STOCKS

News


భారీ లాభాల్లో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు

Monday 29th October 2018
Markets_main1540799399.png-21561

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల భారీ ర్యాలీ కారణంగా మిడ్‌సెషన్‌ సమయానికి సూచీలు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతనిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 7.50శాతం లాభపడింది. మధ్యాహ్నం గం.1.00లకు ఇండెక్స్‌ గత ముగింపు(2572.85)తో పోలిస్తే 7శాతం లాభంతో 2,753.45ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో అత్యధికంగా ఓరియంటల్‌ బ్యాంక్‌ 12శాతం లాభపడింది. యూనియన్‌ బ్యాంక్‌ 10శాతం, కెనరా బ్యాంక్‌ 9శాతం, ఇండియన్‌ బ్యాంక్‌, 8శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు 7శాతం చొప్పున పెరిగాయి. అలాగే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సిండికేట్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ షేర్లు 6శాతం లాభపడ్డాయి. వాటితో పాలు విజయా బ్యాంక్‌ 5శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌ 3శాతం, ఐడీబీఐ బ్యాంక్‌ 1శాతం పెరిగాయి. ఇదే సమయానికి ఎస్‌బీఐ 7శాతం లాభంతో ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 గెయినర్లలో రెండోస్థానంలో ట్రేడ్‌ అవుతోంది.
ఇక మార్కెట్‌ విషయానికొస్తే... ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఫార్మా షేర్ల అండతో మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. మధ్యాహ్నం గం.1.00లకు సెన్సెక్స్‌ 475 పాయింట్ల లాభంతో 33,823 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 10,170.55 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.You may be interested

ఐటీసీపై పాజిటివ్‌ అంటున్న అనలిస్టులు

Monday 29th October 2018

సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం పలు బ్రోకింగ్‌ సంస్థల అనలిస్టులు ఐటీసీపై బుల్లిష్‌గా మారారు. ప్రస్తుత రిస్క్‌రివార్డు నిష్పత్తి ఆనుకూలంగా ఉందని, స్టాకు ఇతర ఎఫ్‌ఎంసీజీ స్టాకులతో పోలిస్తే భారీ డిస్కౌంట్‌తో లభిస్తోందని భావిస్తున్నారు.  వివిధ బ్రోకింగ్‌ సంస్థల అంచనాలు.. - సిటి: టార్గెట్‌ రూ. 340. స్థిరమైన ఫలితాలు ప్రకటించింది. సిగిరెట్‌ వాల్యూం గ్రోత్‌ ఆరోగ్యకరంగా ఉంది. భవిష్యత్‌ వృద్ధికి సిగిరెట్‌ వాల్యూంలు ప్రేరకంగా పనిచేస్తాయి. షేరు తన ఐదేళ్ల సరాసరి

కార్పోరేట్‌ లెండింగ్‌ బ్యాంకుల ర్యాలీ... రిటైల్‌ బ్యాంకు డీలా

Monday 29th October 2018

ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సంతరం రెండో త్రైమాసిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు ఉండటంతో సోమవారం కార్పోరేట్‌ లెండింగ్‌ బ్యాంకు షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. కార్పోరేట్‌ లెండింగ్‌ బ్యాంకులుగా పిలువబడే ఐసీఐసీఐ, యాక్సిస్‌, ఎస్‌బీఐ బ్యాంకుల షేర్లు 9 నుంచి 5శాతం లాభపడ్డాయి. ఈ మూడు షేర్లు ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 గెయిర్‌లో మొదటి మూడు స్థానాలను దక్కించుకున్నాయి. 

Most from this category