STOCKS

News


లుపిన్‌, హెచ్‌పీసీఎల్‌ అవుట్‌!

Wednesday 11th July 2018
Markets_main1531287726.png-18198

అక్టోబర్‌లో నిఫ్టీ పునర్‌వ్యవస్థీకరణ
గోద్రేజ్‌కన్జూమర్‌ ప్రొడక్ట్స్, జేఎస్‌డబ్ల్యుస్టీల్‌ ఇన్‌
భారత్‌లో అత్యంత పాపులర్‌ సూచీ నిఫ్టీలోకి అక్టోబర్‌లో కొత్త చేరికలు, తీసివేతలు జరగనున్నాయి. నిఫ్టీ 100లో ఉండే కంపెనీల నుంచి ఫ్రీఫ్లోట్‌ క్యాపిటలైజేషన్‌, లిక్విడిటీ, సూచీలపై అవి చూపగల ప్రభావం ఆధారంగా నిఫ్టీ 50 సూచీలోకి తీసుకుంటారు. ఇలా తీసుకునే కంపెనీల స్టాకులకు డెరివేటివ్స్‌ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆరునెలల డేటా ఆధారంగా రెండు మార్లు నిఫ్టీలోకి ఈ కూడికలు తీసివేతలు చేస్తుంటారు. జనవరి 31, జూలై 31తో ముగిసే ఆరు నెలల డేటా ఆధారంగా నిఫ్టీ పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుంటుంది. ఈ సందర్భంగా స్పిన్‌ఆఫ్‌, క్యాపిటల్‌ రీస్ట్రక్చరింగ్‌ లాంటివి చేపట్టిన కంపెనీలకు నిఫ్టీలో చేరే అవకాశం వస్తుంటుంది. కొత్తగా లిస్టయిన కంపెనీలను నిఫ్టీలో చేర్చుకోవాలంటే వాటి మూడునెలల డేటాను పరిశీలించడం జరుగుతుంది. నిఫ్టీ ఇండెక్స్‌లను ఫ్లోట్‌ అడ్జెస్టెడ్‌ వెయిటెడ్‌ మార్కెట్‌ క్యాప్‌ విధానం ఆధారంగా పనిచేసేలా ఏర్పాటు చేశారు. ఈ విధానంలో కంపెనీల్లో జరిగే కార్పొరేట్‌ చర్యలను ఆటోమేటిగ్గా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ దఫా పునర్‌వ్యవస్థీకరణలో లుపిన్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు నిఫ్టీ నుంచి వైదొలగనున్నాయి. గోద్రేజ్‌కన్జూమర్‌ ప్రొడక్ట్స్, జేఎస్‌డబ్ల్యుస్టీల్‌ షేర్లు నిఫ్టీలో చేరనున్నాయి. 



You may be interested

దుమ్మురేపిన టీసీఎస్‌

Wednesday 11th July 2018

జోష్‌నిచ్చిన క్యూ1 ఫలితాలు ముంబై:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంచనాలను మించి లాభాలను సాధించడంతో టీసీఎస్‌ షేరు గురువారం ఆల్‌టైం హైని నమోదు చేసింది. అన్ని వ్యాపార విభాగాలు మెరుగైన పనితీరును కనబర్చడంతో టీసీఎస్‌ ఈ క్యూ1 కాలానికి సంబంధించి ఆకర్షణీయమైన ఫలితాలను బుధవారం ప్రకటించింది. ఫలితాలు ఆకర్షణీయంగా ఉండటంతో నేడు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే టీసీఎస్‌ షేరు దుమ్మురేపింది. రెండు రోజుల వరుస నష్టాల ముగింపు తరువాత

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 11th July 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు మియిండా ఇండస్ట్రీస్‌:- 2:1 నిష్పత్తిలో ఎక్స్‌-బోనస్‌ ప్రకటించింది. ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌:- జూలై 13న జరిగే బోర్డు సమావేశంలో నిధుల సమీకరణంపై చర్చించనుంది. యాక్సిస్‌ బ్యాంక్‌:- ఎండీ & సీఈవో పదవి కోసం ముగ్గురు అభ్యర్థుల పేర్లను సిఫారసు చేసింది. 2018, డిసెంబర్‌ 31వ తేదితో శిఖాశర్మ పదవికాలం ముగుస్తుంది. పీఎస్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌:- పీఎన్‌బీ&కార్లే గ్రూప్‌ పీఎన్‌బీలోని 51శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధమైంది. ఆంధ్రా బ్యాంక్‌:-

Most from this category