STOCKS

News


ఈ స్థాయిలో మార్కెట్లు కన్సాలిడేషన్‌: జెమ్‌స్టోన్‌ ఈక్విటీ

Thursday 13th December 2018
Markets_main1544641445.png-22869

నిఫ్టీ బుధవారం మరోసారి కీలకమైన 200 డీఎంఏ 10,752 సమీపంలోకి చేరుకుంది. రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ విజయాన్ని గ్రహించి ఫలితాల ముందు రోజే భారీగా క్రాష్‌ అయిన మార్కెట్లు, ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నిష్క్రమణను, బీజేపీ ఓటమిని జీర్ణించుకుని రెండు రోజుల్లో ఏకంగా 440 పాయింట్ల మేర ర్యాలీ చేసింది. ఇక ఈ స్థాయిలో కాస్త ఊపిరి పీల్చుకుని, నిలదొక్కుకోవచ్చని  జెమ్‌స్టోన్‌ ఈక్విటీ అండ్‌ రీసెర్చ్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలన్‌ వైష్ణవ్‌ అన్నారు. ఇక్కడి నుంచి ప్రతీ అప్‌మూవ్‌లోనూ కన్సాలిడేషన్‌కే అవకాశం ఉంటుందన్నారు. 

 

200 డీఎంఏ కీలకం
మార్కెట్‌కు 200 డీఎంఏ కీలకమని వైష్ణవ్‌ పేర్కొన్నారు. 10,752-10,830 తక్షణ నిరోధ స్థాయిలుగా పనిచేస్తాయని, అదే సమయంలో 10,680-10,610 మద్దతు స్థాయిలుగా ఉంటాయన్నారు. ‘‘రిలేటివ్‌ స్ట్రెంత్‌ ఇండెక్స్‌ (ఆర్‌ఎస్‌ఐ) రోజువారీ చార్ట్‌లో 53.4189గా ఉంది. రోజువారీ ఎంఏసీడీ ఇప్పటికీ బేరిష్‌గానే ఉంది. సిగ్నల్‌ లైన్‌ కిందే ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ బలమైన బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పాటు చేసి బలమైన అప్‌మూవ్‌ చూపిస్తోంది. ఇతర కీలక సూచికలు తటస్థంగానే ఉన్నాయి. రెండు రోజుల్లో నిఫ్టీ 440 పాయింట్లు పెరిగిన తర్వాత కొంత కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. అయితే, మార్కెట్లు ఈ స్థాయిలో ఊపిరి తీసుకునేందుకు వేచి చూడకపోతే అన్ని అప్‌మూవ్‌ల్లోనూ లాభాలను కాపాడుకునేందుకు వినియోగించుకోవాలి. డౌన్‌సైడ్‌ పరిమితమే. పొజిషన్ల విషయంలో తక్కువే కలిగి ఉండాలి. కన్సాలిడేషన్‌ సమయాల్లో ఎంపిక చేసిన వాటిని కొనుగోలు చేసుకోవచ్చు’’అని వైష్ణవ్‌ సూచించారు. 



You may be interested

డివిడెండ్‌ తారలు... ఈ షేర్లు

Thursday 13th December 2018

డివిడెండ్‌ అనేది ఈక్విటీ ఇన్వెస్టర్లకు అదనపు ఆదాయ వనరు. కొన్న తర్వాత స్టాక్‌ ధర పెరిగితే అది పెట్టుబడిపై లాభం. చాలా మంది దీనిపైనే దృష్టి పెడుతుంటారు. కానీ, స్టాక్స్‌పై వచ్చే డివిడెండ్‌ ఆదాయం గురించి పట్టించుకోరు. దీన్ని బోనస్‌ లాభంగా భావించాల్సి ఉంటుంది. తమ లాభాల నుంచి కంపెనీలు కొంత వాటాను షేరు వారీగా డివిడెండ్‌ రూపంలో పంచుతుంటాయి. కొన్ని కంపెనీలు అసలు డివిడెండ్‌ ఇవ్వడానికి కూడా ఆసక్తి

మెటల్‌ షేర్ల మెరుపులు

Wednesday 12th December 2018

మార్కెట్లో బుధవారం మెటల్‌ షేర్లు మెరుస్తున్నాయి.  ప్రపంచమార్కెట్లో బేస్‌ మెటల్స్‌ ధరలు పెరగడంతో  దేశీయ మెటల్‌ షేర్లకు డిమాండ్‌ పెంచింది. ఫలితంగా నేడు నిఫ్టీ మెటల్‌ ఎన్‌ఎస్‌ఈలో అత్యధికంగా లాభపడింది. మధ్యాహ్నం గం.12:20.లకు నిప్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2.50శాతం లాభంతో 3,116.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సూచీలో అత్యధికంగా జేఎస్‌ఎల్‌హిస్సార్‌ స్టీల్‌ 7శాతం, జిందాల్‌ స్టీల్‌ 6శాతం ర్యాలీ చేశాయి. వెల్‌స్పన్‌ కార్ప్‌, టాటాస్టీల్‌, సెయిల్‌, నాల్కో షేర్లు 3శాతం లాభపడ్డాయి.

Most from this category