STOCKS

News


10850పై ప్రారంభమైన నిఫ్టీ

Friday 1st February 2019
Markets_main1549003502.png-23934

ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 10851 వద్ద, సెన్సెక్స్‌ 56 పాయింట్ల పెరుగుదలతో 36312 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టడం, అలాగే నేడు ఫిబ్రవరి ఎఫ్‌అండ్‌వో సిరీస్‌ ప్రారంభంకానుండటం ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఎఫ్‌ఎంసీజీ, అటో రంగ షేర్లలో కొనుగోళ్లలో జోరుగా సాగుతున్నాయి. మెటల్‌, బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ క్యూ3లో కంపెనీ ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటంతో వేదాంత షేరు ఇంట్రాడేలో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 18శాతం నష్టపోయింది. నిఫ్టీ -50 సూచీలో హీరో మోటోకార్ప్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ప‌వ‌ర్ గ్రిడ్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు అత్యధికంగా లాభపడగా, వేదాంత‌, జేఎస్‌డ‌బ్ల్యూఎస్ స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, స‌న్ ఫార్మా, టీసీఎస్ షేర్లు నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

మళ్లీ పసిడి ‘‘డ్రీమ్‌ రన్‌’’

Friday 1st February 2019

- వాణిజ్య యుద్ధ భయాలు - అమెరికా ఫెడ్‌ ఫండ్‌ రేటు ఇక పెరక్కపోవచ్చని విశ్లేషణ - డాలర్‌ ఇండెక్స్‌ బలహీన ధోరణి - వెరసి అంతర్జాతీయంగా తిరిగి 1,300 డాలర్ల స్థాయిపైకి బంగారం - దేశీయంగా పుత్తడికి బలాన్నిస్తున్న రూపాయి పతన ధోరణి - పసిడి ధర పైకేనన్న అంచనాలు అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా పసిడి ధర మళ్లీ పరుగుపెడుతోంది. ఈ వార్త రాసే సమయానికి (రాత్రి 8 గంటలు) అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌ న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్చేంజ్‌లో పసిడి

బడ్జెట్‌ రోజు బెట్టింగ్‌ ఎందులో...?

Friday 1st February 2019

బడ్జెట్‌ రోజున స్టాక్‌ మార్కెట్లో రంగాల వారీగా కంపెనీల షేర్ల ధరల్లో భారీ హెచ్చు తగ్గులు చోటు చేసుకోవచ్చు. ప్రభుత్వం తీసకునే నిర్ణయాలు ఇందుకు కారణం అవుతాయి. కొన్నింటికి పాజిటివ్‌గా, కొన్ని రంగాలకు నెగెటివ్‌గా, మరికొన్నింటికి తటస్థమైన నిర్ణయాలు బడ్జెట్‌లో ఉంటుంటాయి. ఈ నిర్ణయాల ఆధారంగా ఆ రోజు ట్రేడర్లు, ఇన్వెస్టర్లు పొజిషన్లకు మొగ్గు చూపుతుంటారు. మరి ఈ దఫా కేంద్రంలోని మోదీ సర్కారు లోక్‌సభ ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న

Most from this category