STOCKS

News


నిఫ్టీ మార్చి టార్గెట్‌.. 9,500

Monday 19th November 2018
Markets_main1542608660.png-22178

నిఫ్టీ మార్చి కల్లా 9,500 పాయింట్లకు తగ్గవచ్చని యూబీఎస్‌ అంచనా వేస్తోంది. ఇన్వెస్టర్లు మార్కెట్‌ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం తేలింది.  నిఫ్టీపై ప్రభావం చూపే అంశాలు, నిఫ్టీ రేంజ్‌బౌండ్‌, మార్కెట్‌ సెంటిమెంట్‌ వంటి పలు అంశాలపై ఇన్వెస్టర్లు స్పందించారు. యూబీఎస్‌ సర్వే ప్రకారం.. 

♦ సర్వేలో పాల్గొన్న దాదాపు 61 శాతం మంది ఇన్వెస్టర్లు మార్కెట్‌లో బేరిష్‌ సెంటిమెంట్‌ ఉందని తెలిపారు. గత సర్వేలో వీరి సంఖ్య 31 శాతంగా వుంది. అలాగే బుల్లిష్‌గా ఉన్నామని కేవలం 7 శాతం మంది మాత్రమే తెలిపారు. వీరి సంఖ్య గత సర్వేలో 28 శాతంగా ఉంది. క్రూడ్‌ ధరలు, ఎన్‌బీఎఫ్‌సీ లిక్విడిటీ, ఎన్నికలు వంటి అంశాల వల్ల మార్కెట్‌పై ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. రూపాయి మారక విలువకు ఇన్వెస్టర్లు అతి తక్కువ ప్రాధాన్యమిచ్చారు. 

♦ 14వ యూబీఎస్‌ ఇండియా కాన్ఫరెన్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు.. ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్‌పై సానుకూలంగా స్పందించారు. అయితే ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను (లిక్విడిటీ సంక్షోభం, ఆయిల్‌ ధరలు, ఆర్‌బీఐ-కేంద్రం సమస్య) ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారు.  

♦ ఇటీవల మార్కెట్‌ కరెక‌్షన్‌కు కారణమైన లిక్విడిటీ సమస్యలు మళ్లీ పునరావృతమౌతాయని భావించడం లేదని యూబీఎస్‌ పేర్కొంది. రూపాయి పతనం కూడా మార్కెట్లు పడిపోవడానికి కారణమైందని తెలిపింది. నిఫ్టీ ఏడాది ఫార్వర్డ్‌ పీఈ 19 రెట్లు నుంచి 16 రెట్లుకు తగ్గిందని పేర్కొంది. మార్కెట్లకు 2019 ఎన్నికలు, రిటైల్‌ పెట్టుబడులు వంటి అంశాల రూపంలో రిస్క్‌ పొంచి ఉందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగం వృద్ధి రేటు కూడా మార్కెట్లకు జోష్‌నిచ్చే అవకాశం కనిపించడం లేదని పేర్కొంది. 2019 మార్చి కల్లా నిఫ్టీ 9,500 స్థాయికి పడిపోవచ్చని అంచనా వేసింది. అలాగే ఇండెక్స్‌ 8,300-11,100 శ్రేణిలో కదలాడవచ్చని తెలిపింది. You may be interested

సీమెన్స్‌కు ఫలితాల షాక్‌..!

Monday 19th November 2018

5శాతం నష్టపోయిన షేరు ముంబై:- ఇంజనీరింగ్‌ దిగ్గజ కంపెనీ సీమెన్స్‌ లిమిటెక్‌ షేరుకు జూలై - సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు షాక్‌నిచ్చాయి.  త్రైమాసిక ఫలితాలు ఆశించినస్థాయిలో నమోదు కాకపోవడంతో సోమవారం సీమెన్స్‌ షేర్లు 5శాతం నష్టపోయాయి. నేడు సీమెన్స్‌ షేర్లు బీఎస్‌ఈలో రూ.978.5ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ క్వార్టర్‌ ఫలితాలు నిరుత్సాహపరడంతో ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు ఇంట్రాడేలో 5శాతం నష్టపోయి రూ.930.00ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని

సన్‌ టీవీ, యాక్సిస్‌ బ్యాంక్‌పై బుల్లిష్‌

Monday 19th November 2018

సన్‌ టీవీ      బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ ప్రస్తుత ధర: రూ.608 టార్గెట్‌ ధర: రూ.835 ఎందుకంటే: ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. చందా ఆదాయం 21 శాతం వృద్ధి చెందింది. కానీ ప్రకటనల ఆదాయం 3 శాతమే పెరిగింది. మొత్తం మీద  కంపెనీ ఆదాయం 11 శాతమే వృద్ధి చెంది రూ.740 కోట్లకు పెరిగింది. ఇబిటా 12 శాతం పెరిగి

Most from this category