STOCKS

News


గట్టి మద్దతు కోసం నిఫ్టీ యత్నాలు

Saturday 20th October 2018
Markets_main1540033863.png-21328

వచ్చే వారం మార్కెట్లపై విశ్లేషణ
గతవారం మార్కెట్లు ఆటుపోట్ల నడుమ ఊగిసలాడాయి. వారం ఆరంభంలో సాధించిన లాభాలన్నీ చివరకు వచ్చేసరికి ఆవిరయ్యాయి. అంతకుముందు భావించినట్లే నిఫ్టీ ఈ వారంలో 10700 పాయింట్ల వరకు పుల్‌బ్యాక్‌ చూపింది. అయితే వెనువెంటనే అక్కడనుంచి వేగంగా వెనక్కువచ్చింది. మొత్తం మీద నిఫ్టీ వారాన్ని దాదాపు 170 పాయింట్ల నష్టంతో ముగించింది. అయితే వారం చార్టుల్లో హయ్యర్‌ హై, హయ్యర్‌ లో ఏర్పరిచింది. కొత్తవారంలో నిఫ్టీ ఎక్స్‌పైనీ ఎదుర్కోనుంది. రోలోవర్లతో సూచీల్లో తీవ్ర ఆటుపోట్లు ఉండొచ్చు. మార్కెట్‌ ప్రస్తుతం డౌన్‌ట్రెండ్‌మూడ్‌లో ఉన్నా, టెక్నికల్‌గా చిన్న పుల్‌బ్యాక్‌ చూపవచ్చు. వారాన్ని బలంగా ఆరంభించి మరోమారు 50 రోజుల డీఎంఏ స్థాయి(10709 పాయింట్లు)ని తాకేందుకు యత్నించవచ్చు. కీలక ఇండికేటర్లు బాగా ఓవర్‌ సోల్డ్‌ సంకేతాలు ఇస్తున్నాయి. అందువల్ల సూచీలు పతనానికి ముగింపు పలికే ఒక బలమైన బేస్‌ను ఏర్పరుచుకునే యత్నాలు చేయవచ్చు. సాధ్యమైనంత వరకు నిఫ్టీ ఈ బేస్‌ను 10180-10200 పాయింట్ల వద్ద ఏర్పరుచుకునే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం ఈ రేంజ్‌ దిగువకు నిఫ్టీ రాకపోవచ్చు. పైస్థాయిలో 10700-10800 పాయింట్లు నిరోధంగా వ్యవహరిస్తాయి. సూచీలు పడినప్పుడల్లా రక్షణాత్మక రంగాల(ఫార్మా, మెటల్స్‌, ఇన్‌ఫ్రా, ఎఫ్‌ఎంసీజీ) షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో స్పష్టత వచ్చే వరకు ఎక్కువ పొజిషన్లు తీసుకోవడం మంచిది కాదు. అదేవిధంగా 10200 పాయింట్లకు పైన నిఫ్టీ ఉన్నంత వరకు భారీ షార్టుల జోలికి పోవద్దు.


సూచన: పైవన్నీ నిపుణుల అభిప్రాయాలు, అంచనాలు. మార్కెట్‌ మదుపరులు సొంత అధ్యయనంతో ముందడుగు వేయాలి.



You may be interested

అంచనాలకు అనుగుణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికరలాభం

Saturday 20th October 2018

రెండో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికరలాభం 20.6 శాతం పెరిగి 5,006 కోట్ల రూపాయలకు చేరింది. బ్యాంకు లాభం 5,033 కోట్లుండవచ్చని బ్లూమ్‌బర్గ్‌ అంచనా వేసింది. ఆస్తుల నాణ్యత బలంగా ఉండడం, ఆరోగ్యకరమైన ఫీజు ఆదాయాలు బ్యాంకు ఫలితాలను ఆదుకున్నాయి.  ఫలితాల్లో ప్రధానాంశాలు.. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 20.6 శాతం పెరిగి 11,763.4 కోట్లకు చేరింది.   నికర వడ్డీ మార్జిన్లు 10 బీపీఎస్‌ పెరిగి 4.3 శాతానికి చేరాయి.  బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు

బీఎఫ్‌ఎస్‌ఐ కంపెనీల క్యు2 ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Saturday 20th October 2018

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషణ వడ్డీరేట్ల పెరుగుదల, లిక్విడిటీ తరుగుదల, క్రెడిట్‌ డిమాండ్‌ కాస్త ఊపందుకోవడం, డిఫాల్టింగ్‌లు.. క్యు2లో బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్స్యూరెన్స్‌ రంగం(బీఎఫ్‌ఎస్‌ఐ)లో చోటు చేసుకున్న ప్రధాన అంశాలు. రెండో త్రైమాసికంలో బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో రిటైల్‌పై ఎక్కువ ఫోకస్‌ ఉన్న కంపెనీలు మంచి ఫలితాలు ప్రకటించవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. ముఖ్యంగా రిటైల్‌ ప్రైవేట్‌ బ్యాంకులపై పాజిటివ్‌గా ఉన్నట్లు తెలిపింది. మొండిపద్దులు తక్కువగా ఉండి, ఆరోగ్యవంతమైన బీ/ఎస్‌ ఉన్న

Most from this category