News


సంవత్ 2075లో నిఫ్టీ టార్గెట్‌ 11,800..!

Tuesday 6th November 2018
Markets_main1541484351.png-21752

  • నర్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ హెడ్‌ వినీతా శర్మ విశ్లేషణ

ముంబై: ద్రవ్యలభ్యత, వాల్యుయేషన్స్‌, సెంటిమెంట్ వంటి పలు కీలక అంశాల నేపథ్యంలో గతేడాది సూచీలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు కారణంగా దేశీ మార్కెట్లలో అటు డెట్‌లోనూ ఇటు ఈక్విటీలోనూ విదేశీ ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో అమ్మకాలకు పాల్పడ్డారు. అంతకుముందు ఏడాదిలో 50 డాలర్ల వద్ద ఉన్నటువంటి బ్యారెల్‌ క్రూడ్‌ ధర సంవత్ 2074లో 70 డాలర్లను అధిగమించి కమోడిటీ ధరలకు రెక్కలు తొడిగింది. ఈ కారణంగా 65 స్థాయిలో ఉన్నటువంటి రూపాయి మారకం విలువ 74 స్థాయికి ఎగబాకింది. 22.2 రెట్లు ఫార్వార్డ్‌ ఎర్నింగ్స్‌ వద్ద ఉన్నటువంటి నిఫ్టీ ప్రస్తుతం 20 రెట్లు వద్ద ట్రేడవుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లు చారిత్రాత్మక గరిష్టస్థాయి నుంచి ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఇదంతా సంవత్ 2074లో నమోదైన మార్కెట్‌ పరిణామాలు కాగా.. సంవత్ 2075లో (ఈ ఏడాది దీపావళి నుంచి వచ్చే ఏడాది దీపావళి వరకు) మార్కెట్‌ ఏ విధంగా ఉండవచ్చే అంశంపై తాను పాజిటీవ్‌గా ఉన్నట్లు నర్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినీతా శర్మ వ్యాఖ్యానించారు. ఈ కాలంలో నిఫ్టీ టార్గెట్‌ 11,800 పాయింట్లుగా పేర్కొన్నారు. జీఎస్‌టీ, ఐబీసీ వంటి సంస్కరణల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన నిర్మాణాత్మక మార్పు దిశగా ప్రయాణిస్తోందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. భారత కార్పొరేట్‌లో ఆదాయాల పునరుద్ధరణ చోటుచేసుకుంటుందన్నారు. జీడీపీలో కంపెనీల లాభాలు శాతం పరంగా ఇంకా కనిష్టస్థాయిల వద్దనే ఉన్నట్లు పేర్కొన్నారు. అంటే, లాభాలను పొందడానికి మరింత అవకాశం ఉన్నట్లు వ్యాఖ్యానించారు. లార్జ్‌ క్యాప్‌ రంగాలలోని పలు కంపెనీలు అమ్మకాలలో 20 శాతం వృద్ధిరేటును సాధించినప్పటికీ.. ఎన్‌పీఏ కేటాయింపులు వంటి అంశాల నేపథ్యంలో ఈపీఎస్‌ వృద్ధిలో అమ్మకాల వృద్ధి పెద్దగా హైలైట్‌ అవ్వలేదని విశ్లేషించారు. గడిచిన ఐదేళ్లుగా నిఫ్టీ ఈపీఎస్‌ వృద్ధి 5 శాతం చక్రగతి వృద్ధిరేటును నమోదుచేయగా.. వాల్యుయేషన్ మల్టీపుల్‌ ఎక్స్‌ప్యాంక్షన్స్‌ (బహుళ విస్తరణ) కారణంగా ప్రైస్‌ 11 శాతం చక్రగతి వృద్ధిరేటును నమోదుచేసినట్లు విశ్లేషించారు. రానున్నకాలంలో నిఫ్టీలో ప్రైస్‌ గ్రోత్‌ ఎర్నింగ్స్‌ వృద్ధితో పాటు ఉండనుందన్నారు. 2020 ఆర్థిక సంవత్సరం ఈపీఎస్‌ 19 రెట్లు ఉండనుందనే అంచనా ఆధారంగా నిఫ్టీ సంవత్ 2075లో 11,800 పాయింట్లకు చేరుకుంటుందనే అంచనాను వెల్లడించినట్లు వివరించారు. వచ్చే దీపావళి నాటికి 4 షేర్లను సిఫార్సు చేశారు.

ఏడాదిలో 17-33 శాతం రాబడిని అందించగలిగిన 4 షేర్లు

ఫెడరల్ బ్యాంక్ | ప్రస్తుత ధర: రూ.80 | టార్గెట్ ధర: రూ.110 | వృద్ధి అంచనా: 33 శాతం
గడిచిన రెండేళ్లలో లోన్‌ బుక్‌ సగటు వృద్ధి 26 శాతంగా ఉంది. మంచి రేటింగ్‌ కలిగిన కార్పొరేట్, రిటైల్, ఎస్‌ఎంఈ పోర్టిఫోలియోను నిర్వహించే దిశగా యాజమాన్యం కసరత్తు చేస్తోంది. 2016లో 3.4 శాతంగా ఉన్నటువంటి అధిక ఒత్తిడి కలిగిన లోన్లు ప్రస్తుతం 2 శాతానికి దిగివచ్చాయి. మొత్తం కార్పొరేట్‌ అడ్వాన్సెస్‌లో మంచి రేటింగ్ కలిగిన కార్పొరేట్‌ శాతం 71 శాతంగా ఉండడం ఆకర్షణీయ అంశంగా వినీతా శర్మ విశ్లేషించారు.

ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ | ప్రస్తుత ధర: రూ.563 | టార్గెట్ ధర: రూ.700 | వృద్ధి అంచనా: 24 శాతం
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 22,000 ఎస్‌బీఐ శాఖలు, 1,13,045 ఎజెన్సీ నెట్‌వర్క్‌లు ఈ సంస్థ వ్యాపారానికి బలమైన పంపిణీ వ్యవస్థగా నిలుస్తున్నాయి. భారత్‌లో అతి తక్కువగా కొనసాగుతున్నటువంటి బీమా వ్యాప్తిని ఈ బలమైన డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ సునాయాసంగా సొంతం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వ్యాపార మిశ్రమంలో పలు మార్పులు చేసిన నేపథ్యంలో వీఎన్‌బీ (నూతన వ్యాపార విలువ) వృద్ధి, మార్జిన్లు మెరుగుపడుతున్నాయని వివరించారు.

ఎల్‌ అండ్‌ టీ | ప్రస్తుత ధర: రూ.1,358 | టార్గెట్ ధర: రూ.1,600 | వృద్ధి అంచనా: 18 శాతం
2021 ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీ ఆదాయం రూ.2,00,000 కోట్లకు చేరుకోవాలని ఎల్‌ అండ్‌ టీ లక్ష్యంగా నిర్థేశించుకుంది. ఇదే కాలానికి మార్జిన్లు 11.6 శాతానికి పెరగాలని, వర్కింగ్‌ క్యాపిటల్‌ 18 శాతానికి తగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంది. నాన్‌-కోర్‌ వ్యాపారాల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ దిశగా నిర్ణయం తీసుకుంటోంది. దీంతో రిటర్న్‌ రేషియో మెరుగుపడనుందని వినీతా శర్మ విశ్లేషించారు.

బజాజ్ ఆటో | ప్రస్తుత ధర: రూ.2,657 | టార్గెట్ ధర: రూ.3,120 | వృద్ధి అంచనా: 17 శాతం
భారత దేశంలో అతిపెద్ద ప్రీమియం సెగ్మెంట్‌ మోటార్‌ సైకిల్‌ ఉత్పత్తిదారుగా కొనసాగుతోంది. ప్రొడెక్ట్‌ పోర్టిఫోలియోలో 65 శాతం.. మార్జిన్లలో 20 శాతానికి మించి ఉన్నాయి. బలమైన ప్రచార కార్యకలాపాలు.. ఎంట్రీ, ప్రీమియం సెగ్మెంట్ మోటార్ సైకిళ్లలో కొనసాగుతున్న ధరల వ్యూహం అంశాలను బేరీజు వేసుకుని ఈ షేరు టార్గెట్ ధరను రూ.3,120 వద్ద నిర్ణయించినట్లు తెలిపారు.

ఇవి కేవలం మార్కెట్‌ విశ్లేషకుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.


 You may be interested

మార్కెట్‌పై బేరిష్‌గా లేను: రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా

Tuesday 6th November 2018

స్థూల అంశాలన్నీ భారత మార్కెట్‌కు అనుకూలంగా మారిపోయాయని వ్యాఖ్యానించిన ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా ముంబై: ప్రస్తుత క్యాలెండర్‌ ఇయర్‌లో స్టాక్‌ సూచీలు జీవితకాల గరిష్టస్థాయి నుంచి ఒక్కసారిగా రెండంకెల పతనాన్ని నమోదుచేయడం చూసి ఏమాత్రం విశ్వాసాన్ని కోల్పోవల్సిన అవసరం లేదని బిగ్‌ బుల్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా వ్యాఖ్యానించారు. 10,000 పాయిం‍ట్ల వద్ద బోటమ్‌ను పరీక్షించిన నిఫ్టీ 11,000-11,100 స్థాయిలో నిరోధాన్ని ఎదుర్కొవచ్చని విశ్లేషించారు. ర్యాలీ కొనసాగనంత మాత్రాన మార్కెట్లపై నమ్మకాన్ని

అక్కడక్కడే పసిడి ధర

Tuesday 6th November 2018

అమెరికాలో మధ్యంతర ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం పసిడి ధర అక్కడక్కడే ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాలం ప్రకారం ఉదయం గం.10.20లకు ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప నష్టంతో 1,230.80 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) రెండు రోజుల పరపతి సమీక్షా సమావేశాలు 7న(బుధవారం) ప్రారంభంకానున్నాయి. అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఫెడ్‌ రిజర్వ్‌ అనుసరిస్తున్న వడ్డీ రేట్ల పెంపు విధానాలపట్ల

Most from this category