STOCKS

News


రెండోరోజూ అదే జోరు ..!

Tuesday 30th October 2018
Markets_main1540882823.png-21584

క్రితం రోజు మార్కెట్‌ భారీ లాభాలకు కారణమైన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లు రెండో రోజూ అదే జోరును కనబరుస్తున్నాయి. ఈ ప్రభుత్వ బ్యాంక్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌లో 5శాతం లాభపడింది. గత ట్రేడింగ్‌లో ఇండెక్స్‌ 8శాతం లాభపడిన సంగతి తెలిసిందే. ఉదయం గం.12:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(2,778.40)తో పోలిస్తే 4శాతం లాభంతో 2,892.35ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో అత్యధికంగా యూనియన్‌ బ్యాంక్‌ 12శాతం పెరిగింది. ఇండియన్‌ బ్యాంక్‌ 8శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంక్‌ 7శాతం, కెనరా బ్యాంక్‌ 6శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌ 5శాతం లాభపడ్డాయి. పంజాబ్‌నేషనల్‌బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 4శాతం, ఎస్‌బీఐ, విజయా బ్యాంక్‌ 3శాతం, ఐడీబీఐ బ్యాంక్‌ 1శాతం లాభపడ్డాయి. ఇదే సమయానికి 3శాతం లాభంతో ఎస్‌బీఐ షేరు నిఫ్టీ-50 సూచీలోని టాప్‌-5 గెయినర్లలో రెండోస్థానాన్ని దక్కించుకుంది.
ఇక మార్కెట్‌ విషయానికొస్తే.... నేటి ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం గం.12:00లకు నష్టాల్లోకి ట్రేడ్‌ అవుతున్నాయి. బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 87 పాయింట్ల నష్టంతో 34వేల దిగువన 33,980ల వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ 42 పాయింట్లను కోల్పోయి 10,210 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

సీఈఎస్‌ఈ 20శాతం క్రాష్‌

Tuesday 30th October 2018

ఆర్పీ సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌నకు చెందిన సీఈఎస్‌సీ లిమిటెడ్‌ షేరు మంగళవారం 26శాతం నష్టపోయింది. విద్యుత్‌యేతర బిజినెస్‌లను ప్రత్యేక కంపెనీలుగా విడదీయడం ఇందుకు కారణమైంది. నేడు సీఈఎస్‌సీ లిమిటెడ్‌ షేరు బీఎస్‌ఈలో రూ.670.15ల వద్ద ప్రారంభమైంది. గతేడాదిలో సీఈఎస్‌సీ యాజమాన్యం విద్యుతేతర వ్యాపారాలను న్యూ రిటైల్‌, వెంచర్‌ కంపెనీలు విడదీసేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా సీఈఎస్‌సీ వాటాదారులకు తమ దగ్గరున్న ప్రతీ 10 షేర్లకుగాను రూ. 5 ముఖ విలువగల

టాటా పవర్‌... ‘పవర్‌’

Tuesday 30th October 2018

ఎన్‌సీడీల ద్వారా రూ.5,500 కోట్ల సమీకరణ న్యూఢిల్లీ: టాటా పవర్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 85 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.213 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.393 కోట్లకు పెరిగిందని టాటా పవర్‌ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రూ.274 కోట్ల రెగ్యులేటరీ ఆదాయం కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. గత

Most from this category