STOCKS

News


జనవరి సీరిస్‌లో పెరిగిన రోలోవర్లు

Friday 28th December 2018
Markets_main1545990787.png-23290

డిసెంబర్‌ సీరిస్‌తో పోలిస్తే జనవరి సీరిస్‌లోకి నిఫ్టీ రోలోవర్లు పెరిగాయి. డిసెంబర్‌తో పోలిస్తే రోలోవర్లు దాదాపు 13.66 శాతం పెరిగి జనవరిలో 74.27 శాతానికి చేరాయి. నిఫ్టీ గత మూడునెలల సరాసరి రోలోవర్లు 69.85 శాతమున్నాయి. మార్కెట్‌ పరిస్థితిని బట్టి చూస్తే ఎక్కువగా షార్ట్స్‌ రోలోవర్ జరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పలువురు ఇన్వెస్టర్లు ఆచితూచి పొజిషన్లు తీసుకుంటున్నారు. ఎఫ్‌ఐఐలు డిసెంబర్‌లో మిశ్రమ పొజిషన్లు తీసుకొని చివర్లో ఎగ్జిట్‌ అయ్యారు. క్యాష్‌ మార్కెట్లో ఎఫ్‌ఐఐలు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. మరోవైపు డిసెంబర్‌ సీరిస్‌లో డీఐఐలు చురుగ్గా వ్యవహరించారు. 
జనవరి సీరిస్‌లో 10800, 11200 పాయింట్ల వద్ద ఎక్కువ కాల్‌రైటింగ్‌ జరిగింది. దిగువన 10400, 10000 పాయింట్ల వద్ద ఎక్కువ పుట్‌ రైటింగ్‌ కనిపించింది. జనవరి సీరిస్‌లో 10500, 10000 పాయింట్ల వద్ద భారీగా పుట్స్‌ పోగయ్యాయి. 11200, 11000 పాయింట్ల వద్ద కాల్స్‌ ఎక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి ఈ సీరిస్‌లో నిఫ్టీ ఎక్కువగా 10450- 11100 పాయింట్ల మధ్య కదలాడవచ్చని నిపుణుల అంచనా.
బ్యాంకు నిఫ్టీలో జనవరి రోలోవర్లు నీరసంగా ఉన్నాయి. మూడునెలల సరాసరి కన్నా తక్కువ రోలోవర్లు నమోదయ్యాయి. బ్యాంకు నిఫ్టీ ఓపెన్‌ ఇంట్రస్టు సైతం ఏడేళ్లలో ఎప్పుడూ లేనంత దిగువకు వచ్చింది. గత మూడునెలలు బాగా ప్రదర్శన జరిపినందున ఈ నెల్లో బ్యాంకు నిఫ్టీ వెనక్కు తగ్గవచ్చని నిపుణుల అభిప్రాయం. ఇందుకు తగ్గట్లే ఇటీవల కాలంలో నిఫ్టీతో పోలిస్తే బ్యాంకునిఫ్టీ పేలవ ప్రదర్శన చూపుతోంది. 
స్టాక్స్‌ పరంగా...
జనవరి సీరిస్‌లోకి పీసీజువెలర్స్‌, బీఈఎంఎల్‌, రెప్కోహోమ్స్‌, ఆర్‌కామ్‌, బాటా ఇండియా, బీఓఐ, కావేరీ సీడ్స్‌, కజారియా షేర్లలో లాగ్స్‌ ఎక్కువగా రోలోవరయ్యాయి.
సన్‌ఫార్మా, జెట్‌ ఎయిర్‌వేస్‌; ఆర్‌ ఇన్‌ఫ్రా, భారత్‌ఫోర్జ్‌, అరబిందో ఫార్మా, ఓఐఎల్‌, జేఎస్‌డబ్ల్యు స్టీల్‌లో షార్ట్‌ రోలోవర్లు ఎక్కువగా ఉన్నాయి. 



You may be interested

భారీ ప్రీమియంతో భారత్‌ మార్కెట్లు

Friday 28th December 2018

వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత ఈక్విటీ మార్కెట్లు భారీ ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. వచ్చే ఏడాది కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ బాగా పెరుగుతాయన్న అంచనాలు దేశీయ సూచీలను పరుగులు తీయించాయి. ప్రస్తుతం ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఇండెక్స్‌తో పోలిస్తే నిఫ్టీ సుమారు 100 శాతం ప్రీమియంతో ఉంది. నిఫ్టీ ట్రయిలింగ్‌ 12 నెలల పీఈ 22 వద్ద ఉండగా, ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ పీఈ 11.45 వద్ద ఉంది. 2000 సంవత్సరం తర్వాత

ఈ ఏడాదిలో తీవ్ర నష్టాలను పంచిన షేర్లివే..!

Friday 28th December 2018

ఈ ఏడాదిలో దేశీయ ఈక్విటీ మార్కెట్‌ తీవ్రమైన ఆటుపోట్ల మధ్య ర్యాలీ చేసింది. అంతర్జాతీయంగా అమెరికా - చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు పెరిగి మార్కెట్లో అనిశ్చితి ఏర్పడటంతో పాటు దేశీయంగా ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ద్రవ్య కొరత సంక్షోభం, బ్యాంకింగ్‌ వ్యవస్థలో పెరిగిన మొండిబకాయిలు, కార్పోరేషన్‌ గవర్నెన్స్‌ సమస్యతో పాటు పలు వివాదస్పదమైన రాజకీయ అంశాతో మార్కెట్‌ తీవ్రఒడిదుడుకులకు లోనైంది. అయినప్పటికీ.., ఇదే ఏడాదిలో సెన్సెక్స్‌ సూచీ ఆగస్ట్‌

Most from this category