STOCKS

News


ఒడిదుడుకుల మార్కెట్లో రియల్టీ షేర్ల ర్యాలీ

Friday 22nd March 2019
Markets_main1553246703.png-24754

ఒడిదుడుకుల మార్కెట్‌ ట్రేడింగ్‌లో రియల్టీ రంగ షేర్లు రాణిస్తున్నాయి. ఈ రంగానికి చెందిన ప్రెస్టేజ్‌ ఎస్టేజ్‌, ఓబేరాయ్‌ రియల్టీ, గోద్రేజ్‌ ప్రాపర్టీ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 2.50శాతం లాభపడింది.  నేడు నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 266 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు లాభస్వీకరణ పూనుకోవడంతో అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనైప్పటికీ, రియల్టీ రంగ షేర్లు మాత్రం స్థిరంగా రాణించాయి. ఒకానొక దశలో ఇండెక్స్‌ 2.50శాతం లాభపడి 271.60 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ప్రెస్టేజ్‌ ఎస్టేజ్‌ 11శాతం లాభపడంది. అలాగే గ్రోదేజ్‌ ఎస్టేజ్‌ 6శాతం పెరిగింది. ఓబేరాయ్‌ రియల్టీ 5శాతం, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ 1.50శాతం, శోభ అరశాత పెరిగాయి. అయితే మరోవైపు ఇండియన్‌బుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ 6శాతం, ఫోనిక్స్‌ లిమిటెడ్‌ షేరు 4శాతం, డీఎల్‌ఎఫ్‌, మహీంద్రాలైఫ్‌స్పేఫ్‌ డెవెలప్‌మెంట్‌ సైన్స్‌ షేరు 1శాతం క్షీణించాయి. మధ్యాహ్నం గం.2:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(రూ.265.30)తో పోలిస్తే ఒకశాతం లాభంతో రూ.267.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఆర్‌బీఐ నిర్ణయంతో మరో ఎన్‌పీఏల షాక్‌?

Friday 22nd March 2019

ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిస్టుల అంచనా బలహీనమైన కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు తిరిగి రుణాలిచ్చేందుకు అంగీకరిస్తూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆక్స్‌ఫర్డ్‌ ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు. ఈ నిర్ణయం సరైన ఆలోచనతో తీసుకున్నది కాదని వ్యతిరేకించారు. ఈ నిర్ణయంతో మరలా వ్యవస్థలో మొండి బకాయిలు పెరుగతాయని, ఈ దఫా వీటి పెరుగుదల అసమాన్యంగా ఉంటుందని హెచ్చరించారు. ఎకానమీలో లిక్విడిటీ పెంచేందుకని చెబుతూ ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ బలహీన పీఎస్‌బీలు రుణాలిచ్చేందుకు అనుమతినిచ్చారు.

ఆర్‌ఐఎల్‌ షేరు ఇంకా పెరుగుతుందా?

Friday 22nd March 2019

ఈ నెల్లో మార్కెట్‌ పరుగులను మించి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ర్యాలీ జరిపింది. సుమారు నెల రోజుల్లో దాదాపు 23 శాతం లాభపడింది. మార్చి20న షేరు బీఎస్‌ఈలో ఆల్‌టైమ్‌ హై 1386రూపాయలను తాకింది. ఈ రేంజ్‌లో షేరు దూసుకుపోవడంతో ఇకపై ఎలాంటి ప్రదర్శన జరుపుతుందో? ఈ స్థాయిల వద్ద కొనవచ్చా? అని అనేక సందేహాలు రిటైలర్స్‌ మదిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో షేరు లాభాల పరుగు కొనసాగుతుందని ఎక్కువమంది అనలిస్టులు,

Most from this category