STOCKS

News


నిఫ్టీ టార్గెట్‌ 10,380–10,600 శ్రేణి

Tuesday 30th October 2018
Markets_main1540893221.png-21588

స్వల్పకాలానికి మార్కెట్‌ బాటమ్‌అవుట్‌ అయ్యిందని, 10,380–10,600 శ్రేణికి క్రమేపీ పెరిగే ఛాన్స్‌ వుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ సూచిస్తున్నారు. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు వారి షార్ట్‌ పొజిషన్ల నుంచి వైదొలిగి 10,004 పాయింట్ల స్టాప్‌లాస్‌తో నిర్దేశిత లక్ష్యానికి లాంగ్‌ పొజిషన్లు క్రియేట్‌ చేసుకోవొచ్చని సిఫార్సుచేశారు. గతవారం మార్కెట్‌ క్షీణించినప్పటికీ, డౌన్‌ట్రెండ్‌ మూమెంటమ్‌ నెమ్మదించిందని, 100 వారాల మూవింగ్‌ ఏవరేజ్‌ కదులుతున్న 10,000 పాయింట్ల సమీపంలో నిఫ్టీ మద్దతుపొంది, పెద్ద ర్యాలీ జరపడం సానుకూలాంశమని విశ్లేషించారు. అలాగే మార్కెట్లో స్టాక్‌ ఫ్యూచర్ల పొజిషన్లు 14 నెలల కనిష్టస్థాయికి పడిపోయాయని, బుల్‌ట్రెండ్‌ ఏర్పడేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. 

ఈ అనలిస్ట్‌ స్వల్పకాలానికి 3 షేర్లు సిఫార్సుచేశారు. అవి...

పీటీసీ: టార్గెట్‌ ధర రూ. 104. స్టాప్‌లాస్‌ రూ.84

200 డీఎంఏ రేఖ కదులుతున్న రూ. 89 కీలక నిరోధస్థాయిని ఈ షేరు అధిగమించింది. అలాగే షేరు పెరగడంతో పాటు ట్రేడింగ్‌ పరిమాణం సైతం భారీగా జరిగింది. పలు అవరోధాలు కలిగిన రూ.90 స్థాయిని కూడా దాటి రూ. 91.6 వద్దకు చేరింది. డెయిలీ, వీక్లీ చార్టుల్లో ఆస్కిలేటర్స్‌ బుల్లిష్‌గా మారాయి. ప్రస్తుత ధర వద్ద కొనుగోలుచేసి, రూ. 84 స్టాప్‌లాస్‌తో రూ. 104 టార్గెట్‌ ధర కోసం ఈ షేరును హొల్డ్‌ చేయోచ్చు. 

విప్రో: టార్గెట్‌ ధర రూ. 370. స్టాప్‌లాస్‌ రూ. 310

ఈ షేరు డెయిలీ చార్టుల్లో డౌన్‌వర్డ్‌ స్లోపింగ్‌ చానల్‌ నుంచి బ్రేకవుట్‌కావడంతో పాటు మార్కెట్‌ క్షీణతలోనూ స్థిరంగా నిలిచింది. అలాగే 52 వారాల గరిష్ట ధర వద్ద కదులుతున్న ఈ షేరు రూ. 339 స్థాయిని అధిగమిస్తే మధ్య, దీర్ఘకాలానికి బుల్లిష్‌గా మారుతుంది. ప్రస్తుత షేరు కదలికలు, ఆస్కిలేటర్లు హోల్డ్‌చేస్తున్న తీరును పరిశీలిస్తే ప్రస్తుత స్థాయి నుంచి షేరు పెరిగే అవకాశం కన్పిస్తున్నది. రూ. 370 లక్ష్యం కోసం ప్రస్తుత ధర వద్ద కొని, రూ. 310 స్టాప్‌లాస్‌తో విప్రోను హోల్డ్‌ చేయోచ్చు. 

ఫెడరల్‌ బ్యాంక్‌: టార్గెట్‌ ధర రూ. 89. స్టాప్‌లాస్‌ రూ.76

బుల్‌ట్రెండ్‌ కొనసాగింపును సూచిస్తూ బుల్లిష్‌ ఫ్లాగ్‌ ప్యాటర్న్‌ను ఫెడరల్‌ బ్యాంక్‌ షేరు కనపరుస్తోంది. ఇటీవలి కనిష్టస్థాయి నుంచి వేగంగా కోలుకున్న తర్వాత ప్రస్తుతం స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవుతోంది. 5, 10, 20 డీఎంఏల రేఖల్ని అధిగమించి, స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ సంకేతాల్ని ఇస్తుంది. ఈ కారణంగా రూ. 89 టార్గెట్‌ ధర కోసం ప్రస్తుత ధర వద్దకొని, రూ. 76 స్టాప్‌లాస్‌తో అట్టిపెట్టవచ్చు. 
 



You may be interested

10,200 దిగువకు నిఫ్టీ

Tuesday 30th October 2018

34000ల దిగువకు సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ఆరంభం నుంచి ఒడిదుడుకులతో సాగిన మార్కెట్‌ ట్రేడింగ్‌ను మిడ్‌సెషన్‌ అనంతరం జరిగిన అమ్మకాలు ముంచేశాయి. ఫలితంగా మార్కెట్‌ లాభాలు ఒక్కరోజుకే పరిమితయ్యాయి. ముఖ్యంగా హెవీ వెయిట్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌ ద్వయం, ఐటీసీ, ఇండస్‌ ఇండ్‌ షేర్ల పతనంతో సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 176 పాయింట్ల కోల్పోయి 33, 891వద్ద, నిఫ్టీ 52 పాయింట్ల నష్టపోయి 10,198 వద్ద ముగిశాయి. అమెరికా-చైనా దేశాల

రెండోరోజూ తియ్యటి ర్యాలీ..!

Tuesday 30th October 2018

చక్కెర షేర్లు వరుసగా రెండో ట్రేడింగ్‌లోనూ తియ్యటి ర్యాలీ చేస్తున్నాయి. ఈ మార్కెటింగ్‌ సంవత్సరం(అక్టోబర్‌-సెప్టెంబర్‌)లో చక్కెర ఉత్పత్తి తగ్గవచ్చని ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ అంచనాలు ర్యాలీకి కారణమయ్యాయి. ఈ ఏడాది దేశంలో చక్కెర ఉత్పత్తి 32 మిలియన్‌ టన్నులుగా ఉండొచ్చని ఐఎస్‌ఎంఏ పేర్కోంది. చక్కెర ఉత్పత్తి తగ్గనుండంతో చక్కెర షేర్లు ర్యాలీ చేయవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు వరుసగా రెండో రోజూ కూడా ఈ చక్కెర కౌంటర్లలో కొనుగోళ్లకు తెరలేపారు.

Most from this category