STOCKS

News


ఆరంభలాభాలు ఆవిరి

Tuesday 13th August 2019
Markets_main1565670436.png-27727

సూచీలు లాభాల ఆరంభాన్ని నిలుపుకోవడంతో విఫలమయ్యాయి. ఫలితంగా మార్కెట్‌ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే లాభాల్లోకి నుంచి నష్టాల్లోకి మళ్లాయి. దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. సౌదీ అరామ్‌కో తో రూ. లక్ష కోట్ల పెట్టుబడి ఒప్పందం ప్రకటించడటంతో పాటు బడ్జెట్‌ ప్రతిపాదిపించిన సూపర్‌ రిచ్‌ పన్ను కేంద్ర ఎత్తివేయవచ్చనే అంచనాలతో నేడు సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 127 పాయింట్ల లాభంతో 37,755.16 పాయింట్ల వద్ద,  నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 11139 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అయితే ట్రేడింగ్‌ ప్రారంభమైన క్షణాల్లో సూచీల్లో అధిక వెయిటేజీ కలిగి హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ద్వయం భారీ పతనంతో సూచీలు లాభాలను హరించివేశాయి. అలాగే వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలతో ప్రపంచమార్కెట్లో అస్థిరత వాతావరణం నెలకొని ఉండటం, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 27పైసలు బలహీనపడి 71 స్థాయిపైన 71.07 క్షీణించడం తదితర ప్రతికూలాంశాలతో ఇటు ఇన్వెస్టర్లు, అటు ‍ట్రేడర్లు ఒక్కసారిగా అమ్మకాలకు తెరలేపారు. ఫలితంగా సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం(37,755.16) నుంచి 445 పాయింట్లు నష్టపోయి 37,321.28 వద్ద, నిఫ్టీ నేటి హై(11,145.90) నుంచి 104 పాయింట్లు నష్టపోయి 11,041.40 వద్దకు పతనమైంది. మెటల్‌, రియల్టీ, మీడియా షేర్లలో తప్ప అన్ని రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. రూపాయి భారీ పతనంతో ఐటీ షేర్లు ఎ‍క్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. మరోవైపు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 9శాతం పెరిగి సూచీల పతనాన్ని కొంతమేర అడ్డుకుంటుంది. ఉదయం గం.9:45ని.లకు కిత్రం ముగింపు(37,581)తో పోలిస్తే సెన్సెక్స్‌ 239.33 పాయింట్ల నష్టంతో 37,342.58 వద్ద, నిఫ్టీ క్రితం ముగింపు(11,109.65)తో పోలిస్తే 52.45 పాయింట్లును కోల్పోయి 11,057.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

71 దిగువకు రూపాయి

Tuesday 13th August 2019

రూపీ డాలర్‌ మారకంలో మంగళవారం 36 పైసలు బలహీనపడి 71.14 వద్ద ప్రారంభమైంది. అధిక పన్ను సర్‌చార్జికి సంబంధించి విదేశీ పెట్టుబడిదారులు, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల మధ్య సమావేశం జరగనుండడంతో, మార్కెట్‌లో పాల్గొనేవారు జాగ్రత్త వహించారు. ఫలితంగా గత సెషన్‌లో(శుక్రవారం) రూపీ డాలర్‌ మారకంలో 9 పైసలు బలహీనపడి 70.78 వద్ద ముగిసింది.  

తగ్గిన చమురు

Tuesday 13th August 2019

గత సెషన్లో(సోమవారం) స్వల్ప లాభాలను అందుకున్న చమురు, మంగళవారం ట్రేడింగ్‌లో నష్టాల్లో  ట్రేడవుతోంది. అంతర్జాతీయ మందగమన ఆందోళనల వలన  ప్రధాన చమురు ఉత్పత్తిదారులు, చమురు సరఫరా కోతను కొనసాగించే అవకాశం ఉండడంతో గత సెషన్‌లో చమురు స్వల్పంగా లాభపడింది. అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్‌ ఫ్యూచర్స్ మంగళవారం  0.2 శాతం క్షీణించి బ్యారెల్కు  58.46 డాలర్లకు చేరుకుంది. అదే విధంగా డబ్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ 0.2 శాతం తగ్గి

Most from this category