STOCKS

News


11500 పైన ముగిసిన నిఫ్టీ

Tuesday 19th March 2019
Markets_main1552991873.png-24695

ముంబై:- మిడ్‌సెషన్ నుంచీ కొనుగోళ్లు పెరగడం సూచీలు వరుసగా ఏడోరోజూ లాభాలతో ముగిశాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీతో నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 11,532 వద్ద, సెన్సెక్స్‌ 268 పాయింట్లు పెరిగి 38,363 వద్ద స్థిరపడ్డాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు ర్యాలీ చేశాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభంతో 29,768 వద్ద ముగిసింది. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలతో నేడు మార్కెట్‌ లాభంతోనే మొదలైంది. చివరి ఆరురోజులుగా వరుసగా నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో కొంత కన్సాలిడేషన్‌కు లోనయ్యాయి. అయితే మిడ్‌సెషన్‌ నుంచి కొనుగోళ్లతో సూచీలు తిరిగి లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ట్రేడింగ్‌ ముగిసే వరకు సూచీలు స్థిరమైన ర్యాలీ చేశాయి. అటో, మెటల్‌ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. 
హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఇన్ఫోసిస్‌, ఆర్‌ఐఎల్‌, ఐటీసీ షేర్లు 3శాతం నుంచి 2శాతం లాభపడగా, ఐషర్ మోటర్స్‌ , జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌,  హీరో మోటో, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఆటో, మారుతీ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం నష్టపోయాయి. 
 



You may be interested

ఈ సమయంలో ఐదు మిడ్‌క్యాప్స్‌...!

Tuesday 19th March 2019

లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌ విభాగంలో ఆకర్షణీయమైన విలువలతో ఎన్నో స్టాక్స్‌ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత మిడ్‌, స్మాల్‌క్యాప్‌ ర్యాలీ చోటు చేసుకుంటుందన్న అంచనాలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లో 91 స్టాక్స్‌ను బ్లూంబర్గ్‌ అనలిస్టులు ట్రాక్‌ చేయగా, ఇందులో ఎక్కువ రికమండేషన్లు ఉన్న ఐదు స్టాక్స్‌ వివరాలు ఇవి.    సన్‌టీవీ నెట్‌వర్క్‌ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ... సన్‌ టీవీకి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ భాషల్లో

భారీ లాభాల్లో ప్రభుత్వరంగ షేర్లు

Tuesday 19th March 2019

వరుసగా మూడో రోజూ ప్రభుత్వరంగ షేర్ల ర్యాలీ కొనసాగింది. బ్రోకరేజ్‌ సం‍స్థలు ఈ రంగ బ్యాంకులపై రేటింగ్‌ పెంచడం కలిసొచ్చింది. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం మూలధన కేటాయింపుతో కొంతమేర ఉపశమనం కలుగుతుందనే అంచనాలతో ఆయా బ్యాంకులకు బ్రోకరేజ్‌ సంస్థలు రేటింగ్‌ను పెంచాయి. ఇక్రా రేటింగ్‌ సంస్థ బ్యాంకు ఆఫ్‌ బరోడా, పీఎన్‌బీ, ఓబీసీలకు గతంలో తాము కేటాయించిన నెగిటివ్‌ రేటింగ్‌ను స్థిరత్వంగా సవరించినట్లు ఒక ప్రకటనలో

Most from this category