STOCKS

News


వెలుగులో రియల్టీ షేర్లు

Monday 19th November 2018
Markets_main1542605162.png-22172

సూచీల స్వల్ప లాభాల ట్రేడింగ్‌ భాగంగా సోమవారం రియల్టీ రంగ షేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ రంగంలోని​ ప్రధాన షేర్లైన ఒబేరాయ్‌ రియల్టి, సన్‌టెక్‌ షేర్ల లాభాల ట్రేడింగ్‌ రియల్టీ రంగ షేర్ల ర్యాలీకి ప్రధాన కారణమైంది. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టి ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 2శాతం లాభపడింది. ఉదయం గం.10:30ని.లకు ఇండెక్స్‌ 2శాతం లాభంతో 226.30ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. సూచీలో భాగమైన మొత్తం 9షేర్లలో 7షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 2షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలోని ఒబేరాయ్‌ రియల్టి అత్యధికంగా 4శాతం ర్యాలీ చేసింది. సన్‌టెక్‌ 3.50శాతం, ఇండియబుల్స్‌రియల్‌ఎస్టేట్‌ 2.50శాతం, డీఎల్‌ఎఫ్‌, ఫోనెక్స్‌ లిమిటెడ్‌ 2శాతం లాభపడ్డాయి. బ్రిగేడ్‌, ప్రెస్టేజ్‌ షేర్లు 1శాతం పెరిగ్గా, యూనిటెక్‌ అరశాతం లాభపడింది. మరోవైపు శోభ లిమిటెడ్‌ 1.50శాతం నష్టపోగా, గోద్రేజ్‌ ప్రాపర్టీ 1శాతం క్షీణించింది.



You may be interested

ఇచ్చి... పుచ్చుకుంటే సంతృప్తి!!

Monday 19th November 2018

అందరిలోనూ లేకపోవచ్చు కానీ... సామాజిక సేవ చేయాలని, ఇతరులకు తమ వంతు తోడ్పాటునివ్వాలన్న ఆలోచన, ఆసక్తి ఉన్న వారు కూడా మన మధ్య చాలామంది ఉన్నారు. మనసులో కోరిక ఉన్నా... సమయాభావం, దూరాభారాలు, వ్యక్తిగత బాధ్యతలు తదితర అంశాలు చాలా మందిని దాతృత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నాయన్నది కాదనలేం. ఈ సమాజం నుంచి ఆర్జించిన దానిలో కొంత మొత్తాన్ని తిరిగి ఇవ్వడం ద్వారా కొంతయినా రుణం తీర్చుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి.

ప్రభుత్వరంగ బ్యాంకుల నష్టాలు మూడింతలు

Monday 19th November 2018

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికంలో 21 ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీ) నష్టాలు మూడున్నర రెట్లు పెరిగి రూ.14,716 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో పీఎస్‌బీల నష్టాలు రూ.4,284 కోట్లుగానే ఉండడం గమనార్హం. త్రైమాసికం వారీగా చూస్తే... జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరు కాస్తంత మెరుగైంది. జూన్‌ క్వార్టర్లో రూ.16,615 కోట్ల మేర పీఎస్‌బీలు నష్టాలు చవిచూశాయి. వీటితో పోలిస్తే సెప్టెంబర్‌

Most from this category