STOCKS

News


10650పైన ప్రారంభమైన నిఫ్టీ

Wednesday 20th February 2019
Markets_main1550637285.png-24262

ప్రపంచమార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ స్టాక్‌మార్కెట్‌ బుధవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 213 పాయింట్ల లాభంతో 35,565 వద్ద, నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 10650 పైన 10,655 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వరుసగా 9రోజుల పాటు నష్టాలతో అతలాకుతలమైన మార్కెట్లో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు షార్ట్‌ కవరింగ్‌ చేస్తున్నారు. ఫలితంగా అన్ని ప్రధాన రంగ షేర్లలో కొనుగోళ్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ముఖ్యంగా మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లు షేర్లు విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి. నాలుగు రోజుల వరుస పతనం రూపాయి విలువ బలపడింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ బుధవారం 13పైసల లాభంతో 71.26 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఐటీ, ఫార్మా షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఉదయం గం.9:30లకు సెన్సెక్స్‌ గత ముగింపు(35,352)తో పోలిస్తే 250 పాయింట్లు లాభపడి 35602 వద్ద, నిఫ్టీ గత ముగింపు(10,604)తో పోలిస్తే 70 పాయింట్లు లాభంతో 10674 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 


బీపీసీఎల్‌, హిందాల్కో, వేదాంత, టాటాస్టీల్‌, ఇండియన్‌బుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం లాభపడగా, ఇన్ఫ్రాటెల్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, హీరోమోటోకార్ప్‌, డాక్టర్‌రెడ్డీస్‌, బజాజ్‌ అటో షేర్లు అరశాతం నుంచి 1.50శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.


ఆసియా మార్కెట్ల విషయానికొస్తే...
చైనా మార్కెట్‌ తప్ప ఆసియాలో మిగిలిన ప్రధాన మార్కెట్లన్నీ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. దక్షిణ కొరియా, తైవాన్ మార్కెట్లు 1శాతం లాభపడ్డాయి. సింగపూర్‌, హాంగ్‌సెంగ్‌, నికాయ్‌ మార్కెట్లు అరశాతం ర్యాలీ చేశాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు సఫలం అవ్వచ్చనే ఆశాహనం ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. అలాగే ఇటీవల అమెరికా రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్వహించిన సమావేశాల సంబంధించిన మినిట్స్‌ కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. 


అమెరికా మార్కెట్లు:-
ఇక మంగళవారం రాత్రి అమెరికా మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సైతం లాభాల్లో ముగిశాయి. వాల్‌మార్ట్‌ ఆర్థిక త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు మించి నమోదు కావడం, అమెరికా-చైనా మధ్య వాణిజ్యచర్చల ఫలితాలు ఆశాజనకంగా ఉండవచ్చనే అంచనాలు మార్కెట్‌లో సెంటిమెంట్‌ను బలపరిచాయి. డౌజోన్స్‌ సూచీ 8 పాయింట్లు లాభపడి 25,891.32వద్ద, ఎస్‌అండ్‌టీ 4పాయింట్లు పెరిగి 2,779.76 వద్ద, నాస్‌డాక్‌ కాంపోజిట్‌ 14 పాయింట్లు ర్యాలీ చేసిన 7,486 వద్ద స్థిరపడ్డాయి. You may be interested

9రోజుల నష్టాలకు బ్రేక్‌

Wednesday 20th February 2019

403 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌ 10735 వద్ద నిఫ్టీ సూచీల తొమ్మిది రోజుల సుధీర్ఘర్యాలీ బుధవారం బ్రేక్‌ పడింది. మెటల్‌, ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్ల ర్యాలీతో సెన్సెక్స్‌ 403పాయింట్లు లాభంతో 35756 వద్ద, నిఫ్టీ 131 పాయింట్ల లాభంతో 10735.50 వద్ద స్థిరపడ్డాయి. కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 290 పాయింట్ల పెరిగి 26,955 వద్ద ముగిసింది. ప్రపంచమార్కెట్ల సానుకూల ర్యాలీని మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. మార్కెట్‌ వరుస పతనంతో షేర్లు

ఎనిమిది రోజుల నష్టాలు... తర్వాత ఏంటి?

Wednesday 20th February 2019

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డిసెంబర్‌ త్రైమాసికం ఫలితాలు నిరాశ కలిగించడం, రానున్న ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి ఇలా పలు కారణాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో ఎనిమిది సెషన్లలోనూ మార్కెట్లు నష్టాల పాలయ్యాయి. కానీ, ఏం జరుగుతోందోనన్న ఆందోళన సాధారణ ఇన్వెస్టర్లలో నెలకొంది. రిస్క్‌ తీసుకునేందుకు కూడా ధైర్యం చేయలేని పరిస్థితి నెలకొన్నదంటున్నారు నిపుణులు. కార్పొరేట్‌ ఫలితాలు నిరాశపరచడం, బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీలో నెలకొన్న సంక్షోభం,

Most from this category