STOCKS

News


ఫార్మా షేర్లకు జర్వం

Wednesday 14th August 2019
Markets_main1565763902.png-27759

  • 7శాతం క్షీణించిన సన్‌ ఫార్మా
  • 7ఏడేళ్ల కనిష్టానికి గ్లెన్‌మార్క్‌

మార్కెట్‌ లాభంతో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., ఫార్మా రంగ షేర్లు బుధవారం భారీ నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ నేడు 3శాతం పతనమైంది. ఈ రంగంలో అదిక వెయిటేజీ కలిగిన డాక్టర్‌ రెడ్డీస్‌, గ్లెన్‌మార్క్‌, సన్‌ ఫార్మా షేర్ల క్షీణత ఇండెక్స్‌ భారీ పతనానికి కారణమైంది. ఈ క్యూ1లో ఫార్మా కంపెనీల ఫలితాలు మార్కెట్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఫార్మా షేర్లు అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఫార్మా రంగంలోని ప్రధాన కంపెనీ సన్‌ఫార్మా కూ1 ఫలితాలు అంతంగా మాత్రంగా నమోదుకావడంతో పలు బ్రోకరేజ్‌ సంస్థలు ఈ కంపెనీ షేర్లపై ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగించినప్పటికీ.., షేర్లపై టార్గెట్‌ ధరను తగ్గించాయి. ఫలితంగా సన్‌ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనై ఇంట్రాడేలో 6శాతం నష్టపోవడంతో పాటు నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌-5 లూజర్లలో మొదటిస్థానంలో కొనసాగుతుంది. గర్భనిరోధక ఔషధమైన నువారింగ్ జనరిక్‌ వెర్షన్ కోసం యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి కంప్లీట్‌ రెస్పాండ్‌ లెటర్‌(సీఆర్ఎల్) అందుకున్నట్లు తెలిపడంతో డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు సైతం నేటి ఇంట్రాడేలో 8శాతం పతనయ్యాయి. అలాగే క్యూ1 ఫలితాలు ఫలితాలను అందుకోవడంతో విఫలం కావడంతో గ్లెన్‌మార్క్‌ 7.50శాతం నష్టపోయి ఏడేళ్ల కనిష్టానికి పతమనమైంది. వీటితో పాటు లుపిన్‌ 2.50శాతం, కేడిల్లా హెల్త్‌కేర్‌, అరబిందో ఫార్మా షేర్లు 2శాతం నష్టపోయాయి. అలాగే దివీస్‌ ల్యాబ్స్‌ అరశాతం క్షీణించాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో బయోకాన్‌ 2.50శాతం, పిరమిల్‌ఎంటర్‌ప్రైజెస్‌, సిప్లా షేర్లు 2శాతం నుంచి అరశాతం లాభపడ్డాయి. గత రెండు నెలల్లో ఫార్మా ఇండెక్స్‌ ఒకరోజులో ఇంతస్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. 



You may be interested

బ్యాంకింగ్‌ రంగానికే రిస్కు!

Wednesday 14th August 2019

ఆర్‌బీఐ ప్రతిపాదనలపై ఫిచ్‌ హెచ్చరిక బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీలకు, రిటైల్‌ రుణగ్రహీతలకు మరిన్ని రుణాలు ఇచ్చేలా ఆర్‌బీఐ ఇటీవల చేపడుతున్న ప్రోత్సాహక చర్యలు అంతిమంగా బ్యాంకింగ్‌ రంగానికి రిస్కులను పెంచుతాయని అంతర్జాతీయ రేటింగ్‌ఏజన్సీ ఫిచ్‌ రేటింగ్స్‌ హెచ్చరించింది. మందగమన నేపథ్యంలో నగదు ప్రవాహాన్ని పెంచేందుకు ఆర్‌బీఐ ఈ తరహా చర్యలను రూపొందిస్తోంది. కానీ ఇలా అధికంగా రుణాలు మంజూరు చేయడం చివరకు బ్యాంకులకు ముప్పుపగా పరిణమిస్తుందని, బ్యాంకులు అధిక క్రెడిట్‌ రిస్కును అంగీకరించాల్సివస్తుందని

బ్యాంకింగ్‌ షేర్లు జంప్‌

Wednesday 14th August 2019

యుఎస్‌, చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై విధించాలనుకున్న 10 శాతం సుంకాన్ని వాయిదా వేయడంతో బుధవారం అంతర్జాతీయ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. ఫలితంగా దేశియ మార్కెట్లు కూడా సానుకూలంగా కదులుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం 11.20 సమయానికి 325.60 పాయింట్లు లాభపడి 28001.75 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.27 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.82 శాతం లాభపడ్డాయి. మిగిలిన

Most from this category