STOCKS

News


లుపిన్‌లో అమ్మకాలు.. జేఎస్‌డబ్ల్యూలో కొనుగోళ్లు!!

Saturday 11th August 2018
Markets_main1533976864.png-19181

ఇండెక్స్‌ షేర్లను హోల్డ్‌చేసే ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ ఫార్మా దిగ్గజ కంపెనీ లుపిన్‌ను వదిలించుకోనున్నాయి. రానున్న ఇండెక్స్‌ సర్దుబాటు సమీక్షలో లుపిన్‌ స్టాక్‌ను బెంచ్‌మార్క్‌ నిఫ్టీ నుంచి తొలగిస్తే అప్పుడు ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) రూ.210 కోట్ల విలువైన ఈ స్టాక్‌ను విక్రయించే అవకాశముంది. ఇన్‌స్టిట్యూషనల్‌ బ్రోకరేజ్‌ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఈ విషయాలు వెల్లడించింది. నిఫ్టీ ఇండెక్స్‌లో లుపిన్‌ స్థానాన్ని జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ భర్తీ చేస్తుందనే అంచనాలున్నాయి. దీనివల్ల ఈటీఎఫ్‌లు దాదాపు రూ.360 కోట్ల విలువైన జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లను కొనుగోలు చేసే అవకాశముంది. 
ఇండెక్స్‌ ఫండ్స్‌ అనేవి ఇండెక్స్‌లోని స్టాక్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్‌ చేస్తాయి. అందువల్ల ఇండెక్స్‌ సమీక్ష సమయంలో ఒక స్టాక్‌ను తీసేయడం, మరొక స్టాక్‌ను జతచేయడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు దీనికి అనుగుణంగా ఇండెక్స్‌ ఫండ్స్‌ కూడా వాటి ఇన్వెస్ట్‌మెంట్లను సమీక్షించుకుంటాయి. 
యాక్టివ్‌ ఫండ్స్‌ వాటి హోల్డింగ్స్‌ను బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లతోపాటు సర్దుబాటు చూసుకోవడానికి ఇష్టపడతాయని, అందువల్ల కొనుగోలు, అమ్మకాలు జరుగుతాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. 
ఇండెక్స్‌ నుంచి లుపిన్‌ తొలగింపు వల్ల ఫార్మా రంగ వెయిటేజీపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. నిఫ్టీలో ఫార్మాస్యూటికల్‌ వెయిటేజీ తగ్గుతుందని తెలిపింది. మంచి పనితీరు కనబరచకపోవడం వల్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ తగ్గుదల ఇందుకు కారణంగా పేర్కొంది. 2018 ఏప్రిల్‌లో అరబిందో ఫార్మాను నిఫ్టీ నుంచి తొలగించారని, దీని తర్వాత ఇప్పుడు లుపిన్‌ను కూడా ఇండెక్స్‌ నుంచి తీసివేయనున్నారని తెలిపింది. దీని వల్ల నిఫ్టీ 50లో ఫార్మా వెయిటేజీ 2.7 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. 2015 మార్చిలో ఫార్మా వెయిటేజీ 7 శాతంగా ఉండేదని గుర్తుచేసింది. 
ఇండెక్స సర్దుబాటు సెప్టెంబర్‌ 28 నుంచి అమల్లోకి వస్తుందని, అయితే సర్దుబాటు నిర్ణయం ఇప్పటి నుంచి సెప్టెంబర్‌ 1 మధ్యకాలంలో వెలువడనుందని పేర్కొంది. 
‘ఇండెక్స్‌ విలువ కూడా స్వల్పంగా తగ్గనుంది. భవిష్యత్‌ పీఈ విలువ 20.69 రెట్లు నుంచి 20.53 రెట్లుకు తగ్గనుంది. కొత్తగా చేర్చే స్టాక్‌ పీఈ రేషియో.. తొలగింపనున్న స్టాక్‌ పీఈ రేషియో కన్నా తక్కువగా ఉండటం ఇందుకు కారణం’ అని వివరించింది. అదే పీఈ రేషియో ఎక్కువగా ఉన్న బ్రిటానియా ఇండస్ట్రీస్‌ను జతచేస్తే ఇండెక్స్‌ పీఈ పెరుగుతుందని పేర్కొంది. 



You may be interested

ఆటోమొబైల్స్‌ కంపెనీలపై పాజిటివ్‌ వ్యూ

Saturday 11th August 2018

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషించే రంగాల్లో ఆటోమొబైల్‌ కూడా ఒకటి. ఇది జీడీపీలో దాదాపు 4 శాతం వాటాను ఆక్రమించి ఉంది. వాహన రంగంలో వృద్ధి జోరందుకుంటోంది. వినియోగం ఊపందుకోవడం ఇందుకు కారణం. టూవీలర్లు, ఫోర్‌వీలర్లు, ట్రాక్టర్ల విక్రయాలు వినియోగ డిమాండ్‌ను ప్రతిబింబిస్తున్నాయి. ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ అడ్వైజర్స్‌ చైర్మన్‌, ఎండీ డీకే అగర్వాల్‌ ఒక ఆంగ్ల చానల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.

ఇన్ఫోసిస్‌లో కొంత వాటా విక్రయించిన శిబులాల్‌

Saturday 11th August 2018

బెంగళూరు:- ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, మాజీ సీఈఓ ఎస్‌డీ శిబులాల్ కుటుంబం ఇన్ఫోసిస్‌లో తమ వాటాను విక్రయించింది. ఈ మేరకు ఎస్‌డీ శిబులాల్ తన కుటుంబ సభ్యులు ఆగస్ట్‌ 08-10 మధ్య కాలంలో 11 కోట్ల ఈక్విటీ షేర్లును విక్రయించినట్లు అధికారికంగా ప్రకటించారు. వ్యక్తిగత, సేవాకార్యక్రమాలకు డబ్బు అవసరమైనందున స్వల్ప మొత్తంలో కంపెనీలో ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు ఆయన తెలిపారు. వాటా విక్రయం తర్వాత కూడా కంపెనీకి తన కుటుంబానికి

Most from this category