STOCKS

News


10750లపైన ప్రారంభమైన నిఫ్టీ

Tuesday 15th January 2019
Markets_main1547526816.png-23584

ఆశాజనకమైన ఆర్థిక గణాంకాల విడుదలతో మంగళవారం సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 36వేల ఎగువును, నిఫ్టీ 107500లపై ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర తిరిగి 60డాలర్లకు దిగిరావడం, ఆసియా మార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ సైతం దేశీయ సూచీలకు సానుకూల సంకేతాలనిచ్చాయి. కేంద్ర గణాంకాలు శాఖ డిసెంబర్‌ నెలకు సంబంధించిన టోకు, రీటైల్‌ ద్రవ్యోల్బణ గణాకాంలు నిన్న విడుదల చేసింది. టోకు ధర సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాల సూచీ 8నెలల కనిష్టానికి చేరుకోగా, వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) పెరుగుదల రేటు 18నెలల కనిష్ట స్థాయికి చేరుకోవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఫలితంగా మార్కెట్‌ ముడు రోజు నష్టాలకు ముగింపు పలుకుతూ నేడు లాభాలతో ప్రారంభమైంది. ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 150 పాయిం‍ట్ల లాభంతో 36010 వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 10785 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అన్ని రంగాలకు చెందిన ఇండెక్స్‌లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా ఐటీ రంగ షేర్ల ర్యాలీ చేస్తున్నాయి. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత ఇందుకు కారణమవుతోంది. అలాగే ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నాయి.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, జీ లిమిటెడ్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం నుంచి 5శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటర్స్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు అరశాతం నుంచి 1శాతం నష్టపోయాయి.



You may be interested

భారీ పతనాన్ని సూచిస్తున్న ఎఫ్‌పీఐ ఇండెక్స్‌ పొజిషన్లు

Tuesday 15th January 2019

నిఫ్టీ కొద్ది కాలంగా స్వల్ప శ్రేణిలో ట్రేడవుతోంది. పైకి పాజిటివ్‌ బ్రేకవుట్‌ ఇస్తుందా, కిందకు నెగిటివ్‌ బ్రేక్‌డౌన్‌ ఇస్తుందా? అని ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌లో ఎఫ్‌పీఐల పొజిషన్ల గణాంకాలు నిఫ్టీలో భారీ పతనాన్ని సూచిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది మార్చి నుంచి బ్యాంకు నిఫ్టీ, నిఫ్టీల ఉమ్మడి ఫ్యూచర్స్‌లో ఎఫ్‌పీఐ పొజిషన్ల ఓపెన్‌ ఇంట్రెస్ట్‌(ఓఐ)ని షేర్‌ఖాన్‌ సంస్థ పరిశీలిస్తోంది. ఈ రెండు సూచీల ఉమ్మడి ఓఐ -1,00,000ను

ఏ వయసులో ఎంత వైద్య బీమా?

Monday 14th January 2019

ఒకరిపై కుటుంబం ఆధారపడి ఉంటే, జీవిత బీమా పాలసీ తప్పకుండా తీసుకోవాలి. కానీ, వైద్య బీమా అలా కాదు. ఎవరికి వారు వారి ఆరోగ్య సమస్యలు, ఖర్చులను దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. అనారోగ్యం అన్నది ఎప్పుడు ఏ రూపంలో ఎదురవుతుందో తెలియదు. ప్రమాదం బారిన పడినా వైద్య చికిత్సలు అవసరం అవుతాయి. చిన్న వయసులో ఆరోగ్య సమస్యల ముప్పు తక్కువ. కానీ, వయసు పెరుగుతున్న కొద్దీ

Most from this category