STOCKS

News


నిఫ్టీ 11,000 దాటేముందు....కన్సాలిడేషన్‌

Monday 31st December 2018
Markets_main1546248849.png-23333

 

కొటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా

 

నిఫ్టీ 11,000 స్థాయిని దాటేముందుగా... కన్సాలిడేట్‌ అవుతుందని కొటక్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ అభిప్రాయపడ్డారు. గతవారం నిఫ్టీ ఇటీవలి గరిష్టస్థాయి అయిన 10,985 పాయింట్ల స్థాయిని అధిగమించలేక, అంచనాలకంటే అధికంగా పడిపోయిందని, అటుతర్వాత వేగంగా కోలుకున్నప్పటికీ, హెవీవెయిట్‌ షేర్లు వాటి తాజా గరిష్టస్థాయిల్ని చేరేందుకు ఇబ్బందిపడుతున్నందున, నిఫ్టీ కొద్దిరోజులపాటు కన్సాలిడేట్‌ కావొచ్చన్న అంచనాలు ఏర్పడుతున్నాయని ఆయన వివరించారు. గత వారం రోజుల కదలికలు, ప్రస్తుత ట్రెండ్‌ ఆధారంగా రెండు విధాలుగా మార్కెట్‌ కదలవచ్చని ఆయన పేర్కొన్నారు. అందులో మొదటిది...వచ్చే రెండు, మూడు ట్రేడింగ్‌ సెషన్లలో నిఫ్టీ నేరుగా 10,985 పాయింట్ల స్థాయిని ఛేదించడం. అయితే ఇటీవలి ఒడుదుడుకుల దృస్ట్యా ఇలా జరిగే అవకాశాలు తక్కువే. కానీ అసాధ్యంకాదు. ఇక రెండవది....10,900-10,950 పాయింట్ల శ్రేణి నుంచి నిఫ్టీ క్షీణించి హయ్యర్‌ లో ఏర్పటుచేసిన తర్వాత 11,200-300 పాయింట్ల శ్రేణికి ర్యాలీ జరపడం. ఈ రెండు సందర్భాల్లోనూ నిఫ్టీ 10,200 పాయింట్ల స్థాయిని చేరడమైతే జరుగుతుందని భావిస్తున్నాం. కానీ రానున్న రోజుల్లో నిఫ్టీ 11,200-11,300 పాయింట్ల శ్రేణిని చేరాలంటే ఇటీవలి కనిష్టస్థాయి 10,333 పాయింట్ల స్థాయిని పరిరక్షించుకోవడం తప్పనిసరి. ఒకవేళ 10,333 పాయింట్ల స్థాయిని కోల్పోతే మార్కెట్‌కు అది పూర్తిగా ప్రతికూలమై 10,000 పాయింట్ల లోపునకు కూడా నిఫ్టీ పడిపోవొచ్చు.

ఇక్కడి ట్రెండ్‌ను ప్రపంచ మార్కెట్లు, క్వార్టర్లీ ఫలితాలు, కరెన్సీ కదలికలు, క్రూడాయిల్‌ హెచ్చుతగ్గులు, మంథ్లీ ఆటోమొబైల్‌ గణాంకాలు నిర్దేశిస్తాయని శ్రీకాంత్‌ చౌహాన్‌ వివరించారు. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లు, క్రూడ్‌ గణనీయంగా తగ్గినందున, వాటి ఇటీవలి కనిష్టస్థాయిలకు తిరిగి తగ్గేముందుగా కొద్దికాలం కన్సాలిడేట్‌ కావొచ్చని, క్వార్టర్లీ ఫలితాల వెల్లడి జనవరి 10 తర్వాత ప్రారంభంకానున్నందున, ప్రస్తుత వారంలో మార్కెట్‌పై ఎటువంటి ప్రభావం వుండదని భావిస్తున్నామన్నారు. ఈ వివిధ అంశాల ఆధారంగా నిఫ్టీ 11,000 దాటేముందు, కన్సాలిడేట్‌ కావొచ్చన్న అంచనాలకు వచ్చినట్లు ఆయన వివరించారు. ట్రేడర్లు నిఫ్టీని 10,900 సమీపంలో 10,985 స్టాప్‌లాస్‌తో షార్ట్‌ చేయవచ్చని, 10,530 లేదా 10,330 పాయింట్ల స్థాయిలకు తగ్గితే బుల్లిష్‌ పొజిషన్లు తీసుకోవొచ్చని ఆయన సూచించారు. 

 

Based on the above observations, we can draw conclusion that the market is going to consolidate before heading towards the last push above 11,000.

 

Take a contra bet of trading short around 10,900 with a final stop loss at 10,985 and one can take a bullish bet if markets fall either to 10,530 or 10,330.

 

 You may be interested

మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్ల ర్యాలీ

Monday 31st December 2018

ముంబై:- ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ నిఫ్టీ స్వల్ప నష్టాలతో ముగిసినప్పటికీ..,  ఇంట్రాడేలో మిడ్‌ క్యాప్‌, స్మాల్మ్‌ క్యాప్‌ షేర్లు లాభాల మోత మోగించాయి. బీఎస్‌ మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ దాదాపు 1శాతం వరకు లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌:- నేడు 15,406 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో దాదాపు 1శాతం లాభపడి 15,481 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 78 పాయింట్లు లాభపడి 15,438.45

ఫార్మా షేర్ల ర్యాలీకి ‘‘సన్‌ ఫార్మా’’ అండ

Monday 31st December 2018

3.50శాతం లాభపడిన సన్‌ఫార్మా ఆరంభ లాభాల్ని కోల్పోయిన మార్కెట్లో సోమవారం ఫార్మా రంగ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలో 1శాతం లాభపడింది. మధ్యాహ్నం గం.1:30లకు ఇండెక్స్‌ గతముగింపు(8,814.20)తో పోలిస్తే 0.75శాతం లాభంతో 8881.05ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. సన్‌ఫార్మా అత్యధికంగా 3.50శాతం ర్యాలీ లాభపడి నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌కు దన్నుగా నిలుస్తోంది. అలాగే పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, దివిస్‌ ల్యాబ్స్‌

Most from this category