STOCKS

News


11000పైన నిఫ్టీ ప్రారంభం

Wednesday 6th March 2019
Markets_main1551845380.png-24445

  • కలిసొచ్చిన క్రూడాయిల్‌ పతనం

అంతర్జాతీయ మార్కెట్లలలో బలహీన పరిస్థితులు నెలకొన్పప్పటికీ, దేశీయ మార్కెట్‌ బుధవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 100 పాయింట్లు లాభంతో 36,544 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 11000 పైన 11,025 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. సూచీలకు ఇది వరుసగా మూడో రోజూ లాభాల ప్రారంభం కావడం విశేషం. అమెరికాలో క్రూడాయిల్‌ ఉత్పత్తితో పాటు నిల్వలు కూడా అధికమైనట్లు గణాంకాలు వెలువడటంతో ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరలు అరశాతానికి పైగా పతనమయ్యాయి. దేశీయ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుండటం కూడా ఇన్వెస్టర్లను కొనుగోళ్ల వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. ఉదయం గం.9:25ని.లకు సెన్సెక్స్‌ గత ముగింపు(36,442.54)తో పోలిస్తే 167 పాయింట్లు పెరిగి 36,610 వద్ద, నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 11,046 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఎఫ్‌ఎంజీసీ, మెటల్‌, ఫైనాన్స్‌ షేర్లకు ఎక్కువగా కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. డాలర్‌ స్థిరమైన ర్యాలీ కారణంగా ఇక కిత్రం ట్రేడింగ్‌లో భారీగా బలపడిన రూపాయి విలువ నేడు నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 16పైసల వరకు క్షీణించింది. అమెరికా - చైనాల మధ్య జరిగే తుది ఒప్పందం కోసం ఇన్వెస్టర్ల ఎదురుచూపులతో పాటు గతరాత్రి అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాల ముగింపు నేపథ్యంలో నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. 
ఐటీసీ, ఇన్ఫ్రాటెల్‌, ఇండియాబుల్స్‌ ఫైనాన్స్‌ హౌసింగ్‌ లిమిటెడ్‌, హెచ్‌పీసీఎల్‌, విప్రో షేర్లు 2శాతం నుంచి 4.50శాతం లాభపడగా, హీరోమోటోకార్ప్‌, కోల్‌ ఇండియా, బజాజ్‌ అటో, సన్‌ఫార్మా, టాటామోటర్స్‌ షేర్లు అరశాతం నుంచి 1.50శాతం లాభపడ్డాయి.



You may be interested

ప్రపంచ కుబేరుల్లో ముకేశ్‌ అంబానీకి 13వ స్థానం

Wednesday 6th March 2019

మొదటి స్థానంలో అమెజాన్‌ ఫౌండర్‌ బెజోస్‌ న్యూఢిల్లీ: ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఫోర్బ్స్‌’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీ 13వ స్థానంలో నిలిచారు. గతేడాదిలో 40.1 బిలియన్‌ డాలర్లు సంపదతో 19వ స్థానంలో ఉన్న ఈయన.. ఈ ఏడాదిలో 50 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రస్తుత ర్యాంక్‌కు ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ మంగళవారం వెల్లడించింది. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి

పాజిటివ్‌ ప్రారంభానికి సంకేతాలు

Wednesday 6th March 2019

క్రితం రోజు భారీ ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు బుధవారం సైతం పాజిటివ్‌గా ప్రారభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 22  పాయింట్ల మేర పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30  గంటలకు 11,055 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 11,033 పాయింట్ల వద్ద ముగిసింది.  గత రాత్రి అమెరికా సూచీలు  స్వల్పనష్టాలతో ముగిసిన నేపథ్యంలో నష్టపోయాయి.  తాజాగా 

Most from this category