STOCKS

News


ఏడాది మొత్తం 11500- 11600 రేంజ్‌లో నిఫ్టీ!

Tuesday 25th September 2018
Markets_main1537853684.png-20552

స్టీవర్ట్‌ అండ్‌ మాక్‌రిట్చ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ అంచనా
గతంలో చెప్పినట్లు ఈ ఆర్థిక సంవత్సరం చివరకు నిఫ్టీ టార్గెట్‌ 11600కు అటుఇటుగా ఉంటుందని స్టీవర్ట్‌ అండ్‌ మాక్‌రిట్చ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. ప్రస్తుతం నిఫ్టీ తమ టార్గెట్‌ స్థాయికి దాదాపు 500 పాయింట్ల దిగువన ట్రేడవుతున్నా అదే టార్గెట్‌ను కొనసాగిస్తామని తెలిపింది. నిఫ్టీ 11600 పాయింట్లను మించి పరుగు తీసేంతగా ప్రేరేపించే కారణాలేవీ కనిపించడంలేదని తెలిపింది. గత నెల్లో వచ్చిన ర్యాలీ కేవలం ఐదారు స్టాకుల కారణంగా వచ్చిందని పేర్కొంది. ఐటీ, వినిమయ రంగాల్లో స్టాకుల్లో తగినంత కొనుగోళ్లు జరిగాయని, రూపీ క్షీణత ప్రైస్‌ఇన్‌ అయిందని తెలిపింది. ఇక మీదట ఈ రంగాలు ఐదారు నెలలపాటు కన్సాలిడేట్‌ అవుతాయని అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఫార్మా, మైనింగ్‌, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలను ఎంచుకోవచ్చని సూచించింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రూమర్లు, పుకార్లు, భయాలు మార్కెట్‌ను శాసిస్తాయని తెలిపింది. ఇలాంటప్పుడు దీర్ఘకాలిక దృక్పధంతో మార్కెట్లో ఉండాలని, లేదంటే అనూహ్య కదలికలకు చిత్తయిపోతారని హెచ్చరించింది. పోర్టుఫోలియోను బహుళ రంగాలకు చెందిన నాణ్యమైన స్టాకులతో నింపుకోవాలని సూచించింది. ఇన్వెస్టర్లు కనీసం 15- 20 శాతం నగదును అట్టిపెట్టుకోవాలని, అనుకోని అవకాశాలు వచ్చినప్పుడు కొనుగోళ్లకు అవకాశంగా వినియోగించుకోవాలని సూచించింది.
హెచ్‌ఎఫ్‌సీలకు దూరం
కొన్ని రోజులుగా వడ్డీరేట్ల పెంపుదల తదితర కారణాలతో బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీ సహా ఫైనాన్స్‌ కంపెనీల్లో అమ్మకాలు కనిపిస్తున్నాయని బ్రోకరేజ్‌సంస్థ తెలిపింది. ఎన్‌బీఎఫ్‌సీల్లో నాణ్యమైన కంపెనీలు చాలా ఉన్నాయని, తాజా పతనం నుంచి కోలుకునే ఛాన్సులున్నాయని అంచనా వేసింది. హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు మాత్రం కొంత కాలం దూరంగా ఉండడం మంచిదని తెలిపింది. ఈ స్టాకుల్లో కన్సాలిడేషన్‌ పూర్తయ్యేవరకు వేచిచూడాలని సూచించింది. సాధారణ ఎన్నికలకు ముందు పీఎస్‌యూ, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాలకు చెందిన బ్లూచిప్‌ కంపెనీలను ఎంచుకోవచ్చని తెలిపింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్‌బీఐ మరో రేట్‌ కట్‌కు సిద్దంగా ఉండకపోవచ్చని అంచనా వేసింది. 



You may be interested

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 8శాతం క్రాష్‌..!

Tuesday 25th September 2018

హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లలో నెలకొన్న అమ్మకాల సునామిలో భాగంగా ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు మంగళవారం ట్రేడింగ్‌లో మరో 8.50శాతం నష్టపోయింది. నేడు బీఎస్‌ఈలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు రూ.990లు వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. గత రెండు రోజుల నష్టాల ట్రేడింగ్‌ను కొనసాగిస్తూ ఇంట్రాడేలో 8.50శాతం నష్టపోయి రూ.981.5ల కనిష్టానికి చేరుకుంది. ఉదయం గం.10:30లకు షేరు గత ముగింపు ధర(రూ.981.5)తో పోలిస్తే 5.50 శాతం నష్టంతో రూ.927.50ల వద్ద

అన్మోల్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓకు సెబీ ఓకే

Tuesday 25th September 2018

 కోల్‌కత: బిస్కెట్లు తయారు చేసే అన్మోల్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా రూ.750 కోట్లు సమీకరించాలని ఈ కంపెనీ యోచిస్తోంది. ఆదాయం పరంగా దేశంలో నాలుగో అతి పెద్ద బిస్కెట్‌ బ్రాండ్‌, ఐదో అతి పెద్ద కేక్‌ బ్రాండ్‌ తమ కంపెనీవేనని అన్మోల్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. ఈ కంపెనీ 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1,240

Most from this category