STOCKS

News


ఫార్మా షేర్లలో అమ్మకాలు

Tuesday 23rd October 2018
Markets_main1540282060.png-21404

ఫార్మా ఐటీ షేర్ల పతనంతో మార్కెట్‌ మిడ్‌ సెషన్‌ సెషన్‌ సమయానికి అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. అత్యధికంగా ఫార్మా షేర్లు నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఫార్మా ఇండెక్స్‌ నేటి ఇంట్రాడేలో 3శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:30లకు ఇండెక్స్‌ గత ముగింపు(9,646.65)తో పోలిస్తే 2.50శాతం నష్టపోయి 9,392.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన మొత్తం 10 షేర్లలో 8షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 2షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అ‍త్యధికంగా బయోకాన్‌ 6శాతం నష్టపోయింది. సన్‌ఫార్మా, అరబిందో ఫార్మా, లుపిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు 4నుంచి 2శాతం నష్టపోయాయి. అలాగే దివీస్‌ ల్యాబ్స్‌, సిప్లా, కేడిల్లా హెల్త్‌కేర్‌ షేర్లు 1శాతం క్షీణించాయి. మరోవైపు గ్లెన్‌మార్క్‌, పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ షేర్లు 1శాతం లాభపడ్డాయి. సన్‌ఫార్మా (4శాతం నష్టం) నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 లూజర్లలో చోటు దక్కించుకుంది.

ఇక మార్కెట్లో మిడ్‌సెషన్‌లోనూ నష్టాల్లో కొనసాగుతోంది. అత్యధికంగా ఫార్మా, ఐటీ షేర్లలలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా మధ్యాహ్నం గం.1:30లకు బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 262 పాయింట్ల నష్టపోయి 34వేల దిగువన 33,872 వద్ద, నిఫ్టీ 100 పాయింట్ల క్షీణించి 10,143 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

10,110 దిగువకు నిఫ్టీ

Tuesday 23rd October 2018

ఎన్‌ఎస్‌ఈ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ నిఫ్టీ-50.. 11,110 పాయింట్ల దిగువకు పతనమైంది. ఇది 7 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. మంగళవారం మధ్యాహాం 1:55 సమయంలో నిఫ్టీ 140 పాయింట్ల నష్టంతో 10,105 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 381 పాయింట్ల నష్టంతో 33,753 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ మార్చి తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. కాగా నిఫ్టీ అక్టోబర్‌ 11న 10,138 పాయింట్లకు క్షీణించింది. తాజాగా

ఆర్‌బీఎల్‌పై సిఫార్సు... మాటమార్చిన మోర్గాన్‌ స్టాన్లీ

Tuesday 23rd October 2018

ఆర్‌బీఐఎల్‌ బ్యాంక్‌కు మోర్గాన్‌ స్టాన్లీ గట్టి షాకిచ్చింది. అధిక వ్యాల్యుయేషన్స్‌ నేపథ్యంలో స్టాక్‌ రేటింగ్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేరు సోమవారం ఏడు శాతంమేర పతనమైంది. షేరు ఒక్కరోజులో ఈమేర పతనం కావడం ఇదే తొలిసారి. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తన లిస్టింగ్‌ (2016, ఆగస్ట్‌ 31) దగ్గరి నుంచి చూస్తే దాదాపు 80 శాతంమేర ఎగసింది. ఇదే సమయంలో బీఎస్‌ఈ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ 23 శాతంమేర పెరిగింది.

Most from this category