STOCKS

News


రియల్టీ షేర్ల నేలచూపులు

Monday 24th December 2018
Markets_main1545635882.png-23200

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం ట్రేడింగ్‌లో రియల్టీ రంగ షేర్లు నేలచూపులు చూస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 2.50శాతం నష్టపోయింది. ఈ రంగంలో ప్రధాన కంపెనీ షేర్లైన డీఎల్‌ఎఫ్‌ అత్యధికంగా 4.50శాతం నష్టపోయింది. అలాగే ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, శోభ లిమిటెడ్‌ షేర్లు 3శాతం పతనమవడంతో పాటు, ఫోనిక్స్‌ లిమిటెడ్, సన్‌టెక్‌, ఓబెరాయ్‌ లిమిటెడ్‌ షేర్లు 2శాతం క్షీణించాయి. మరోవైపు ఇదే రంగానికి చెందిన యూనిటెక్‌ షేర్లు 2.50శాతం లాభపడ్డాయి. బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ 1శాతం పెరిగింది. అలాగే ప్రెస్టేజ్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ షేర్లు ఆరశాతం ర్యాలీ చేశాయి. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ గతముగింపు (238.50)తో పోలిస్తే 2శాతం నష్టంతో 233.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


DLF

You may be interested

నెలలో 11% రాబడినిచ్చే స్టాక్స్‌!!

Monday 24th December 2018

స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు వచ్చే నెల రోజుల్లో 11 శాతం దాకా రాబడిని అందించే పది స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం..  అనలిస్ట్‌: 5నాన్స్‌.కామ్‌ ఫౌండర్‌, సీఈవో దినేశ్‌ రొహిరా గృహ్‌ ఫైనాన్స్‌: ఈ స్టాక్‌ గత కొన్ని సెషన్లుగా పాజిటివ్‌ ట్రెండ్‌లో ట్రేడ్‌ అవుతూ వస్తోంది. ఇటీవల రూ.298 వద్ద 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ను బ్రేక్‌ఔట్‌ చేసింది. ఈ షేరు గత రెండు నెలల కాలంలో రూ.340 నుంచి

మళ్లీ ఇన్ఫోసిస్‌ షేర్ల బైబ్యాక్‌?

Monday 24th December 2018

టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రెండోసారి షేర్ల బైబ్యాక్‌కు రెడీ అవుతోంది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేసేందుకు కంపెనీ బోర్డు 1.6 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.10,400 కోట్లు) విలువైన షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. అతిత్వరలో ఈ విషయంపై ఒక ప్రకటన వెలువడొచ్చు. కంపెనీ వ్యవస్థాపక సభ్యుల్లో కొందరు తాజా బైబ్యాక్‌లో వారి షేర్లను విక్రయించొచ్చు. కాగా ఇన్ఫోసిస్‌ గత షేర్ల బైబ్యాక్‌ మారటోరియం గడువు డిసెంబర్‌తో ముగుస్తుంది. కంపెనీ

Most from this category