STOCKS

News


గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Monday 3rd December 2018
Markets_main1543809560.png-22578

గతవారం లాభాల ముగింపు కొనసాగిస్తూనే సోమవారం మార్కెట్‌ భారీ లాభాలతో ప్రారంభమైంది. జీ –20 సదస్సు సందర్భంగా వాణిజ్య యుద్ధంపై అమెరికా, చైనాల మధ్య ఎట్టకేలకు సంధి కుదిరింది. ఫలితంగా నేడు ఆసియామార్కెట్లు భారీ లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల వాతావారణాన్ని అందుకున్న ప్రధాన సూచీలైన నిఫ్టీ 10,900పైన, సెన్సెక్స్‌ 200 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 234 లాభంతో 36429.07 వద్ద, నిఫ్టీ 54.60 10931.40 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అటో, ఫార్మా రంగ ఇండెక్స్‌లు తప్ప అన్ని రంగాల సూచీలూ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా మెటల్‌ ఇండెక్స్‌ 3శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఐఓసీ, బీపీసీఎల్‌, ఐషర్‌మోటర్స్‌, హెచ్‌పీసీఎల్‌, సన్‌ఫార్మా షేర్లు 1శాతం నుంచి 10శాతం నష్టపోయాయి. ఇండియన్‌బుల్‌హౌసింగ్స్‌ఫైనాన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటాస్టీల్‌, వేదాంత, హిందాల్కో షేర్లు 2.50శాతం నుంచి 4శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

రూపాయి డౌన్‌

Monday 3rd December 2018

డాలరుతో 70.08 వద్ద ప్రారంభం ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభ సమయంలో 50 పైసలు బలహీనపడింది. ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో 70.08 దగ్గర ప్రారంభమయ్యింది. దిగుమతిదారులు, బ్యాంకర్ల నుంచి అమెరికా డాలర్‌కు డిమాండ్‌ పెరిగి డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణించిందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు తెలియజేశారు. గతకొంత కాలంగా నష్టపోతూ వచ్చిన ముడిచమురు ధరలు ఇవాళ స్వల్పంగా బలపడడం, శుక్రవారం

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 3rd December 2018

వివిధ వార్తలను అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు... అటోరంగ షేర్లు:- పరిశ్రమలో ద్రవ్యత్వలోటు, పెరిగిన ఇంధన ఖర్చులు, అధిక వడ్డీరేట్ల కారణంగా నవంబర్‌లో వాహన విక్రయాలు అంతంత మాత్రంగానే జరిగాయి. నెమ్మదించిన అమ్మకాల ప్రభావం నేడు ఆయా కంపెనీల షేర్లపై ప్రభావాన్ని చూపవచ్చు. విమానయాన రంగ షేర్లు:- అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు రోజురోజుకూ దిగివస్తున్న నేపథ్యంలో దేశీయ ఆయిల​ మార్కెటింగ్‌ కంపెనీలు ఏటీఎఫ్‌ ధరలను 11శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో

Most from this category