STOCKS

News


పీఎస్‌యూ బ్యాంకింగ్‌ డౌన్‌

Thursday 17th January 2019
Markets_main1547710084.png-23637

క్రితం రోజు ర్యాలీ చేసిన పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ గురువారం నష్టాల బాట పట్టింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు ధరతో పోలిస్తే 1.50శాతం నష్టంతో 3,120.40ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లోని మొత్తం 12 షేర్లకు గానూ 10 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, ఇండియన్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం స్వల్ప లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని ప్రధాన సూచీలోకెల్లా అధికంగా నష్టపోయిన ఇండెక్స్‌ కావడం గమనార్హం. అత్యధికంగా ఎస్‌బీఐ షేరు 2శాతం నష్టపోయింది. యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 1.50శాతం క్షీణించాయి. ఐడీబీఐ బ్యాంక్‌, విజయా బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌ షేర్లు 1శాతం పతనమయ్యాయి. సిండికేట్‌ బ్యాంక్‌ అరశాతం వరకు నష్టపోయింది.
ఇక మార్కెట్‌ విషయాకొస్తే...
ఆరంభలాభాల్ని కోల్పోయి ప్రధాన సూచీలు మిడ్‌సెషన్‌ సమయానికి ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. నిఫ్టీ 4పాయింట్ల లాభంతో 10,894 వద్ద, సెన్సెక్స్‌ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 36,331 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఐటీ, అటో రంగ షేర్ల ర్యాలీ సూచీలకు అండగా నిలుస్తుండగా, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో అత్యధికంగా అమ్మకాలు జరుగుతున్నాయి.



You may be interested

నష్టాల్లో మెటల్‌ షేర్లు

Thursday 17th January 2019

ఒడిదుడుకుల మార్కెట్‌లో అత్యధిక శాతం మెటల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ అరశాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపుతో పోలిస్తే 0.45శాతం నష్టపోయి 2,952.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లోని మొత్తం 15 షేర్లలో 10 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా 5 షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా వెల్‌స్పన్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌

నెల రోజులకు సాంక్టమ్‌ సిఫార్సులు

Thursday 17th January 2019

వచ్చే నెల రోజుల్లో 5- 15 శాతం రాబడినిచ్చే ఐదు షేర్లను కొనొచ్చని సాంక్టమ్‌ వెల్త్‌ రికమండ్‌ చేస్తోంది. 1. దివీస్‌: టార్గెట్‌ రూ. 1700. స్టాప్‌లాస్‌ రూ. 1455. చార్టుల్లో హయ్యర్‌ టాప్స్‌, హయ్యర్‌ బాటమ్స్‌ ఏర్పరుస్తూ అప్‌ట్రెండ్‌ కొనసాగిస్తోంది. గత నవంబర్‌లో ఆల్‌టైమ్‌ హైని తాకి అనంతరం కన్సాలిడేషన్‌లోకి వెళ్లింది. చార్టుల్లో త్రిభుజాకార పాటర్న్‌ ఏర్పరిచి తాజాగా దాన్నుంచి బ్రేకవుట్‌ సాధించింది. వాల్యూంలు కూడా అప్‌ట్రెండ్‌కు అనుకూలంగా ఉన్నాయి. 2.

Most from this category