STOCKS

News


మార్కెట్లో మళ్లీ అమ్మకాల సునామి

Tuesday 13th August 2019
Markets_main1565691791.png-27742

  • 623 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ 
  • 183 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 

రెండు ట్రేడింగ్‌ సెషన్లలో భారీ ర్యాలీ అనంతరం మార్కెట్లో మళ్లీ అమ్మకాల సునామి నెలకొంది. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్‌ 624 పాయింట్లు నష్టపోయి 37000 స్థాయిని కోల్పోయి 36,958 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్‌ 184 పాయింట్లను కోల్పోయి 11100 స్థాయి దిగువన 10,925 వద్ద ముగిసింది. కేంద్రం పన్ను రాయితీలను ప్రకటించనున్నదనే అంచనాలతో  గతవారం గురు, శుక్రవారాల్లో స్టాక్‌ సూచీలు 2 శాతంపైగా జంప్‌చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అంతర్జాతీయ‍ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత వాతావరణ పరిస్థితులు, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ భారీగా బలహీనపడటం, విదేశీ ఇన్వెస్టర్లపై విధించిన అదనపు పన్నును ఎత్తివేయవచ్చనే అంశంపై కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడం తదితర అంశాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సూచీలు లాభంతో ట్రేడింగ్‌ ప్రారంభించినప్పటికీ.., తిరిగి నష్టాల్లోకి మళ్లాయి. అన్నిరంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 702 పాయింట్లు(2.50శాతం) నష్టపోయి 28000 స్థాయి దిగువున 27,729.10 వద్ద ముగిసింది. వరుసగా తొమ్మిదో నెలలో కూడా కార్ల అ‍మ్మకాలు తగ్గాయని గణంకాలు వెలువడటంతో అటో షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. నిఫ్టీ అటో ఇండెక్స్‌ 4శాతం నష్టపోయింది. ఇంట్రాడే నిఫ్టీ ఇండెక్స్‌ 10,901.60 - 11,145.90 రేంజ్‌లో ట్రేడవ్వగా, సెన్సెక్స్‌ 36,888.49 - 37,755.16 శ్రేణిలో కదలాడింది. 

ఐషర్‌మోటర్స్‌, బజాజ్‌ఫిన్‌ సర్వీసెస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 5.50శాతం నుంచి 11శాతం పతనమయ్యాయి. జీ లిమిటెడ్‌, గెయిల్‌, సన్‌ఫార్మా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు అరశాతం నుంచి 14.50శాతం లాభపడ్డాయి. 
  



You may be interested

క్యూ1 ఫలితాలు: రాణించిన సన్‌ ఫార్మా

Tuesday 13th August 2019

సన్ ఫార్మాస్యూటికల్స్ మంగళవారం ప్రకటించిన జూన్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలలో, ఏడాది ప్రాతిపదికన లాభం 31.22 శాతం పెరిగి రూ. 1,387.48 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 1,057.29 కోట్లుగా ఉంది. కాగా ఈ త్రైమాసికంలో ఈ కంపెనీ లాభం రూ. 994 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ త్రైమాసికంలో ఆదాయం 15.69 శాతం పెరిగి రూ .8,259.30 కోట్లకు

ఏడాది కనిష్ఠానికి 99 స్టాకులు

Tuesday 13th August 2019

ఎన్‌ఎస్‌ఈ మంగళవారం ట్రేడింగ్‌లో సుమారుగా 99 స్టాకులు వాటి 52 వారాల కనిష్ఠానికి పడిపోయాయి. అరవింద్ ఫ్యాషన్స్, భండారి హోసిరీ ఎక్స్‌పోర్ట్స్‌, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, సిప్లా షేర్లు వాటి 52 వారాల కనిష్టాన్ని తాకాయి. వీటితో పాటు కాఫీ డే ఎంటర్ప్రైజెస్, కాక్స్ అండ్‌ కింగ్స్, జీఎఫ్ఎల్, ఐజీ పెట్రోకెమికల్స్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, లెమన్ ట్రీ హోటల్స్, షెమరూ ఎంటర్‌టైన్‌మెంట్‌, టాటా స్టీల్, సన్

Most from this category