STOCKS

News


భారీగా నష్టపోయిన పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు

Monday 12th November 2018
Markets_main1542007903.png-21900

సూచీల పరిమిత శ్రేణి ట్రేడింగ్‌లో భాగంగా సోమవారం ప్రభుత్వరంగ షేర్ల భారీగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ అ‍త్యధికంగా 2శాతం నష్టపోయింది.  ముఖ్యంగా, ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్ల నష్టాల ట్రేడింగ్‌ సూచీల పతనానికి కారణమని చెప్పవచ్చు. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గతముగింపు (2,928.45)తో పోలిస్తే 1.50శాతం నష్టంతో 2,886.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన మొత్తం 12షేర్లకు గానూ అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఓరియంటల్‌ బ్యాంక్‌ అత్యధికంగా 8శాతం నష్టపోయింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌ షేర్లు 4శాతం క్షీణించాయి, ఇండియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌ 3శాతం పతనమయ్యాయి. సిండికేట్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 2శాతం నష్టపోయాయి. వాటితో పాటు సెంట్రల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐడీబీఐ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా, విజయా బ్యాంకు షేర్లు 1శాతం నష్టపోయాయి.
 

ఇక మార్కెట్‌ విషయానికొస్తే కీలకమైన రిటైల్‌ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. ఫలితంగా మధ్యాహ్నం 12:30ని.లకు సూచీలు పరిమిత శ్రేణిలో ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్‌ సూచీ 37.42 పాయింట్ల నష్టంతో 35121.13 వద్ద, నిఫ్టీ 1.25 పాయింట్‌ నష్టంతో 10,584 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, రూపాయి క్షీణతో ఐటీ షేర్లు బలపడుతున్నాయి.



You may be interested

మీకోసం.. టాప్‌-12 గ్రోత్‌ స్టాక్స్‌..

Monday 12th November 2018

యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈవో అరుణ్‌ తుఖ్రాల్‌ తాజాగా సమర్ధవంతమైన మేనేజ్‌మెంట్‌ను కలిగిన, వచ్చే ఏడాది కాలం లక్ష్యంతో ఇన్వెస్ట్‌మెంట్‌కు అనువైన టాప్‌-12 గ్రోత్‌-ఓరియెంటెడ్‌ స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం..  ► అశోక్‌ లేలాండ్‌: రెండో అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ కంపెనీ. వాణిజ్య వాహన విక్రయాలు పుంజుకోవడటం సానుకూల అంశం. కంపెనీ అన్ని విభాగాల డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకుంటోంది.  ► బజాజ్‌ ఫైనాన్స్‌: మంచి డైవర్సిఫైడ్‌ ఎన్‌బీఎఫ్‌సీలలో ఇది

ఇన్వెస్ట్‌మెంట్‌కు మంచి రోజేది?

Monday 12th November 2018

మనీ మార్కెట్లలో స్థిరత్వం వస్తోందని, సాధారణ స్థాయికి వస్తున్నాయని కోటక్‌ ఏఎంసీ ఎండీ నీలేశ్‌ షా తెలిపారు. మార్కెట్లలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొందని, లిక్విడ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు బాగా పెరగొచ్చని మార్కెట్‌ అంచనా వేస్తోందన్నారు. సెప్టెంబర్‌, ఆగస్ట్‌ నెలల కన్నా అక్టోబర్‌లో ఎక్కువ పెట్టుబడులు ఉండొచ్చని తెలిపారు. ఇందుకు ఇన్వెస్టర్ల

Most from this category