STOCKS

News


చివర్లో కొనుగోళ్లు...లాభాల ముగింపు

Thursday 24th January 2019
Markets_main1548325544.png-23787

10850ల వద్ద నిఫ్టీ
86పాయింట్ల లాభపడ్డ సెన్సెక్స్‌

చివర అరగంటలో హెవీవెయిట్‌ షేర్లలో జరిగిన కొనుగోళ్లతో మార్కెట్‌ రెండురోజుల నష్టాలకు స్వస్తి పలికింది. నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 10850 వద్ద, సెన్సెక్స్‌ 86 పాయింట్లు పెరిగి 36,195 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న బలహీన పరిస్థితులకు తోడు వివిధ కంపెనీల మూడో త్రైమాసికి ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఇంట్రాడేలో సూచీలు స్వల్ప లాభనష్టాల మధ్య ట్రేడ్ అయ్యాయి. అయితే చివరి అరగంటలో యస్‌ బ్యాంక్‌కు కొత్త సీఈఓను నియమిస్తున్నట్లు వార్త వెలువడటంతో ఆ షేరు జోరుగా ర్యాలీ చేయడంతో పాటు  హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ తదితర హెవీవెయిట్‌  కౌంటర్లలో  అనూహ్యంగా కొనుగోళ్లు జరగడంతో సూచీలు లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ రోజంతా నష్టాల్లో ట్రేడైనప్పటికీ, ముగింపు సమయంలో యస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్ల ర్యాలీతో 15పాయింట్ల లాభంతో 27,266.40 వద్ద ముగిసింది. ఇక ఐటీ, ఎఫ్‌ఎంజీసీ, రియల్టీ ఇండెక్స్‌ లాభాల్లో ముగిశాయి. అటో, ఫార్మా, ఫైనాన్స్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి.
యస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌, టెక్‌ మహీంద్రా షేర్లు 9 శాతం నుంచి 1శాతం ర్యాలీ చేయగా, సన్‌ ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, యూపీఎల్‌, టాటామోటర్స్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 2నుంచి 5శాతం నష్టపోయాయి.



You may be interested

ఈ ఆరు కంపెనీలు మల్టీబ్యాగర్లు...!?

Friday 25th January 2019

నేడు చిన్నగా ఉన్న కంపెనీలే... రేపు లార్జ్‌క్యాప్‌, బ్లూచిప్‌ కంపెనీలుగా అవతరిస్తాయి. చిన్నగా ఉన్నాయని అన్నింటికీ దూరంగా ఉండడం కూడా తెలివైన నిర్ణయం కాకపోవచ్చు. ఇందుకు ఉదాహరణ మారికో కంపెనీయే. శిరోజాల నూనెల మార్కెట్లో చిన్న కంపెనీగా మొదలు పెట్టి మార్కెట్‌ లీడర్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. ‘‘మంచి యాజమాన్యాలు చిన్న అవకాశాలను సైతం పెద్దవిగా మలుచుకుంటాయి. సమర్థవంతమైన చిన్న కంపెనీలు పెద్దగా అవతరించగలవు’’ అని ఎలారా సెక్యూరిటీస్‌ ఎండీ

యస్‌బ్యాంక్‌ సీఈఓగా రవ్‌నీత్‌ గిల్‌..షేరు 9 శాతం జంప్‌

Thursday 24th January 2019

ప్రస్తుతం డాయిష్‌బ్యాంక్‌ ఇండియా సీఈఓగా పనిచేస్తున్న రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌ను తమ ఎండీ, సీఈఓగా ఎంచుకున్నట్లు యస్‌బ్యాంక్‌ వెల్లడించింది. వచ్చే మార్చి1న ఆయన యస్‌బ్యాంక్‌ పగ్గాలు చేపడతారు. బ్యాంకింగ్‌ రంగంలో ఆయనకు దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉంది. డాయిష్‌బ్యాంక్‌ సీఈఓగా ఆయన ఆరేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ నెల 10న ఇద్దరి పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేసిన బ్యాంకు, ఆ పేర్లను ఆర్‌బీఐకి పంపింది. ఫిబ్రవరి 1లోగా కొత్త సీఈఓను యస్‌బ్యాంకు

Most from this category