STOCKS

News


18 ఏళ్ల గరిష్ఠానికి నిఫ్టీ పీఈ.. తస్మాత్‌ జాగ్రత్త!

Thursday 9th August 2018
Markets_main1533796306.png-19094

కన్సాలిడేషనా? కరెక‌్షన్‌?
సంశయంలో ఇన్వెస్టర్లు
ఆచితూచి వ్యవహరించాలని నిపుణుల సూచన
దేశీయ సూచీల రికార్డు ర్యాలీ కొనసాగుతూనే ఉంది. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ తొలిసారి 38 వేల పాయింట్లను తాకింది. 37వేల నుంచి 38 వేల పాయింట్ల ప్రయాణాన్ని సెన్సెక్స్‌ కేవలం 11 సెషన్లలో పూర్తి చేసింది. ఈ గమనంలో ఐసీఐసీఐ బ్యాంకు 11 శాతం, యాక్సిస్‌బ్యాంకు 10 శాతం, ఆర్‌ఐఎల్‌ 10 శాతం, టాటా స్టీల్‌ 8 శాతం, ఎస్‌బీఐ షేర్లు ర్యాలీ జరపగా హెచ్‌డీఎఫ్‌సీ కవలలు, అదానీ పోర్ట్స్‌, మారుతీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు 1- 7 శాతం వరకు చప్పబడ్డాయి. ప్రస్తుతానికి దేశీయ సూచీల్లో దీర్ఘకాలిక బుల్‌నెస్‌ కనిపిస్తోందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో కీలక రిస్కు అంశాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. నిఫ్టీ గురువారం 11500 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఈ స్థాయిల వద్ద నిఫ్టీ వాల్యూషన్లు 18 ఏళ్ల గరిష్ఠానికి చేరినట్లయింది. దీంతో సూచీల్లో కరెక‌్షన్‌ అవకాశాలపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం నిఫ్టీ ట్రయిలింగ్‌ పీఈ మల్టిపుల్‌ 28.2 వద్ద ఉంది. 2000 ఫిబ్రవరిలో నిఫ్టీ పీఈ ఈ స్థాయిల వద్దకు చేరింది. ఆ తర్వాత సంవత్సరంలో నిఫ్టీ దాదాపు 50 శాతం మేర భారీ పతనం చవిచూసింది. అనంతరం 2008లో నిఫ్టీ పీఈ మరోమారు 28 స్థాయిలకు చేరింది. ఆ తర్వాత 9 నెలల్లో సూచీలో 44 శాతం పతనం వచ్చింది. ప్రస్తుతం నిఫ్టీ నెక్ట్స్‌ 50 సైతం అధిక పీఈ వద్దనే ట్రేడవుతోంది.

