News


ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు జూమ్‌

Wednesday 19th December 2018
Markets_main1545200099.png-23076

ఆర్‌బీఐ బాండ్ల కొనుగోలు సిద్ధమైన నేపథ్యంలో బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు లాభాల బాటపట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2శాతం లాభపడింది. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యలోటును తీర్చేందుకు వచ్చే నెలలో బాం‍డ్ల బైబ్యాక్‌ కార్యక్రమం ద్వారా రూ.50వేల కోట్ల నిధులను అందుబాటులోకి తెస్తామని ఆర్‌బీఐ మంగళవారం​ప్రకటించింది. ఇప్పటికే ఈ డిసెంబర్‌లో ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోళ్ల ద్వారా రూ.40వేల కోట్ల అందిస్తున్న సంగతి తెలిసిందే. బాం‍డ్ల జారీతో వ్యవస్థలో లిక్విటిడీ పెరుగుతుందనే ఆశావహనంతో బుధవారం ట్రేడింగ్‌లో బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్‌ఎఫ్‌సీల, ఎంఎఫ్‌ఐ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2శాతానికి పైగా ర్యాలీ చేసి 3,085.70 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం 11:15 గంటలకు ఇండెక్స్‌ గత ముగింపు(3,019.80)తో పోలిస్తే 2శాతం లాభపడి 3,075.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో విజయా బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 4శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. ఎస్‌బీఐ. యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ షేర్లు 2నుంచి 1శాతం ర్యాలీ చేశాయి. అలాగే సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐడీబీఐ బ్యాంకు షేర్లు అరశాతం నష్టపోయాయి.

 



You may be interested

15 స్టాక్స్‌.. 40 శాతం రాబడికి ఛాన్స్‌!!

Wednesday 19th December 2018

స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు టెక్నికల్‌ చార్ట్స్‌ ఆధారంగా వచ్చే ఏడాది 40 శాతం దాకా రాబడిని అందించగల 15 స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం..  సీమెన్స్‌: ఈ స్టాక్‌ 2015లో జీవిత కాల గరిష్ట స్థాయి రూ.1,559ని తాకింది. అప్పటి నుంచి డౌన్‌ట్రెండ్‌లోనే ఉంటూ వస్తోంది. 2018 అక్టోబర్‌లో రూ.850 వద్ద బాటమ్‌ ఔట్‌ అయ్యినట్లు కనిపించింది. రూ.950- 900 స్థాయిల్లో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. టార్గెట్‌

ఫెడ్‌ నిర్ణయం కోసం పసిడి ఎదురుచూపులు

Wednesday 19th December 2018

ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల నిర్ణయం కొరకు ఎదురుచూస్తున్న పసిడి ధర బుధవారం 1250డాలర్ల పైన స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1.55 డాలర్లు ర్యాలీ చేసి 1,255.15 డాలర్లు వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేటి అర్థరాత్రి ఫెడ్‌ వడ్డీరేట్లను ప్రకటించనున్న సంగతి తెలిసిందే. కీలక వడ్డీరేట్ల పెంపునకు ఫెడ్‌ మొగ్గుచూపితే డాలర్‌ ఇండెక్స్‌ బలపడి పసిడి ధరకు ప్రతికూలాంశం మారుతుంది. పసిడి ధర ప్రస్తుతం

Most from this category