STOCKS

News


కొనసాగుతున్న రియల్టీ షేర్ల పతనం

Monday 24th September 2018
Markets_main1537769029.png-20516

రియల్టీ షేర్ల పతనం వరుసగా రెండోరోజూ కొనసాగుతోంది. గత ట్రేడింగ్‌లో 3.50శాతం నష్టపోయిన నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ తాజాగా సోమవారం ట్రేడింగ్‌లో మరో 4.50శాతం వరకు నష్టపోయింది. ఉదయం గం.11:15ని.లకు రియల్టీ ఇండెక్స్‌ గతముగింపు(248.70)తో పోలిస్తే 4శాతం నష్టంతో 239.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లో భాగమైన మొత్తం 9షేర్లలో అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా డీఎల్‌ఎఫ్‌ షేరు 7శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. హెచ్‌డీఐఎల్‌, ఓబేరాయ్‌ రియల్టీ షేర్లు 6శాతం నష్టపోయాయి. వాటితో పాటు, ఫోనెక్స్‌ లిమిటెడ్‌, శోభా షేర్లు 4శాతం క్షీణించాయి. అలాగే బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, ప్రేస్టేజ్‌, షేర్లు 2శాతం పతనమవగా, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఇండియన్‌బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ లిమిటెడ్‌, యూనిటెక్‌ షేర్లు 1శాతం నుంచి అరశాతం వరకు పడిపోయాయి. నిఫ్టీ ఇండెక్స్‌ నెల రోజుల్లో 9శాతం పతనమవగా, ఏడాది కాలంలో 13.00శాతం క్షీణించింది.



You may be interested

మార్కెట్‌ చీకట్లో టీసీఎస్‌ వెలుగులు

Monday 24th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొట్టుమిట్టాడుతుంటే.. ఇండెక్స్‌లలో హెవీ వెయిట్‌ షేరు అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) మ్రాతం లాభాలతో దూసుకెళ్తోంది. ఈ స్టాక్‌ సోమవారం కొత్త జీవిత కాల గరిష్ట స్థాయిలను నమోదు చేసింది. ఇండెక్స్‌లలో అధిక వెయిటేజీ ఉన్న షేర్లలో కెల్లా గత 4 వారాల్లో ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిలకు చేరిన ఒకే ఒక స్టాక్‌ టీసీఎస్‌ మాత్రమే.  ఉదయం 11: 55 సమయంలో టీసీఎస్‌ షేరు

ఎన్‌బీఎఫ్‌సీలకు లిక్విడిటీ అందిస్తాం: జైట్లీ

Monday 24th September 2018

ముంబై: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), మ్యూచువల్‌ ఫండ్స్‌కు (ఎంఎఫ్‌లు), చిన్న మధ్యతరహా పరిశ్రమలకు (ఎస్‌ఎంఈలు) లిక్విడిటీ అందుబాటులో ఉంచేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ భరోసానిచ్చారు. సోమవారం ఉదయం ఆయన ఒక ట్వీట్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణాల చెల్లింపుల పరంగా విఫలమైనట్లు వెల్లడికావడంతో నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలకు లిక్విడిటీకి సంబంధించి ఆందోళనలు ఏర్పడటం వల్ల శుక్రవారం మార్కెట్లు ఒక్కసారిగా

Most from this category