STOCKS

News


పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.5 శాతం డౌన్‌

Tuesday 18th September 2018
Markets_main1537244258.png-20341

మూడు ప్రభుత్వ రంగ విలీన పథకాన్ని కేంద్రం వెల్లడించిన నేపథ్యంలో మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకింగ్‌ ఇండెక్స్‌ 1.5 శాతం పతనమయ్యింది. 12 షేర్లు కలిగిన ఈ ఇండెక్స్‌లో భాగమైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 10 శాతం పతమయ్యింది. ఈ షేరు ఇంట్రాడేలో 52 వారాల కనిష్టస్థాయి రూ. 166 స్థాయిని తాకింది. ఇండియన్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్‌ షేర్లు 3.5 శాతం మేర క్షీణించాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ షేర్లు 1.5 శాతం చొప్పున తగ్గాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ 1.2 శాతం క్షీణతతో రూ.281 వద్దకు పడిపోయింది. ఈ ఇండెక్స్‌లో భాగమైన అలహాబాద్‌ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, సిండికేట్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు మాత్రం ఉదయం 9.40 గంటల సమయంలో స్వల్ప లాభంతో ట్రేడవుతున్నాయి. 
 



You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 18th September 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా:- బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంక్‌లోని దేనా బ్యాంక్‌, విజయా బ్యాంక్‌లను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. మూడు బ్యాంకుల విలీనాన్ని 4-6 ఆరునెలల్లోగా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఓఎఫ్‌సీ టెక్నాలజీస్‌:- 10:6 నిష్పత్తిలో షేర్ల బోనస్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. ఎన్‌టీపీసీ:- టెల్చల్‌ థర్మల్‌ పవర్ ప్రాజెక్ట్‌లో రూ.9785.79 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం ఆమోదం

స్వల్ప లాభంతో ప్రారంభమైన మార్కెట్‌

Tuesday 18th September 2018

దేశీయ మార్కెట్‌ మంగళవారం స్వల్ప లాభంతో ప్రారంభమైంది. నిఫ్టీ గతముగింపు(11,378)తో పోలిస్తే 3 పాయింట్ల స్వల్పలాభంతో 11,381 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌ గతముగింపు(37585)తో పోలిస్తే 75 లాభంతో 37660 వద్ద ముగిసింది. చైనాతో వాణిజ్య యుద్ధ నేపథ్యంలో గతరాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగియడం, నేటి ఉదయం ఆసియా మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్‌ మన మార్కెట్‌పై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉదయం 9:30 సమయంలో నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 11,383 

Most from this category