STOCKS

News


తక్షణ మద్దతు 36,450 ..నిరోధం 36,950

Tuesday 12th March 2019
Markets_main1552376009.png-24549

వడ్డీ రేట్ల పెంపునకు అమెరికా ఫెడ్‌ బ్రేకులు వేయడం, అమెరికా-చైనాల వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాల అధ్యక్షులు త్వరలో సంతకాలు చేయవచ్చన్న వార్తలతో నెలల గరిష్టస్థాయికి చేరిన పలు ప్రపంచ ప్రధాన మార్కెట్లు గతవారం ద్వితీయార్థంలో ఆర్థిక వృద్ధి మందగిస్తుందన్న భయాలతో ర్యాలీకి బ్రేకులు వేశాయి. కానీ ఇదే సమయంలో విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడుల వేగాన్ని పెంచడంతో భారత్‌ మార్కెట్‌ నెలరోజుల గరిష్టస్థాయిలో ముగిసింది. లోక్‌సభ ఎన్నికలకు ఆదివారం ఎన్నికల కమీషన్‌ షెడ్యూల్‌ను ప్రకటించిన కారణంగా వచ్చే కొద్ది వారాల్లో ఎన్నికల ఫలితాలపై అంచనాల ఆధారంగా మార్కెట్‌ కదలవచ్చన్నది అత్యధికశాతం విశ్లేషకుల అంచనా. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే, 

సెన్సెక్స్‌ సాంకేతికాలు...
మార్చి 8తో ముగిసిన వారంలో గత మార్కెట్‌ పంచాంగంలో అంచనాలకు అనుగుణంగా 36,830 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన తర్వాత 36,671 పాయింట్ల వద్ద ముగిసింది. అంతక్రితంవారంకంటే 607 పాయింట్ల భారీ లాభాన్ని ఆర్జించింది.  ఈ వారం అప్‌ట్రెండ్‌ కొనసాగితే తక్షణం 36,950 పాయింట్ల స్థాయి తక్షణ అవరోధం కల్పించవచ్చు.  అటుతర్వాత 37,060 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఆపైన స్థిరపడితే కొద్దిరోజుల్లో 37,490 పాయింట్ల స్థాయిని సైతం అందుకునే ఛాన్స్‌ వుంటుంది. ఈ వారం తొలి నిరోధాన్ని అధిగమించలేకపోయినా, మార్కెట్‌ బలహీనంగా ప్రారంభమైనా 36,470 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ లోపున ముగిస్తే క్రమేపీ 36,140 పాయింట్ల వద్దకు తగ్గొచ్చు. ఈ లోపున 35,715 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. 

నిఫ్టీ తక్షణ మద్దతు 10,995, అవరోధం 11,120
గత వారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,089 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన తర్వాత  అంతక్రితంవారంతో పోలిస్తే 172 పాయింట్ల లాభంతో 11,035 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ అప్‌ట్రెండ్‌ కొనసాగితే తక్షణం 11,120 పాయింట్ల స్థాయి నిరోధించవచ్చు. ఆపైన ముగిస్తే 11,170 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. అటుపై క్రమేపీ కొద్ది రోజుల్లో 11,300 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుంటుంది. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోయినా, మార్కెట్‌ బలహీనంగా ప్రారంభమైనా 10,995 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ లోపున ముగిస్తే క్రమేపీ 10,940 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున క్రమేపీ 10,880 పాయింట్ల స్థాయికి క్షీణించవచ్చు.



You may be interested

ఈ ఏడాది ఈక్విటీల్లోకి రూ. లక్ష కోట్ల ఎఫ్‌ఐఐ నిధులు!

Tuesday 12th March 2019

ప్రముఖ ఇన్వెస్టర్‌ పొరింజు అంచనా దేశ ఆర్థిక వ్యవస్థ, దేశ ఈక్విటీ మార్కెట్‌పై ప్రముఖ ఇన్వెస్టర్‌ పొరింజు వెలియత్‌ పూర్తి ఆశావహ ధృక్పథంతో ఉన్నారు. దేశీయ మార్కెట్లో బుల్‌ రన్‌ ఇప్పుడే మొదలైందని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీ మరలా ఎన్నికవడం ఖాయమని అంచనా వేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఎకానమీలో రాజకీయాల ఆటకు చెక్‌ చెప్పిందని, జీఎస్‌టీ, దివాలా చట్టం లాంటివాటిని వెనక్కు తీసుకోలేమని వివరించారు. అందువల్ల ఈ

మ్యూచువల్‌ ఫండ్స్‌పై ఎన్నికల ప్రభావం ఎంత

Tuesday 12th March 2019

ప్ర: త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాదని, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలే అధికంగా ఉన్నాయని మిత్రులంటున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా రానున్న మూడేళ్లలో స్మాల్‌, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ పనితీరు ఎలా ఉండబోతోంది ?  -సాగర్‌, హైదరాబాద్‌  జ: ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం కొంచెం కష్టసాధ్యమైన విషయమే.. స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ ఒక పూర్తి కాలపు మార్కెట్‌ సైకిల్‌లో మంచి రాబడులే సాధిస్తాయి. మార్కెట్‌ పతన

Most from this category