STOCKS

News


రియల్టీ షేర్ల పతనం

Friday 25th January 2019
Markets_main1548408556.png-23806

మిడ్‌ సెషన్‌ అనంతరం రియల్టీ రంగ షేర్లలో భారీ అ‍మ్మకాలు జరిగాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతనిధ్యం నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 3శాతం నష్టపోయింది. ఈ రంగానికి చెందిన డీఎల్‌ఎఫ్‌ కంపెనీ ఢిల్లీలోని ఉన్న ప్రధాన కార్యాలయంపై సీబీఐ దాడులు నిర్వహించారని మీడియాలో వార్తలు వెలువడంతో కంపెనీ షేరు 8శాతం పతనం రియల్టీ ఇండెక్స్‌ను బాగా దెబ్బతీశాయి. అలాగే యూనిటెక్‌ 3శాతం, శోభ 2.50శాతం, ఇండియాబుల్స్‌రియల్‌ఎస్టేట్‌, ఓబేరాయ్‌ రియల్టీ రంగ షేర్లు 2శాతం నస్టపోయాయి. ఫోనిక్స్‌ లిమిటెడ్‌ 1.50శాతం, బ్రిగేడ్‌ షేరు 1.50శాతం, సన్‌టెక్‌ 1శాతం క్షీణించాయి. మరోవైపు గోద్రేజ్‌ పాపర్టీస్‌ షేరు 1శాతం లాభపడింది. మధ్యాహ్నం గం.2:45ని.లకు ఇం‍డెక్స్‌ గత ముగింపుతో పోలిస్తే 3.10శాతం నష్టపోయి 233.40ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

 



You may be interested

బడ్జెట్‌ టైంలో ఎఫ్‌పీఐలు ఏం చేస్తున్నాయి?

Friday 25th January 2019

గత ఐదేళ్ల కాలంలో బడ్జెట్‌కు నెల రోజుల ముందు, తర్వాత ఎఫ్‌పీఐల ధోరణిని పరిశీలిస్తే బడ్జెట్‌కు ముందు తర్వాత కొనుగోళ్లకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ముందుగా ప్రీబడ్జెట్‌ నెలను పరిశీలిస్తే ఐదేళ్లలో మూడు సార్లు విదేశీ మదుపరులు నికర కొనుగోలుదారులుగా, రెండు దఫాలు నికర అమ్మకందారులుగా నిలిచారు. ఎఫ్‌పీఐలు 2016 బడ్జెట్‌కు నెల ముందు 11వేల కోట్ల రూపాయలు, 2017లో వెయ్యికోట్ల రూపాయల అమ్మకాలు జరిపారు. 2014, 2015, 2018లో

ఫలితాల షాక్‌...మారుతి 8 శాతం క్రాష్‌

Friday 25th January 2019

క్యు3 ఫలితాల ఎఫెక్ట్‌ శుక్రవారం ట్రేడింగ్‌లో మారుతీ సుజుకీ షేరు దాదాపు 8 శాతం మేర నష్టపోయింది. మధ్యాహ్న సమయం వరకు స్వల్పలాభంలో ఉన్న షేరు క్యు3 ఫలితాల ప్రకటనతో అమాంతం పడిపోయింది. 2.50 నిమిషాలకు షేరు రూ6450కి అటుఇటుగా ట్రేడవుతోంది. గురువారం క్లోజింగ్‌తో పోలిస్తే ఇది 8 శాతం తక్కువ. ఒకదశలో షేరు 52 వారాల కనిష్ఠస్థాయి రూ.6410కి పతనమైంది. తిరిగి కొంత కోలుకొని రూ. 6450 వద్దకు చేరింది.

Most from this category