STOCKS

News


పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2శాతం అప్‌

Tuesday 29th January 2019
Markets_main1548745319.png-23871

  • 6.50శాతం ర్యాలీ చేసిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

గత రెండు ట్రేడింగ్‌లో నష్టాల్లో ముగిసిన ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు లాభాల బాట పట్టింది. ఇంట్రాడేలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ కారణంగా  ఎన్‌ఎస్‌ఈలోని అన్ని రంగాల సూచీకెల్లా పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 2.50శాతం పెరిగింది. ఉదయం గం.12:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(2,903.55)తో పోలిస్తే 2శాతం లాభంతో 2,962.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 6.50శాతం పెరిగింది. కెనరా బ్యాంక్‌ 5శాతం, ఐడీఐబీ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 4.50శాతం లాభపడ్డాయి. యూనియన్‌ బ్యాంక్‌ 3.50శాతం, ఓరియంటల్‌ బ్యాంక్‌ 3శాతం, సిండికేట్‌ బ్యాంక్‌ 2.50శాతం ర్యాలీ చేశాయి. అలాగే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1.50శాతం పెరగ్గా, సెంట్రల్‌ బ్యాంక్‌ 1శాతం, జమ్మూ&కాశ్మీర్‌ బ్యాంక్‌ అరశాతం పెరిగాయి.



You may be interested

బడ్జెట్‌ స్ట్రాటజీ–నిఫ్టీ పుట్‌ రేషియో స్ప్రెడ్‌

Tuesday 29th January 2019

బడ్జెట్‌ సమయంలో ఇన్వెస్టర్లు వారి పోర్ట్‌ఫోలియోల్ని హెడ్జ్‌ చేసుకునేందుకు, మార్కెట్‌ క్షీణిస్తే ట్రేడర్లు లాభాలు సంపాదించేందుకు నిఫ్టీ పుట్‌ రేషియో స్ప్రెడ్‌ స్ట్రాటజీ అవలంబించవచ్చునని టెక్నికల్‌ అనలిస్టులు సూచిస్తున్నారు. బడ్జెట్లో ద్రవ్యలోటు పెరగవచ్చని, వివిధ కారణాలతో బాండ్‌ ఈల్డ్స్‌ ఎగియవచ్చన్న అంచనాలు వున్న నేపథ్యంలో ఈ వ్యూహం ఫలితాల్ని ఇవ్వవచ్చని వారు సూచిస్తున్నారు. బడ్జెట్‌ సమర్పించబోయే ఫిబ్రవరి 1న ఎటువంటి ప్రతికూల ప్రతిపాదనలున్నా  నిఫ్టీ 10,100 పాయింట్లలోపునకు తగ్గబోదన్న అంచనాలతో

1300 డాలర్ల పైనే పసిడి

Tuesday 29th January 2019

అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతల అండతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1300డాలర్ల పైన ట్రేడ్‌ అవుతోంది. ఆసియా మార్కెట్లో ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 0.05 స్వల్ప పెరుగుదలతో 1,303.15 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు కొనసాగించిన కేసులో చైనా దేశపు హువాయ్‌ టెక్నాలజీస్‌ సంస్థ సీఎఫ్‌ఓతో పాటు మరో ఇద్దరు అధికారులపై అమెరికా న్యాయ విభాగం చార్జ్‌షీట్‌ ధాఖలు చేసింది.

Most from this category