STOCKS

News


10670పైన కొనసాగితే అప్‌సైడ్‌!

Monday 15th April 2019
Markets_main1555316937.png-25139

నిఫ్టీపై నిపుణుల అంచనా
సోమవారం నిఫ్టీ అప్‌మూడ్‌లో కొనసాగుతోంది. క్రమంగా 116900 పాయింట్ల వరకు చేరింది. గతవారం కదలాడిన 11550- 11700 రేంజ్‌ పైఅవధిని చేరింది. వీక్లీ చార్టుల్లో నిఫ్టీ లోయర్‌హై, లోయర్‌లో ఏర్పరిచింది. దీంతో ఏడువారాల అప్‌ట్రెండ్‌ తర్వాత తొలిసారి డైన్‌సైడ్‌ సంకేతాలు ఇచ్చినట్లయింది. అయితే తిరిగి సోమవారం నిఫ్టీ స్థిరంగా అప్‌మూవ్‌ కొనసాగించడంతో ట్రేడర్లు అయోమయంలో ఉన్నారు. నిఫ్టీ ప్రస్తుత కదలికలను చూస్తే 11550 పాయింట్లను కాపాడుకున్నంత కాలం భారీ డౌన్‌సైడ్‌ ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ స్థాయిని కోల్పోతే 11400 పాయింట్ల వరకు పతనం ఉండొచ్చు. నిఫ్టీ డైలీ చార్టుల్లో మార్నింగ్‌స్టార్‌ డోజీ ఏర్పరిచింది. దీంతో పైస్థాయిల్లో నిఫ్టీ ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలున్నాయి.

ఒకవేళ నిఫ్టీ 11670 పాయింట్ల పైన స్థిరంగా కదలాడితే మరింత అప్‌మూవ్‌ ఉంటుంది. ఈ స్థాయి గతవారం గట్టి నిరోధంగా పనిచేసింది. అందువల్ల నిఫ్టీలో ర్యాలీకి ఈ స్థాయి పైన స్థిరంగా కొనసాగడం అవసరం. ఈ స్థాయిని దాటలేకుంటే మరోమారు రేంజ్‌లో దిగువ అవధి 11550 పాయింట్లను టచ్‌ చేయవచ్చు. నిఫ్టీ దిగువన అన్ని మద్దతులు కోల్పోయి 11440 పాయింట్లను కూడా పోగొట్టుకుంటే తదుపరి 11360 పాయింట్ల వరకు దిగజారవచ్చు. బ్యాంకు నిఫ్టీ 30వేల పాయింట్ల పైన కొనసాగలేక పతనం స్టేజ్‌ని చేరింది. బ్యాంకు నిఫ్టీలో కన్సాలిడేషన్‌, కరెక‌్షన్‌ ముగిసిపోవాలంటే తప్పకుండా 30వేల పాయింట్ల పైన కొనసాగడం అత్యవసరం. ఒకవేళ 29వేల పాయింట్ల దిగువన క్లోజయితే ప్రస్తుత అప్‌ట్రెండ్‌ ముగిసిపోయి, బేర్స్‌ పట్టులోకి జారుతుంది.
పైవన్నీ నిపుణుల అంచనాలు. ట్రేడర్లు సొంత అధ్యయనంతో నిర్ణయాలు తీసుకోవాలి. 



You may be interested

మెటల్‌, అటో షేర్ల మెరుపులు

Monday 15th April 2019

మార్కెట్‌ ర్యాలీకి మెటల్‌, అటో షేర్లు అండగా నిలుస్తున్నాయి. ఆర్థిక మందగమన ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో మెటల్‌ షేర్లు, టాటామోటర్స్‌ ర్యాలీతో అటో షేర్లు లాభాల బాట పట్టాయి. మెటల్‌ షేర్లు:- అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ షేర్లకు డిమాండ్‌ పెరగడంతో దేశీయంగా మెటల్‌ షేర్లు మెరుస్తున్నాయి. చైనా ఎగుమతుల 5నెలల గరిష్టానికి చేరుకోవడంతో పాటు అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య చర్చలు తుదిదశకు చేరుకోవడంతో అంతర్జాతీయ ఆర్థిక మందగమనం తగ్గుముఖం

అరశాతం పెరిగిన బ్యాంక్‌ నిఫ్టీ

Monday 15th April 2019

ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్ల ర్యాలీ కారణంగా బ్యాంకు నిఫ్టీ సోమవారం అరశాతానికి పైగా ర్యాలీ చేసింది. నేడు బ్యాంకు నిఫ్టీ 29,983.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ప్రైవేట్‌ రంగ షేర్లైన కోటక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 1శాతం పెరిగాయి.  ఇండెక్స్‌లో వాటితో పాటు పీఎన్‌బీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, ఐడీఎఫ్‌సీఫస్ట్‌బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం ర్యాలీ

Most from this category