STOCKS

News


ఫార్మా షేర్ల పరుగులు

Monday 29th October 2018
Markets_main1540797526.png-21557

భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు ఇంట్రాడేలో ప్రభుత్వ రంగ, ఫార్మా షేర్ల అండతో అదే జోరును కనబరుస్తున్నాయి. సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, దివీస్‌ ల్యాబ్స్‌ షేర్ల ర్యాలీ అండతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 4శాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ ఇండెక్స్‌(6 శాతం) తరువాత అత్యధికంగా లాభపడినది నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ కావడమే విశేషం. నేడు నిఫ్టీ ఇండెక్స్‌ 9,172ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో దివీస్‌ల్యాబ్స్‌ 16శాతం లాభపడటం, ఇంట్రాడేలో ఫార్మా రంగ హెవీవెయిట్‌ షేర్లైన సన్‌ఫార్మా(4 శాతం), డాక్టర్‌ రెడ్డీస్‌(5 శాతం), సిప్లా(4 శాతం) ర్యాలీ చేయడంతో ఇండెక్స్‌ ఇంట్రాడేలో 4.50శాతం పెరిగి 9,518.25 వద్ద స్థాయికి చేరింది. మధ్యాహ్నం గం.12:00లకు సూచీ గత ముగింపు (9115.10)తో పోలిస్తే 4శాతం నష్టంతో 9,506.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో అత్యధికంగా దివీస్‌ ల్యాబ్స్‌ 14.50శాతం లాభపడింది. డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో ఫార్మా షేర్లు 5శాతం పెరిగాయి. లుపిన్‌, సిప్లా, సన్‌ఫార్మా షేర్లు 4నుంచి 3శాతం లాభపడ్డాయి. అలాగే కేడిల్లా హెల్త్‌కేర్‌, బయోకాన్‌ షేర్లు 2నుంచి 1శాతం పెరగ్గా, గ్లెన్‌మార్క్‌ షేరు అరశాతం లాభపడింది. అయితే ఇదే సూచీలో పిరమిల్‌ఎంటర్‌ప్రైజెస్‌లిమిటెడ్‌ షేర్లు అరశాతం నష్టపోయింది. ఇదే సమయానికి డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు 5శాతం లాభంతో నిఫ్టీ-50 సూచీలో చోటు దక్కించుకుంది.



You may be interested

10250 దాటితేనే!

Monday 29th October 2018

దేశీయ మార్కెట్లో ప్రస్తుతానికి పెరిగినప్పుడు అమ్ము సూత్రమే వర్తిస్తుందని నార్నోలియా బ్రోకింగ్‌ సంస్థ అభిప్రాయపడింది. గతవారం నిఫ్టీ రెండు శాతం మేర నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండడంతో దేశీయ సూచీలు సైతం డీలా పడ్డాయి. దీంతో నిఫ్టీ 10100 పాయింట్ల దిగువకు వచ్చింది. ప్రస్తుతం 10150 పాయింట్ల వద్ద నిరోధం ఉందని, దీన్ని దాటితే నెమ్మదిగా 10250 పాయింట్ల వరకు పుల్‌బ్యాక్‌ ఉండొచ్చని నార్నోలియా తెలిపింది. 10250 పాయింట్లపైన

రూపాయి పతనానికి విరుగుడు ఏమిటి

Monday 29th October 2018

- మన మార్కెట్లలో భారీగా నష్టాలు - అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే లాభాలు - ఈ ఏడాది ఇప్పటికి 21 శాతం రాబడి - అమెరికా కంపెనీల మెరుగైన పనితీరు - డాలర్‌ బలోపేతం ఈ రెండు రకాలుగా లాభమే - పోర్ట్‌ఫోలియో రిస్క్‌ తగ్గించుకునేందుకు విదేశీ ఫండ్స్‌ - ఎగుమతి ఆధారిత కంపెనీలు, గోల్డ్‌ ఈటీఎఫ్‌లూ చూడొచ్చు (సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం) రూపాయి పతనం ఇన్వెస్టర్లను నష్టాల పాలు చేస్తోంది. ఇప్పటికే స్టాక్‌ మార్కెట్లు భారీగా నష్టపోయాయి.

Most from this category