STOCKS

News


10800 పైన ప్రారంభమైన నిఫ్టీ

Friday 28th December 2018
Markets_main1545969853.png-23270

బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్ల అండతో శుక్రవారం మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైంది.  సెన్సెక్స్‌ 150 పాయిం‍ట్ల లాభంతోనూ, నిఫ్టీ 10,800 పైన ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేటి డాలర్‌ మారకంలో రూపాయి(20పైసలు లాభం) బలపడటం సూచీలకు ఉత్సాహానిచ్చింది. ఉదయం గం.9:25 ని.లకు సెన్సెక్స్‌ 220 పాయింట్ల లాభంతో 36వేల పైన 36,029 వద్ద, నిఫ్టీ సూచి 67.55 పాయింట్లు పెరిగి 10,847.35 ‍వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈలోని ఒక్క ఎఫ్‌ఎంజీసీ సూచి తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన ఇండెక్స్‌ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లలో కొనుగోళ్లు అధికంగా ఉన్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ, వేదాంత, సన్‌ఫార్మా, టైటాన్‌, యస్‌ బ్యాంక్‌ 1.50 నుంచి 2శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, ఇన్ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఎన్‌టీపీపీ, కోల్‌ ఇండియా 1.50శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

 



You may be interested

ప్రభుత్వరంగ బ్యాంకులకు అతిత్వరలో రూ.28,615 కోట్లు

Friday 28th December 2018

న్యూఢిల్లీ: అతి త్వరలోనే ఏడు ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం రూ.28,615 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఈ నెలాఖరులోపు రీక్యాపిటలైజేషన్‌ బాండ్ల జారీ ద్వారా దీన్ని పూర్తి చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీనివల్ల బ్యాంకులు నియంత్రణపరమైన అవసరాలను చేరుకునేందుకు వీలుంటుందని పేర్కొన్నాయి. అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.10,086 కోట్ల సాయం లభించనుంది. ఆ తర్వాత ఓరియంటల్‌ బ్యాంకు ఆఫ్‌ కామర్స్‌కు రూ.5,500 కోట్లు, బ్యాంకు ఆఫ్‌

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 28th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇవి టాటా స్టీల్‌ బీఎస్‌ఎల్‌:- కంపెనీ చెందిన రూ.21వేల కోట్ల విలువైన ధీర్ఘకాలిక బ్యాంకు రుణానికి కేర్‌ రేటింగ్‌ సంస్థ ఎఎ(స్థిరత్వం) రేటింగ్‌ను కేటాయించింది. యూనైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:- ఫ్రిపరెన్షియల్‌ బేసిస్‌ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఈక్విటీ క్యాపిటల్‌ రూపంలో రూ.2159 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. కన్సాయ్‌ నెరోలాక్‌ పెయింట్స్‌:- షేర్‌ పర్చే‍‍జ్‌ అగ్రిమెంట్‌ పద్ధతిలో ఫెర్మా కన్‌స్ట్రక్చన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 100శాతం

Most from this category