభంతో 39,054.68 వద్ద, నిఫ్టీ 150.20 పాయింట్లు పెరిగి 11,726.15 వద్ద స్థిరపడ్డాయి. దీంతో మార్కెట్ మూడు రోజుల వరుస

Most from this category