STOCKS

News


11900 దిగువన ప్రారంభమైన నిఫ్టీ

Thursday 13th June 2019
Markets_main1560399755.png-26259

క్రితం నష్టాల ముగింపునకు కొనసాగింపుగా మార్కెట్‌  గురువారం కూడా నష్టాలతోనే మొదలైంది. నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 11900 స్థాయి దిగువన 11,874ల వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 77 పాయింట్లను కోల్పోయి 39,679 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలు, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి ఫ్లాట్‌ ప్రారంభం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల తరలింపు తదితర అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల ముగింపుతో నేడు కూడా ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇక ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ కిత్రం ముగింపు(69.34) 1 పైసా లాభంతో 69.35 స్థాయి వద్ద ప్రారంభమైంది. ఉదయం గం.9:40ని.లకు సెన్సెక్స్‌ 131 పాయింట్ల నష్టంతో 39,625 వద్ద, నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 11,865 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా మెటల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. 
టాటాస్టీల్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, వేదాంత, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 9శాతం నష్టపోగా, యాక్సిస్‌బ్యాంక్‌, ఏషియన్‌ పేయింట్స్‌, ఎల్‌ అండ్‌ టీ, బీపీసీఎల్‌ షేర్లు అరశాతం నుంచి 1.50శాతం లాభపడ్డాయి. 



You may be interested

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 13th June 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితయ్యే షేర్ల వివరాలు  టాటా మోటర్స్‌:- అంతర్జాతీయంగా మేనెలలో అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గతేడాది మేలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే 23 శాతం 82,374 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే నెలలో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు 39,895 యూనిట్లుగా ఉన్నాయి. సెయిల్‌:- నష్టాల్లో ఉన్న యూనిట్లను విక్రయించే యోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి.  హెచ్‌సీసీ:- జూన్‌ 17న జరిగే బోర్డు సమావేశంలో నిధుల సమీకరణ ప్రతిపాదనుకు షేర్లు హోల్డర్లు ఆమోదం

మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌పై చిగురించిన ఆశలు

Thursday 13th June 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు మే నెలలో క్రితం నెలతో పోలిస్తే రూ.16,000 కోట్లు పెరిగి రూ.25.43 లక్షల కోట్లకు చేరాయి. లిక్విడ్‌ ఫండ్స్‌లోకి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్‌లోకీ రూ.5,407 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. ఏప్రిల్‌ నెలలో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన రూ.4,609 కోట్లతో పోలిస్తే పెరిగాయి. ప్రధానంగా ఈక్విటీ ఫండ్స్‌లోకి మే నెలలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో సగం మేర

Most from this category