STOCKS

News


11450 పైన ప్రారంభమైన నిఫ్టీ

Thursday 28th March 2019
Markets_main1553746231.png-24834

ప్రపంచమార్కెట్లలలో బలహీన సంకేతాలున్నప్పటికీ, దేశీయ ఈక్విటీ మార్కెట్‌ గురువారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ సూచీ 75 పాయింట్ల లాభంతో  38,208 వద్ద, నిఫ్టీ సూచీ 18 పాయింట్లు పెరిగి 11,463 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అధిక వెయిటేజీ షేర్ల కలిగిన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, రియలన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ షేర్ల ర్యాలీ సూచీల లాభాల ప్రారంభానికి తోడ్పడ్డాయి. అన్ని రంగాలకు చెందిన రంగ షేర్లలో కొనుగోళ్లు ఆశించినస్థాయిలో జరుగుతున్నాయి. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనతతో ఐటీ షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. మరోవైపు అటో షేర్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. నేడు మార్చి డెరివేటివ్‌ సిరీస్‌ ముగియనుండటంతో  సూచీలు ఒడిదుడకులకులోనయ్యే అవకాశం ఉంది. అలాగే ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి సైతం నష్టంతో ప్రారంభమైంది. గత ముగింపు(68.87)తో పోలిస్తే 24 పైసలు క్షీణించి 69.11 వద్ద ప్రారంభమైంది. ఉదయం గం.9:25ని.లకు సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభపడి 38158 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 11475ల వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. 
ఇక ప్రపంచమార్కెట్ల విషయానికొస్తే ...  అమెరికా ఆర్థిక మాంద్య అంశం మరోసారి అంతర్జాతీయ మార్కెట్లకు ప్రతికూలంగా మారింది. నిన్న అమెరికా, యూరప్‌ మార్కెట్లు నష్టాలతో ముగియగా, నేడు ఆసియా ప్రధాన మార్కెట్లన్నీ నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా జపాన్‌ మార్కెట్‌ నికాయ్‌225 1.50శాతం నష్టపోయింది. 

జీలిమిటెడ్‌, టెక్‌ మహీంద్రా, అదానీపోర్ట్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌టెక్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం లాభపడగా, కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, భారతీఎయిర్‌టెల్‌, డాక్టర్‌రెడ్డీస్‌, ఓఎన్‌జీసీ షేర్లు అరశాతం నుంచి 2శాతం నష్టపోయాయి. 



You may be interested

బొనాంజ పోర్టుఫోలియో సిఫార్సులు

Thursday 28th March 2019

షార్ట్‌టర్మ్‌లో 6-8 శాతం రాబడినిచ్చే మూడు స్టాకులను బొనాంజ పోర్టుఫోలియో రికమండ్‌ చేస్తోంది. 1. గృహ్‌ ఫైనాన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 290. స్టాప్‌లాస్‌ రూ. 256. 2. ఐజీఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 324. స్టాప్‌లాస్‌ రూ. 296. 3. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 722. స్టాప్‌లాస్‌ రూ. 644. గురువారం డెరివేటివ్స్‌ ముగింపు రోజున సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 11500 పాయింట్ల వద్ద కదలాడుతోంది. 

సహేతుక ధరల్లో లభిస్తున్న షేర్లు

Wednesday 27th March 2019

ప్రపంచ ప్రసిద్ధ స్టాక్‌ ఇన్వెస్టర్‌ పీటర్‌ లించ్‌ ‘గ్రోత్‌ ఎట్‌ రీజనబుల్‌ ప్రైస్‌’ (జీఏఆర్‌పీ) విధానం లాభాలను కురిపిస్తుందని నిరూపితమైనది. ఆదాయాల్లో స్థిరమైన వృద్ధిని నమోదు చూస్తూ, సహేతుక ధరల వద్ద ట్రేడ్‌ అవుతున్న స్టాక్స్‌ను గుర్తించడమే జీఏఆర్‌పీ. కేవలం 5,000 కిలోమీటర్లే తిరిగిన మారుతి కారును సెకండ్‌ హ్యాండ్‌లో తక్కువ ధరకు సొంతం చేసుకోవడం వంటిది. ఈ విధానంలో కొన్ని స్టాక్స్‌ను వ్యాల్యూ రీసెచ్చ్‌ సంస్థ గుర్తించింది.   కెన్‌ఫిన్‌ హోమ్స్‌ కెనరా

Most from this category