అయితే స్మాల్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు మాత్రం ఇంకా తమ ఆల్‌టైమ్‌ హై స్థాయిల కన్నా తక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సూచీల వెంట పడకుండా ఎంపిక చేసుకున్న స్టాకులపై దృష్టి పెట్టాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. 
ఎర్నింగ్స్‌ ఆదుకుంటాయా? 
సూచీలు రికార్డు స్థాయిలకు చేరి, వాటి వాల్యూషన్లు సైతం ఎక్కువయిన తరుణంలో కేవలం ఎర్నింగ్స్‌ మాత్రమే పతనాన్ని ఆదుకోగలవని నిపుణుల అంచనా. జూన్‌ త్రైమాసికానికి కంపెనీల ఫలితాలు బాగానే ఉన్నాయని అందువల్ల సూచీలకు ప్రమాదం ఉండకపోవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సూచీలు పెరిగినా ఎర్నింగ్స్‌ కారణంగా ఈ ఏడాది స్థిరమైన వృద్ది కనిపిస్తుందని చెబుతున్నారు. కేవలం ఎర్నింగ్స్‌ మాత్రమే ధరలను శాసిస్తాయని చెప్పారు. ఈ త్రైమాసికంలో ఫలితాలు ప్రకటించిన కంపెనీల సరాసరి లాభాల వృద్ధి 6.5 శాతం, రెవెన్యూ వృద్ధి 17.5 శాతం ఉంది. ఇక మీదట లార్జ్‌క్యాప్స్‌ నుంచి ఇన్వెస్టర్ల దృష్టి చిన్న స్టాకులవైపుకు మరులుతుందని బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. సూచీల పీఈ అడ్జస్ట్‌ అయ్యే క్రమంలో కొంత కన్సాలిడేషన్‌ ఉండొచ్చు కానీ భారీ పతనాలకు పెద్దగా అవకాశాలు లేవని అభిప్రాయపడ్డాయి. 
కొన్ని రికమండేషన్లు..
- హెచ్‌యూఎల్‌పై షేర్‌ఖాన్‌ పాజిటివ్‌. టార్గెట్‌ వృద్ధి 13 శాతం.
- మాక్స్‌ ఫిన్‌ సర్వ్‌పై ఎస్‌బీఐ క్యాప్‌ పాజిటివ్‌. టార్గెట్‌ రూ. 640.
- ఎంఅండ్‌ఎంపై ఎస్‌బీఐ క్యాప్‌ పాజిటివ్‌. టార్గెట్‌ రూ. 1050.
- సిప్లాపై సీఎల్‌ఎస్‌ఏ బుల్లిష్‌. టార్గెట్‌ రూ. 760. 
- సిప్లాపై మోర్గాన్‌స్టాన్లీ ఓవర్‌వెయిట్‌. టార్గెట్‌ రూ. 716. 
- ఎంఅండ్‌ఎం, టీవీఎస్‌ మోటర్స్‌ కొనొచ్చు అంటున్న జెఫర్రీస్‌.
- బ్రిటానియా, బీఓబీపై గోల్డ్‌మన్‌ సాచే బుల్లిష్‌. You may be interested

పీఎస్‌యూ బ్యాంకుల జోరు

Thursday 9th August 2018

కొన్ని బ్యాంకింగ్‌  షేర్లు గురువారం భారీ ర్యాలీని చేశాయి. బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ కారణంగానే ఉదయం ట్రేడింగ్‌లో ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు తన జీవతకాల గరిష్టాలను అందుకోగలిగాయి. ఎన్‌ఎస్‌ఈలో అన్ని సూచీల్లోకెల్లా నిఫ్టీ బ్యాంకు నిప్టీ ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌యూ), నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంకు సూచీలు అత్యధికంగా లాభపడ్డాయి. 6నెలల గరిష్టాన్ని తాకిన పీఎస్‌యూ బ్యాంక్‌ నిఫ్టీ :- ఎన్‌ఎస్‌ఈలో అన్ని సూచీల్లోకెల్లా అత్యధికంగా లాభపపడింది. నేడు 3,326.40 ట్రేడింగ్‌ను ప్రారంభించింది.

చత్తీస్‌ఘడ్‌కు పల్సస్‌ విస్తరణ

Thursday 9th August 2018

 హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన హెల్త్‌ ఇన్ఫర్మేటిక్స్‌ కంపెనీ పల్సస్‌ తాజాగా చత్తీస్‌ఘడ్‌కు విస్తరించింది. చత్తీస్‌ఘడ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ రమణ్‌సింగ్‌తో పల్సస్‌ సీఈఓ డాక్టర్‌ గేదెల శ్రీనుబాబు భేటి అయిన సందర్భంగా ఈ విషయమై ఇరువురి మధ్యా ఒక అంగీకారం కుదిరినట్లు పల్సస్‌ తెలియజేసింది. వచ్చే ఏడాది కాలంలో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్... పల్సస్, ఒమిక్స్‌ సారథ్యంలో దంతేవాడ, రాజ్‌నందగావ్, రాయ్‌పూర్‌లో రానున్న సెజ్‌లలోని 3 కేంద్రాల్లో 2 వేల మందికి

Most from this category