STOCKS

News


రియల్టీ షేర్లు..పల్టీ

Monday 10th December 2018
Markets_main1544436462.png-22806

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం రియల్టీ రంగ షేర్లు బోర్లా పడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 3.30శాతానికి పైగా నష్టపోయింది. మధ్యాహ్నాం గం.3:15ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(230.45)తో పోలిస్తే 3శాతం నష్టంతో 223.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలోని మొత్తం 10 షేర్లు నష్టాల బాట పట్టాయి. అత్యధికంగా ఇండియాబుల్స్‌ రియల్టీ షేరు 6.50శాతం నష్టపోయింది. యూనిటెక్‌ 5శాతం, శోభ, ఒబేరాయ్‌ రియల్టి 4శాతం, డీఎల్‌ఎఫ్‌, గోద్రేజ్‌ప్రాపర్టీస్‌ 3శాతం, బ్రిగ్రేడ్‌ 2.50శాతం, ఫోనిక్స్‌ లిమిటెడ్‌ 2శాతం, ప్రేస్టేజ్‌, సన్‌టెక్‌ షేర్లు 1శాతం చొప్పున నష్టపోయాయి.



You may be interested

10500 పాయింట్ల దిగువన నిఫ్టీ

Monday 10th December 2018

సెన్సెక్స్‌ నష్టం@ 713పాయింట్లు అంతర్జాతీయ ప్రతికూలతలకుతోడు ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో సోమవారం మార్కెట్లో బేర్స్‌ స్వైర విహారం చేశారు. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 713.53 పాయింట్లు కోల్పోయి 34959.72 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 205 పాయింట్ల నష్టంతో 10488.50 వద్ద ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 469 పాయింట్ల నష్టంతో 35,204 వద్ద,

ఎగ్జిట్‌ పోల్స్‌పై మార్కెట్‌ ఏమంటోంది?

Monday 10th December 2018

ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రధాని నరేంద్ర మోదీ హవాపై సందేహాలను లెవనెత్తిన తరుణంలో ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు పోటాపోటీగా ఉన్నాయని ఆరు ఎగ్జిట్‌ పోల్స్‌ తెలిపాయి. మూడు ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీ ముందంజలో ఉందని పేర్కొంటే.. మిగిలిన ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపాయి. విజేతలు ఎవరనేది మంగళవారం తెలిపోతుంది.  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50

Most from this category