STOCKS

News


10,700 పాయింట్ల వద్ద నిఫ్టీ ప్రారంభం

Friday 4th January 2019
Markets_main1546574014.png-23394

సెన్సెక్స్‌ 77 పాయింట్లు అప్‌

గత రెండు రోజులుగా తీవ్రంగా క్షీణించిన భారత్‌ మార్కెట్‌ శుక్రవారం స్వల్పలాభాలతో మొదలయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇండెక్స్‌ 27 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 10,700 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 77 పాయింట్ల లాభంతో 35,590 పాయింట్ల వద్ద ఓపెన్‌ అయ్యింది. ట్రేడ్‌వార్‌ ముగుస్తుందన్న అంచనాలు, చైనా 21 బిలియన్‌ డాలర్ల విలువైన భారీ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రకటించడంతో ఆసియా సూచీలు పాజటివ్‌ ట్రేడింగ్‌ కారణంగా ఈ రోజు ప్రారంభంలో ఇక్కడి సూచీలు స్వల్ప లాభాల్ని నమోదు చేయగలిగాయి. ప్రపంచ ఆర్థికాభివృద్ధి మందగిస్తుందన్న భయాలు, యాపిల్‌ ఉత్పత్తుల ధరలు తగ్గిస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించడం వంటి అంశాలతో గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 2.7 శాతం వరకూ పడిపోయాయి.  కాగా మూడు రోజుల నుంచి సెలవుల్లో వున్న జపాన్‌ నికాయ్‌ సూచి శుక్రవారం ఒక్కసారిగా 3 శాతంపైగా పతనమయ్యింది. గత రెండు రోజులుగా క్షీణతను నమోదుచేసిన ఇతర ఆసియా మార్కెట్లయిన హాంకాంగ్‌, చైనా, సింగపూర్‌, కొరియా సూచీలు ఈ ఉదయం స్వల్ప పెరుగుదలతో ట్రేడవుతున్నాయి. 

మెటల్స్‌, ఆటోలు అప్‌

ట్రేడింగ్‌ ప్రారంభంలో మెటల్‌ షేర్లు, ఆటోమొబైల్‌ షేర్లు లాభాల్ని ఆర్జించాయి. టాటా మోటార్స్‌ 2.8 శాతం, ఐషర్‌ మోటార్స్‌ 1.8 శాతం చొప్పున పెరిగాయి. మెటల్‌ షేర్లు హిందాల్కో, వేదాంత, టాటా స్టీల్‌లు 1-2 శాతం పెరుగుదలతో మొదలయ్యాయి. ఈ షేర్లన్నీ గత రెండు రోజులుగా త్రీవ నష్టాల్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం షేర్లు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. 



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 4th January 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు ఇవి స‌న్ ఫార్మా:- పోలా ఫార్మా కొనుగోలు ప్రక్రియ‌ను పూర్తి చేసింది. పోలా ఫార్మా కొనుగోలుతో ప్రపంచవ్యాప్తంగా తమ చర్మ సంబంధింత ఔషధ విభాగం మరింత పటిష్టమవుతోందని పేర్కోంది. హెచ్‌డీఎఫ్‌సీ స్టాండ‌ర్ లైఫ్ ఇన్సూరెన్స్:- కంపెనీ ఎండీ&సీఈవో ప‌ద‌వికి విభా ప‌డాల్కర్ నియ‌మానికి షేర్‌హోల్డర్ల అనుమ‌తి ద‌క్కించుకుంది. టొరెంటా ఫార్మా:- థానే ప‌ట్టణానికి 20 ఏళ్ల పాటు విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు ఆర్డర్లను దక్కించుకుంది. ఎన్‌హెచ్‌పీసీ:- 

బ్యాంకింగ్‌ ఏడీఆర్‌లు డౌన్‌

Friday 4th January 2019

అమెరికా మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌ కంపెనీల ఏడీఆర్‌లు (అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్స్‌) గత రాత్రి 1-5 శాతం మధ్య నష్టాల్ని చవిచూసాయి. బ్యాంకింగ్‌ ఏడీఆర్‌లు ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.7 శాతం మేర క్షీణించి 10.15 డాలర్ల వద్ద క్లోజ్‌కాగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1.8 శాతం క్షీణతతో 101.9 డాలర్ల వద్ద క్లోజయ్యింది. టెక్నాలజీ కంపెనీ ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 1.7 శాతం వరకూ నష్టపోయి 9.47 డాలర్ల వద్ద ముగిసింది. మరో

Most from this category