STOCKS

News


ఫ్లాట్‌గా ప్రారంభమైన నిఫ్టీ

Friday 14th June 2019
Markets_main1560484939.png-26278

ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 56 పాయింట్ల లాభంతో 39,797.00 వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,910.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లపై కోత అంచనాలతో పాటు, ఇంధన షేర్ల ర్యాలీ కారణంగా నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఇక నేడు ఆసియాలో ఒక్క జపాన్‌ తప్ప మిగిలిన ప్రధాన మార్కెట్లన్నీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు పెరగడటం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలహీనంగా ప్రారంభం కావడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 26 పాయింట్ల స్వల్ప నష్టంతో 39,715.34 వద్ద, నిఫ్టీ 10.35 పాయింట్లను కోల్పోయి 11,904ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఫార్మా, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఆర్థిక రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. 
బీపీసీఎల్‌, టాటామోటర్స్‌, జీ లిమిటెడ్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, ఇండియన్‌బుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం నష్టపోగా, ఓఎన్‌జీసీ, వేదాంత, యూపీఎల్‌, గెయిల్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు అరశాతం నుంచి 1.50శాతం లాభపడ్డాయి.



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 14th June 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా శుక్రవారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు వోక్ హార్డ్‌:- మ‌హారాష్ట్ర యూనిట్‌కు యూఎస్ఎఫ్‌డీఏ జీరో అబ్జర్వేష‌న్ సర్టిఫికేట్‌ను జారీ చేసినట్లు ఎక్చ్సేంజీల‌కు స‌మాచారం ఇచ్చింది.  ఈ జూన్ 10-12 తేదిలో యూఎస్ఎఫ్‌డీఏ త‌నిఖీలు నిర్వహించిన‌ట్లు తెలిపింది.  రిల‌య‌న్స్ హోమ్ ఫైనాన్స్:- పీడ‌బ్ల్యూసీ పరిశీలనలు పూర్తిగా నిరాధారమైనవి, అన్యాయమైనవి. ఆడిట్ క‌మిటితో ముందుగా ఎలాంటి చ‌ట్టబ‌ద్ధమైన చ‌ర్చలు జ‌ర‌ప‌లేద‌ని రిల‌య‌న్స్ హోమ్స్  అధికార ప్రతినిధులు వివ‌ర‌ణ‌నిచ్చారు.  నాగార్జున ఫెర్టిలైజ‌ర్స్ అండ్ కెమిక‌ల్స్:- కంపెనీ

ఫండ్స్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియోలో ఏముంది..?

Thursday 13th June 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవలు ఉచితం కాదు. ఇన్వెస్టర్ల తరఫున పెట్టుబడుల వ్యవహారాలను చూస్తున్నందుకు గాను అవి ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ ఫీజు, ఏజెంట్‌ కమీషన్లు, రిజిస్ట్రార్‌ ఫీజులు, సెల్లింగ్‌ చార్జీలు, ప్రచార చార్జీలు, ఇలా సమస్త చార్జీలు అన్నింటినీ కూడా ఇన్వెస్టర్ల నుంచే వసూలు చేసుకుంటుంటాయి. ఇవన్నీ కలసి ఎక్స్‌పెన్స్‌ రేషియోగా ఆయా పథకాల సమాచారంలో కనిపిస్తుంది. వార్షికంగా ఇంత శాతం చొప్పున పెట్టుబడుల విలువపై ఎక్స్‌పెన్స్‌ రేషియోను చార్జ్‌ చేస్తుంటాయి.

Most from this category