STOCKS

News


జూనియర్‌ నిఫ్టీ జోరు..!

Tuesday 17th July 2018
Markets_main1531819671.png-18398

ముంబై:- ఎన్‌ఎస్‌ఈలో నెక్ట్స్‌ నిఫ్టీ-50గా పేరు మార్చుకున్న జూనియర్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మంగళవారం ఇంట్రాడేలో జోరును కనబరుస్తోంది. ఇటీవల బాగా పతనమైన మిడ్‌క్యాప్‌ షేర్లలో నేడు కొనుగోళ్లు వెల్లువెత్తడంతో నెక్ట్స్‌ నిఫ్టీ-50 సూచీలో షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఫలితంగా ఈ సూచీ నేటి ట్రేడింగ్‌లో 1.50శాతం లాభపడి 27,943 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నాం గం.2:40ని.లకు నెక్ట్స్‌ నిఫ్టీ-50 సూచి 1.20శాతం లాభపడి 27,907ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  ఈ సూచీలో మొత్తం 50షేర్లకు గానూ 40షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇదే సమయానికి ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, బ్యాంకు ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, పీఎఫ్‌సీ, భెల్‌ షేర్లు టాప్‌ - 5 స్థాయిలో కొనసాగుతూ, 5 వరుకు లాభపడ్డాయి. మరోవైపు ఇదే సూచీలో కోల్గేట్‌, జనరల్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా(జీఐసీ), మారికో, బ్రిటినియా, శీర్రాం సిమెంట్స్‌ షేర్లు టాప్‌ - 5 లూజర్స్‌ ట్రేడవుతూ, 1.50శాతం నుంచి 1శాతం లాభపడ్డాయి.



You may be interested

అదరగొడుతున్న ఆటో షేర్లు

Tuesday 17th July 2018

ముంబై:- అటోరంగ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో అదరగొడుతున్నాయి.  ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ నేటి ఇంట్రాడేలో 1.50 వరకూ లాభపడింది. ముఖ్యంగా ఈ రంగంలో హెవీ వెయిట్‌ షేర్లైన మహీంద్రా అండ్‌ మహీంద్రా, అశోక్‌ లేలాండ్‌ షేర్లు ఇండెక్స్‌ను లాభాల బాటలో నడిపించాయి. ఫలితంగా నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 1:50 శాతం లాభపడి 10,981 ఇంట్రాడే హైని నమోదు చేసింది. ఈ సూచీలోని ఐషర్‌

ఈ స్టాకులపై మ్యూచువల్‌ ఫండ్స్‌ మక్కువ

Tuesday 17th July 2018

జూన్‌లో ఎంఎఫ్‌లు వాటాలు పెంచుకున్న షేర్లు దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ జూన్‌లో కూడా కొనుగోళ్లకే మొగ్గు చూపాయి. దీంతో జూన్‌లో ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ 23.4 లక్షల కోట్ల రూపాయలకు చేరి రికార్డు సృష్టించింది. ప్రతి పతనంలో ఎంఎఫ్‌లు కొనుగోళ్లకు దిగుతున్నాయి. దాదాపు 30 స్టాకుల్లో ప్రస్తుతం ఎంఎఫ్‌లు 2 శాతానికి మించి వాటాలు పెంచుకున్నాయి. జూన్‌లో ఎంఎఫ్‌లు ఇష్టపడిన షేర్ల వివరాలు.. - ఐటీసీలో పదికి పైగా ఎంఎఫ్‌లు 2

Most from this category